Friday 2 October 2020

సంతానము

 

సంతానము

.

నాతనయుండు దత్సతియు నాతనుజాతయు సాధువర్తనన్

జేతమునందు సంతసము జేకుర జేయుచునుందు రెల్లెడన్

మాతకు నాకు నమ్రులయి మాన్యత నందెడి యోగ్యపద్ధతుల్

ప్రీతిగ నేర్చు కార్యమున విస్తృతహర్షము నందగోరుచున్.                        1.

చం.

చదువులలోన శ్రద్ధయును స్వాంతమునం దతులప్రమోదమున్

వదలని యత్నదీప్తియును భాగ్యవివర్ధకభావశుద్ధి యే

యదనుననైన సభ్యతల నందెడి తత్పరతల్ గలట్టి యీ

సదమల సంతతి న్గనిన సంతసముల్ సమకూరు నామదిన్                      2.

చం.

వినయవిధేయతల్ గలిగి విజ్ఞత నేర్చి నిరంతరమ్ముగా

జనకులమానసంబులకు సర్వవిధంబుల సౌఖ్యసంపదల్

గొనకొని కూర్చుచుండుటయె కోరికగా మది నెంచుచుండు

త్తనుజుల భక్తిభావమును దప్పక మెచ్చెద ప్రేమ జూపుచున్.                    3.

.

సురుచిరవర్తనంబునను శోభిలుచుండెడి నాతనూభవుల్

నిరుపమభాగ్యముల్ గనుచు నిత్యసుఖంబుల నందుచుండి తా

మురుతరసద్యశోవిభవ మున్నతలీలను గాంచి నిచ్చ లిం

దరుసము లందుచుండవలె నంచు మనంబున గాంక్ష చేసెదన్.                 4.

శా.

దైవంబున్ సతతంబు గొల్చెదను సద్భక్తిన్  మదీయాత్మజుల్

భావౌన్నత్యముగాంచి ధర్మపరులై ప్రజ్ఞావిశేషంబుతో

నేవేళన్ ముదమంద జూచుచు వరీయేచ్ఛాఫలం బీభువిన్

భావి న్నిత్యము నంద జూడు మనుచున్ వాత్సల్యమున్ జూపుచున్.            5.

 

హ.వేం.స.నా.మూర్తి.

03.10.20

అర్థాంగి

 

అర్థాంగి

 

శా.

నాయానందమె కోరుచుండి సతమున్ నాకీసమాజమ్మునన్

శ్రేయంబందగ జేయు కార్యములలో జేయూతగా నిల్చుచున్

స్వీయాంతస్స్థితసభ్యతాపరిమళశ్రీచే బ్రకాశించుచున్

నాయర్థాంగి ఘటిల్లజేయు బలమున్ నాయాత్మయై యన్నిటన్.   1.

 

శా.

నాలో ధైర్యము నింపుచుండు నెపుడున్ నానాప్రకారంబుగా

మేలైనట్టి విధాన బల్కు మమతోన్మేషంబు సంధించుచున్

వాలాయంబు మదీయచిత్తపటలిన్ బ్రహ్లాదమున్ నింపు తా

నీలోకంబున నాదు సత్వ మనగా నెంతేని ప్రేమంబునన్.   2.

 

శా.

సంతానంబున కందజేయును మహత్సవ్యానురాగమ్ము కా

సంతైనన్ శ్రమయంచు నెంచదుగదా యర్థంబు లందించుచున్

సంతోషంబును బొందుచుండును మనస్స్థస్వచ్ఛ భావంబులన్

జెంతం జేరుచు వారి యున్నతికినై క్షేమాది సంపత్తికై.   3.

 

.

పుట్టిన మెట్టినిండ్లకయి పూర్ణమనంబున సఖ్యతా స్థితుల్

గట్టిగ నాటజేయుటకు గానగు రీతి జరించు రెంటికిన్

గట్టిన సేతువో యనగ గర్మఠయై సతతంబు నిల్చు తా

నిట్టి సదాశయాఢ్య నిజ మీమెను మెచ్చెద నెల్లరీతులన్. 4.

 

శా.

నేనీరీతి జరించుచుండుట కిటన్ నిత్యమ్ము పద్యాబ్ధిలో

స్నానం బాడుచు నుంటకున్ కతమిదౌ సత్యమ్ము మున్ముందుగా

తానై శ్రోతగ మెచ్చుచుండుటయ విద్యాలంకృతన్ యోగ్యతా

స్థానన్ నాహృదయాధిదేవతను మోదం బందగా మెచ్చెదన్.  5.

 

.వేం..నా.మూర్తి,

26.9.20.

సహోదరులు.

 

సహోదరులు.

 

.

