Sunday 25 March 2018

చంపక మాలిక


చంపక మాలిక
(ప్రజ-పద్యం)
సరసగతిం గవీంద్రునకు   జక్కగ చంపకమాల ఫోనులో
మరచితిరా! ననున్ గవులు మాన్య! యటంచును పల్కరించు నా
కరణిని దల్తునేని యది కారణ యుక్తమె యంచు దోచు నీ
ధరపయి పద్యగంధములు, తద్గత సౌఖ్యము లెల్లవారికిన్
సురుచిరమైన రీతి యతి సుందర భావపరంపరాయుతిన్
నిరతము బంచు యత్నమును నిష్ఠగ  జేయుచునుండి యిచ్చటన్
వరుసను ఛంద రాజముల వైభవ మింపలరార బంచుటన్
వరమయి వెల్గుచున్న ప్రజపద్య సభాంతర మందు సభ్యు లీ
తరి నిట నంతరంగముల  తన్నొక యింతయు నెంచకుండ తా
మరమరలేని స్పందనల నైనను జూపక పూర్వ కావ్య బం
ధురమగు  భావజాలముల తోడను జేరక మిన్నకుండగా
పరిపరి మానసంబునకు బ్రాకిన చింతకు చంపకంబు తా
నరయగ నీగతిం కవుల కందర కియ్యది చెప్ప బూని స
త్వరముగ నన్ను చేకొనుడు తన్మయతన్ హరుసంబు గాంచు డో
స్థిరయశులార యంచు నిట దెల్పగ బూనుట గాదె మాన్యులౌ
సరస గుణాఢ్యులార! శుభ సంస్కృత వర్తనులార! శీ ఘ్ర మీ
తరుణము మించకుండెడివిధంబున చంపక మాల నిచ్చటన్
మరి లిఖి యించ బూన వలె మానుట భావ్యమె పద్యరత్నమై
వరగతి వెల్గుచుండునది  వాస్తవ మియ్యది పల్కరండిలన్
నిరుపమమైన దీక్ష గొని నిర్మల సద్యశ మంద నెల్లెడన్.

No comments:

Post a Comment