Monday 31 December 2018

2019 - నూతనాంగ్లవత్సరాది


అందరికీ నూతనాంగ్లవత్సరాది సందర్భమున
హృదయపూర్వక శుభాకాంక్షలు.
శా.
శ్రీమంతంబయి జీవనంబు నిరతశ్రేయంబులన్ గాంచుచున్
క్షేమం బందుచునుండ సాగవలె రాశీభూత మోదంబు లీ
భూమిం బర్వగ నూత్నవత్సరమునన్ బూర్వంబునుం బోలె నా
నా మాన్యత్వము జాతికంద వలయున్ నవ్యప్రయత్నంబునన్.                            1.
శా.
ఈయాంగ్లాబ్దము సౌఖ్యదాయకముగా నెన్నేని హర్షంబులన్
స్వాయత్తం బొనరించి పౌరజనులన్ సర్వార్థముల్ గూర్చుచున్
స్వీయాకాంక్షిత లక్ష్యసాధనకునై చేవల్ మదిన్ నింపుచున్
న్యాయం బీయెడ నిల్పి కావవలె సన్మానప్రదంబై యిటన్.                                     2.
మ.
తనకాలంబున భారతావనికి సద్భాగ్యప్రపూర్ణత్వమున్
నదీప్తిన్ గలుగంగ జూడగల దక్షత్వంబు చూపించి పా
వనచారిత్రము గల్గువారలిచటన్ బాలించు సౌభాగ్యముల్
పొనరన్ జేయగ స్వాగతింతు స్పృహలన్ బూరించ నీయబ్దమున్.                         3.
చ.
తమకగు ధర్మమందు బ్రజ  ధైర్యముతో జరియించుచుండి క్షే
మముగను భాగ్యమీ భువిని మన్నన జేయుచు గూర్చుచుండి వి
శ్వమున యశంబు నందగల వైనము నేర్పగ నూత్న వర్షమా!
క్షమతను జూపుమా యనుచు స్వాగత మీయెడ బల్కబూనెదన్.                           4.
ఉ.
స్వాగత మందుమోయి నవవత్సరమా! జగమందు నీవికన్
రాగమయాత్మవై హృదుల రమ్యత నిండిన సోదరత్వముల్
సాగగ జూడుమా క్షితిని సర్వవిధంబుల సాధు భావముల్
త్యాగగుణంబు నింపుచును  ధర్మము  నిల్పిముదంబు గూర్చుమా.            5.