సోదరసోదరీమణులు శుభ్రగుణాఢ్యులు ధర్మవర్తనుల్

స్వాదువచఃప్రకాశితులు సన్నుతభావులు నన్ను జూచి

త్యాదరలీల బల్కెదరు తమ్ముడ! రమ్మని, వారి కేయెడన్

మోదము గూర్చుమా యనుచు మ్రొక్కెద నాజగదేకరక్షకున్.  1.

 

.

అందరిలో కనిష్ఠునిగ నౌటను జీరుచు వార లెల్లరున్

సుందరచిత్తశోభితులు సూనృతవర్తను లన్నిచోట్ల నా

నందము నాకు బంచుచును నాపయి బ్రేమను జూపుచుందు రా

వందన కర్హులై వెలుగు వారల నగ్రజులన్ నుతించెదన్.  2.

 

.

ఇది యీరీతిగనుండు దీనినిట నీవీరీతి జేయం దగున్

పదిలం బోయి విధంబు నేర్చి మనుమా భాగ్యంబులం గాంచుమా

ముద మేవేళల నందు మంచు ననుజన్ము న్నన్ను వాత్సల్యసం

పదతో నింపెడి యగ్రజాళికి నతుల్ వాంఛించి యర్పించెదన్. 3.

 

.

కంటికి రెప్పవోలె నను   గాచుచు నుందురు వీరలిందు నా

యింటికి నొంటికిన్ గలుష మింతయు జేరనిరీతి, నీకు మే

ముంటిమి భీతిచెంద కెపు డున్నత భావము లంది యుండ ని

న్నంటగ రాదు దుఃఖమని యంచును బ్రేమను జూపి నిచ్చలున్.  4.

 

.

అందరి కంటె పిన్నయయి యన్నిట దీవెన లందుచుండుటం

దందము, హాయి తృప్తియును హర్షము లిట్లని చెప్పనౌనె యీ

చందము లంద నీభువిని సాధ్యమె యందరి కార్యులార! నా

కందుట భాగ్య మంచనెద,  నగ్రజులన్ స్తుతియించుచున్ మదిన్. 5.

 

.వేం..నా.మూర్తి.

24.9.20.

బామ్మ

 

బామ్మ

ఉ.

అమ్మ దివంబు జేరి మము నాగని దుఃఖము నందు ముంచగా

గ్రమ్మిన చీకటిన్ దరిమి కానగు రీతిని సాకినట్టి మా

'బామ్మ' యనంతసత్వపరిపాలిత, సార్థకనామధేయ, 'దు

ర్గమ్మ', మమత్వ దీపిత, సురత్వము గాంచి గమించె మ్రొక్కెదన్.             1.

ఉ.

మాకును దండ్రికిన్ నిజము మాతగ వత్సలతాసుగంధమున్

జేకొను డంచు బంచుచును జేర్చుచు నక్కున ధైర్యదీప్తులన్

బ్రాకగ జేసి నెమ్మదిని బల్కులలోన  సుధాప్రవాహముల్

ప్రాకటమౌ గతిన్ సతము బంచిన 'బామ్మ'కు నంజలించెదన్.                   2.

ఉ.

ఆయమ జ్ఞానసంపదల నాత్మను నింపిన విజ్ఞమూర్తి,

త్యాయతకీర్తిసంయుత, ముదంబును గూర్చెడి సత్పథంబులా

ప్యాయత తోడ నందరకు నందగ జూపుచు గ్రామవాసులన్,

స్వీయకుటుంబసభ్యులను క్షేమసమీపము జేర్చె మ్రొక్కెదన్.                   3.

ఉ.

ధీయుత, ధర్మతత్వగుణదీపిత, యున్నతభావయుక్త ,మా

కేయెడ కష్టసంతతుల నిమ్మహి జేరగ నీయకుండ మా

నాయన కమ్మయై సతత నైష్ఠికయై మము దీర్చి దిద్ది ని

త్యాయతహర్షముల్ నిలుపు నామెను బామ్మను ప్రస్తుతించెదన్.               4.

ఉ.

కమ్మని వాక్యసంపద, యకల్మషభావము, తత్సమాన క

ర్మమ్ములతోడ నిచ్చలును మాన్యత గాంచిన దాప్తయౌచు దా

నిమ్మహి బంధువర్గమున నీయమ నందరు సొంతతల్లిగా

నమ్మిరి నేను నిత్యము ప్రణామము చేసెద బామ్మకున్ మదిన్.                 5.

ఉ.

ఈయమ స్వర్గమేగి కన నెన్నియొ యేండ్లు గతించె  నైన నా

కీయెడ నీమె నిల్చి నను నిందు భుజంబును దట్టుచుండి నా

ధ్యేయము నందు ధైర్యమును దెల్పుచు నుండిన రీతి గన్పడున్

గాయము బుల్కరించు మది గ్రమ్మును సత్వము బామ్మ నెంచినన్.         6.