హ.వేం.స.నా.మూర్తి.
01.01.౨౦౧౯

Tuesday 27 November 2018

కార్తీకమాసము


కార్తీకమాసము

కం.
శ్రీమంత మైన మాసము
క్షేమము లందంగ గోరు క్షితివారలకున్
నీమంబులు నేర్పించుచు
కామితములు దీర్చునదియె కార్తిక మనినన్.                                              1.
మ.
హరి యీకాలము నందు స్వామి యగుచున్ హర్షంబులం బంచు, నా
హరు డీవేళల నెంతయేని సుముఖుండై యుండు, కొల్వంగ తా
నురువాత్సల్యము జూపు భక్తులపయిన్ హుంకారముం జేసి యీ
నరులం జేరెడు దుఃఖసంతతులకున్ నాశంబు గల్గించుచున్.                            2.
చం.
హరిహర భేదముల్ గొనుచు నంతట సంకుచితాత్ములై భువిన్
తిరుగుచునుండు వారలకు తెల్పు నభేదము కార్తికంబు మీ
రరయుడు మానవుల్ మదుల నచ్యుత శంకరు లొక్కరే యిటన్
సురుచిర భక్తి భావమును చూపు డటంచును బోధచేయుచున్.                         ౩.
మ.
ఇది దామోదర మాసమోయి జనుడా! యిద్దాన నా శంకరున్
సదయున్ నిత్యము నిర్మలాత్ములగుచున్ సద్భక్తులై యర్చనల్
ముదమారంగను సల్పువారిని సుఖంబుల్ జీవనం బంతయున్
వదలం జూడవు మోక్షమందు తుద కీ వైనంబు నీ వెంచుమా!                           4.
శా.
ప్రాతఃకాలములోన జాగృతుడవై బ్రాహ్మీ ముహూర్తంబునన్
చేతశ్శుద్ధిని గాంచి స్నానవిధులన్ చెన్నొందగా జేసి యా
భూతేశున్ కరుణాలవాలు శివునిన్ పూజించు సద్భావనా
న్వీతస్ఫూర్తిని దాల్చుమోయి శుభముల్ నీకందు తథ్యంబుగన్.                             5.
ఆ.వె.
ఆశుతోషు డాత డీశుడు సత్యంబు
ధ్యాస నిలిపి యతని కోస మిలను
స్మరణ చేయువారి కురుతరైశ్వర్యంబు
లిచ్చు సర్వగతుల మెచ్చు కొనుచు.                                                         6.
మ.
సతమా శంకరు సన్నిధిన్ నిలిచి యస్మత్పాపసంఘంబులన్
శతసంఖ్య ల్గలవాని ద్రుంచు మనుచున్ సమ్యగ్విధానంబునన్
నుతులం గూర్చుచు  బిల్వపత్రములతో నూత్నానురాగంబు సం
తతముం జూపుచు పూజ చేసి శుభముల్ తథ్యంబు పొందం దగున్.                   7.   
మ.
అభిషేకప్రియు డౌట నాతని కెడన్ హర్షాతిరేకంబుతో
శుభముల్ గూర్చు మటంచు చేరి మదిలో శోభిల్ల సద్భక్తి యా
యభవున్ పావన నిర్మలోదకముతో నర్చించ తా నెల్లెడన్
విభవంబుల్ ప్రవహింప జేయునుగదా! వేరేల యోచించగన్.                                8.
మరి యేడాదికిగాని రాదు భువి కీ మాసంబు కార్తీక మో
నరుడా! జాగొనరింపకుండ మన మానాగేంద్ర హారాంకితం
బురుహర్షంబున జేయుమోయి భవ మీయుర్విన్ విచారించగా
స్థిర మొక్కింతయు గాదు సత్యము గదా సేవించుమా శంభునిన్.                           9.


27.11.౨౦౧౮.

 






Monday 22 October 2018

హాలికుడు


హాలికుడు

శా.
శ్రీమంతంబుగ జన్మభూస్థలమునుం జేయంగ నశ్రాంతమీ
వేమాత్రంబును విశ్రమించ కచటన్ హేమంబు పండించగా
నీమం బంది చరించుచుండెదవు నీ నిష్ఠాగరిష్ఠత్వమీ
భూమిన్ జూడగలేము వేరొక యెడన్ పూజ్యుండ వో హాలికా!                                 1.
మ.
ఉదయాద్రిన్ రవి చేరకుండినపుడే యుత్సాహముం జూపుచున్
మదిలో లోకహితంబు గోరెడి లసన్మంత్రంబులం బాడుచున్
సదయా! క్షేత్రము చేరబోదువుగదా! సత్యస్వరూపుండవై
యెదలో నెంచవు స్వీయ సౌఖ్యమెపుడున్ హే కర్షకా! సన్నుతుల్.                         2.
మ.
పొలమున్ దున్నెడివేళ, క్షేత్రమును సంపూర్ణప్రభావాన్విత
స్థలముం జేయగ నెంచు కాలమున, సస్యప్రాప్తికై నిచ్చలున్
హలముం దాల్చి చరించువేళ కృషకా! హర్షంబు నీ మోముపై
కౌలువై యుండును సత్య మియ్యది జగత్కల్యాణకాంక్షీ! నతుల్.                         3.
ఉ.
ఎండలు మండుచుండినను, నేర్పడ వర్షము దాపురించినన్,
దండిగ శైత్య మెల్లెడల దాకిన నైనను, స్వీయరక్ష లే
కుండినగాని బాధపడి యుద్యమమున్ త్యజియించకుండగా
నిండు మనంబుతోడ గణనీయత నందెద వీవు కర్షకా!                                           4.
తే.గీ.
సృష్టి కారకుడై యుంట స్రష్ట యయ్యె
బ్రహ్మ, భోజ్యంబు లీనేల వలసినటుల
పండ జేయుచు విశ్వాని కండ వైన
నీవు విష్ణుడ వని యందు నిజము కృషక!                                                 5.
శా.
సంతోషమ్ము, జగద్వికాసమునకై స్వార్థత్వమున్ వీడుటల్
సుంతైనన్ సుఖకాంక్ష లేకునికి, యస్తోకానురాగంబుతో
చింతాదూరుల జేసి దేశజనులన్ క్షేమాఢ్యులం జేయు నీ
పంతంబుల్ భళి! రైతుసోదర! మహద్భాగ్యాన్వితా! దండముల్.                          6.
శా.
సౌజన్యంబు వహించి ధాత్రిపయినన్ సౌభ్రాత్రముం జూపుచున్
తేజస్సంపద గూర్చుచుండు కొరకై దీవ్యత్ప్రయత్నంబుతో
నోజఃప్రాపక ఖాద్యసంచయము సద్యోగంబుగా నెంచి నీ
రేజాక్షాచ్యుతతుల్య! కర్షకవరా! ప్రేమన్ సమర్పించవే!                               7.
మ.
కృషియే యోగముగా దలంచి యిచటన్ కీర్తిప్రభావాన్వితా!
వృషగోసంమహత్త్వతత్త్వవిలసద్విజ్ఞానసంపత్తులన్
ఋషితుల్యత్వమునంది పంచెదవు నీ వెల్లప్పుడున్ గర్షకా!
ఝషనక్రాకులవార్థిసంవృతభువిన్ శాంతస్వరూపుండవై.                                      8.
చం.
అలిగెడి తత్వమించుకయు నంటని సంయమి వీవు కర్షకా!
ఇలపయి నొక్కలిప్తయును నేవిధి నైనను హర్షసంతతుల్
కలుగునె కిన్కబూనుచు స్వకార్యము చేయకయుందువేని నిన్
సలలిత భావనాస్పదుని సన్నుతి చేసెదనోయి హాలికా!                                       9.
ఉ.
ధన్యుడవీవు, లోకమున ధర్మపథంబున సాగునట్టి స
మ్మాన్యుడవీవు, నిత్యము సమాజహితంబును గోరుచుండి సౌ
జన్యము పూనియుండెదవు సర్వజగంబుల కన్నదాతవై
దైన్యము గూల్చివేసెదవు తథ్యము నీసము లెవ్వరీ భువిన్.                                    10.
ఉ.
లేమికి జంకబోవు, కనలేదు సుఖంబులనంచు నెప్పుడున్
నీమము దప్పబోవు, మదినిండిన లోకహితైకకాంక్షతో
నేమరకుండ సాగెద వదేమని పంటకు తగ్గ మూల్యముల్
రామిని బల్కబోవు భళిరా! కృషకోత్తమ! నీకు సన్నుతుల్.                                  11.
ఉ.
పచ్చదనంబు పైరులకు ప్రాకినవేళ, సుమార్పితంబులై
హెచ్చగు సుందరత్వమున నిమ్మహి నయ్యవి వెల్గు వేళలో
పెచ్చుగ ధాన్యరాశులను వేడుక మీరగ నిచ్చువేళ నీ
వచ్చట తన్మయత్వమున నందెద వద్భుతహర్షదీప్తులన్.                                      12.
ఉ.
పండిన పండకున్న ననువర్షము నీ కడుపెండుచున్న లే
కుండిన వర్షపాత మెటులుండిన నైనను కాల మేగతిన్
నిండిన కష్టసంతతులు నిత్యము జీవనమందు నండయే
ఖండితమైన గాని విముఖత్వము గాంచము నీముఖంబునన్.                       13.
ఉ.
విశ్వము నాకుటుంబ మను విజ్ఞత నిండిన మానసంబునన్
నశ్వరమైన జీవిక ననంతచిరస్థిరసద్యశంబులున్
శాశ్వతసౌఖ్యసంపదలు సర్వజనంబుల కార్తిహర్తవై
యీశ్వరసన్నిభా! యభిలషించక పొందెదవోయి హాలికా!                                     14.
శా.
నీ సద్భాగ్యము వర్ణనీయముకదా! నీకన్ననత్యున్నతుల్
వాసిం గాంచిన వారలేరి భువిలో స్వార్థంబునన్ దేహమం
దాసం జూపనివారు లోకులకునై యౌరా! ముదంబందుచున్
గాసిం గాంచెడివారు హాలికమణీ! కైమోడ్పు లందందగున్.                                   15.