 

 

.వేం..నా.మూర్తి.

23.9.20.

నాన్న

 

నాన్న

శా.

నారూపంబున దన్ను గాంచు కొరకై నా కీస్వరూపం బిటన్

ధీరోదాత్తు డొసంగె నా జనకు డా తేజోమయున్ ధీనిధిన్

గారుణ్యాత్ముని బుత్రవత్సలుని  సత్కారార్హునిన్  సద్గుణున్

బౌరోహిత్యమహత్వశోభితు నిటన్ బూజింతు  నెల్లప్పుడున్.                    1.

శా.

వ్రేలందించి ధరిత్రిపై నడచుటన్ బ్రేమప్రపూర్ణాత్ముడై

వాలాయం బెరుగంగ జూపి చదువుల్ ప్రజ్ఞానసంసిద్ధికై

మేలైనట్టి విధాన నేర్వదగు బల్మిన్ నింపి స్వాంతమ్మునన్

నాలోనున్న జడత్వ మెప్డణచు మా నాన్నన్ బ్రశంసించెదన్.                   2.

మ.

తనయుల్ పుత్రిక లెల్లరున్ సుఖములన్ దారంద యోగ్యమ్ములౌ

నసన్మార్గములన్ వచించె శుభసత్కార్యమ్ములన్ నిత్య జీ

వనయానంబున జేయగా దెలుపుచున్ భాగ్యోదయార్హంబులై

వినుతిం గూర్చెడి పద్ధతుల్ గరపె నా విజ్ఞున్ సదా కొల్చెదన్.                    3.

మ.

నను నీరీతిని భవ్యబోధనలచే నైజప్రభావమ్ముతో

దెనుగున్ సుందరభాషనున్ జదువగా ధీశక్తి నందించి నా

కనునిత్యోరుముదంబు లందగల భాగ్యంబందు సామర్ధ్యమున్

నవాత్సల్యముతోడ జూపు జనకున్ గైమోడ్చి యర్చించెదన్.               4.

మ.

తనసంతోషము నిచ్ఛసేయకయె  సంతానంబె యానంద జీ

వనసౌఖ్యంబులు గాంచ దా ననిశమున్ వాంఛించి తత్కార్యమం

దనఘాత్ముండయి సంచరించి సురలోకావాసముం గాంచు నా

జనకున్ జిత్తములో స్మరించెదను సచ్చారిత్రసంపద్యుతున్.                    5.

 

హ.వేం.స.నా.మూర్తి

22.9.20.

అమ్మ

 

అమ్మ

మ.

జననం బీభువిపై నొసంగి పలుకన్ శబ్దంబులన్ నేర్పి జీ

వనయానంబున కైన బుద్ధినిడి సవ్యంబైన మార్గంబునం

దనయం బిచ్చట సంచరించు గతులం దత్యుత్తమానందమున్

నతన్ నేర్పిన తల్లి కే నొసగెదన్ గైమోడ్పులన్ నిత్యమున్.                              1.

ఉ.

ఎన్నివిధాల గుందినదొ యేవిధి గష్టము లంది యున్నదో

తిన్నదొ లేదొ నందనుని ధీమతిగా నొనరించు కార్యమం

దున్నతమైన భావమున నుత్సవ మంచు దలంచుచుండి  నా

కన్నివిధాల యోగ్యతల నందగ జేసిన దమ్మ, మ్రొక్కెదన్.                      2.

మ.

జననీ! నీపదసీమయందు శిరమున్ సానందచిత్తమ్ముతో

వినయం బొప్పగ జేర్చి నిన్ను గొలుతున్ బ్రేమస్వరూపమ్ముతో

నను నీనందను నీసమాజమున సన్మానార్హునిన్ జేయు నీ

కెన లేరెవ్వరు వందనంబు లిట నీకేవేళ నందించెదన్.                                       3.

మ.

నిను దర్శించిన సంతసంబు గలుగున్, నీమాటలన్ విన్నచో

నమందారమరందబిందుతతులన్ గాంక్షించి  కొన్నట్లుగా

మనముబ్బున్ భవదీయ సమ్ముఖమునన్ మానంబు ధైర్యంబు నీ

తనయున్ నన్ను వరించు చుండు జననీ! దండంబు నీవందుమా!             4.

మ.

నిను సేవించెడి భాగ్యమించు కయినన్ నీవందగానీయ కో

జననీ! దేహము వీడియుంటి వెపుడో సత్యమ్ము మాతౄణ మీ

తనుజుం డేగతి తీర్చగల్గు? వినుమా త్వద్దర్శితాధ్వమ్మునం

దనయం బేను జరింతు నమ్రమతి నీకందింతు గైమోడ్పులన్.                  5.

 

.వేం..నా.మూర్తి.

16.9.20.