దుర్గాస్తుతి


దుర్గాస్తుతి
అనుష్టుప్
వందేహం పార్వతీం దుర్గాం
గౌరీం కల్యాణకారిణీం
సర్వపాపహరాం దేవీం
శంకరార్ధాంగినీం శివాం. 

ధనధాన్యప్రదాత్రీం చ
విద్యావైదుష్యదాయినీం
సర్వసౌభాగ్యదాం దేవీం
వందేహం శాంకరీం శుభాం.

సర్వలోకార్తిసంహర్త్రీం
సర్వలోకైకమాతరం
సర్వానందప్రదాం దేవీం
వందేహం శక్తిరూపిణీం.
దుర్గాస్తుతి
రథోద్ధత

అంబికా మతికృపామయీం శివాం
చంద్రశేఖరతనుస్థితాం శుభాం
దుష్టదానవవిఘాతినీ మహం
ప్రత్యహం త్విహ నమామి తా ముమామ్.

భక్తపాలనపరాం శివంకరీం
ముక్తికాముకజనైకపూజితాం
శక్తిశోభితమహత్వదాయినీం
ప్రత్యహం త్విహ నమామి తా ముమామ్.

సర్వమానవసురార్చితాం లసత్
పుత్రవత్సలయుతాం మహేశ్వరీమ్
బుద్ధివైభవసుఖప్రదాయినీం
ప్రత్యహం త్విహ నమామి తా ముమామ్.

Wednesday 17 October 2018

స్వాతంత్ర్యము-ప్రజాస్వామ్యము


స్వాతంత్ర్యము-ప్రజాస్వామ్యము
మ.
అవురా! భారతవాసి! నీదుచరితం బత్యున్నతంబౌచు నీ
యవనిన్ వెల్గుచునుండె సత్యముగదా! యన్యత్ర నిన్ బోలు వా
రెవరున్ లేరు, ప్రయత్నపూర్వకముగా నెందేనియున్ గాంచినన్
శ్రవణానందకరంబు నీయశము హే సత్త్వాఢ్య! వీక్షించుమా!                                       1.
మ.
మనమందున్న సమస్త భావగములన్ మాన్యుండ నేనంచు నీ
వనయం బెంచుచు నిచ్చవచ్చిన గతిన్ హాస్యంబు గాదోయి భూ
జను లేరీతిని గుందుచుండిన నిటన్ స్వాతంత్ర్య మిందుండుటన్
నమంచున్ బలుకంగ జూతువు భవత్ కార్యంబు చేకూరగన్.                                  2.
శా.
నీయిష్టంబగురీతి కర్మములలో నిత్యంబు నీ సౌఖ్యమే
ధ్యేయం బంచు దలంచుచున్ పరుల యస్తిత్వంబునుం గూల్చగా
న్యాయంబున్ బరిమార్చ చేకొనెడి నీ నవ్యప్రయత్నంబు త్వత్
స్వాయత్త ప్రతిభావిశేషము ప్రజాస్వామ్యమ్ము నందుండుటన్.                               3.
మ.
అవినీతిం గొని సంమందు సతతం బత్యంత మోదంబుతో
జవసత్త్వంబులు ధారపోసి నిరతస్వార్థంబు చూపించుచున్
నవసౌఖ్యంబులు గాంచుచుండుట యనన్ న్యాయంబు నీకౌనులే
స్తవనీయా! వసియించుచుంటివిగదా! స్వాతంత్ర్యదేశంబునన్.                              4.
శా.
సమ్మెల్ సేయుట, నిత్య మెల్లగతులన్ శక్తిన్ బ్రదర్శించుటల్,
దమ్మంబంచు దలంచి సాంఘిక మహత్ సంపత్తులన్ గూల్చుటల్,
నమ్మం జూపుచు మోసగించుటయె సమ్మానంబుగా నెంచుటల్
సమ్మోదాత్మకమౌను నీకివి ప్రజాస్వామ్యమ్మునందుండుటన్.                              5.
చం.
మతముల్ మార్చుట స్వల్పతుచ్ఛ సుఖసన్మానంబులన్ గోరుచున్,
చతురత్వంబున వైర మొండొరులకున్  సంధించుటల్, పూని స
న్మతి చూపించక స్త్రీల,వృద్ధ జనులన్ బాధించున ట్లాడుటల్
శతశాతమ్మును సవ్యమార్గమె ప్రజాస్వామ్యమ్ము నీదౌటచేన్.                                    6.
మ.
ధరలాకాశము నంటజేయుటయు, శ్రద్ధాసక్తులన్ పౌరులన్
కరుణాలేశము లేక సర్వగతులన్ గష్టంబులన్ ద్రోయుటల్,
నిరతానందము గోరి దీనజనులన్ నిస్త్రాణులన్ జేయుటల్
వరకార్యంబులు నీకు నైనవి ప్రజాస్వామ్య ప్రభావంబుచేన్.                                       7.
మ.
కులధర్మంబులు వీడుచుండుట, యసత్క్రూరత్వభావంబులన్
కలలోనైనను వీడకుండుట, బృహత్కాంక్షన్ పరౌన్నత్యముల్
తొలగంద్రోయగ జూచుచుండుటయు, సంతోషమ్ముతో నంతటన్
ఛలమున్ నింపుట కేక కారణముపో స్వాతంత్ర్యమన్నింటిలోన్.                                 8.
శా.
స్వాతంత్ర్యమ్మున కర్థమీగతి ప్రజాస్వామ్యమ్మునన్ మారి యీ
జాతిన్ దుఃఖ మహాబ్ధి ముంచెను గదా! సంస్కార మీ మానవ
వ్రాతంబందు జనింపజేసి జగతిన్ రక్షించగా రమ్ము హే
ధ్యాతృక్షేమకరా! సమస్త సుఖదా! దండంబు సర్వేశ్వరా!                                           9.

Saturday 13 October 2018

భారతీయం - పైడిమాంబ


భారతీయం - పైడిమాంబ
శా.
శ్రీమంతంబగు భూమి సర్వగతులన్ శ్రేయంబు లందించు స
ద్ధామంబై వెలుగొందు దేశమిది విద్యావైభవోపేతమై
ధీమంతంబను కీర్తిగన్నయది యుద్దీప్తప్రభారాశిగా
నామౌన్నత్యము గాంచె భారతము సన్మానార్హమై యంతటన్.                  1.
శా.
వేదస్థానముగా గణింపబడుచున్ విజ్ఞానసంపత్తితో
మోదంబందరి కందజేయు పనిలో ముఖ్యత్వముం బొందుచున్
నాదబ్రహ్మముగా సమస్తజగతిన్ నవ్యాచ్ఛసత్కీర్తి యీ
నాదేశంబు వహించియుండె నిరతానందాబ్ధిలో దేలుచున్.                               2.
చం.
మునులకు పుట్టినిల్లు, బహుమూల్య సుఖంబుల కాటపట్టు, జీ
వనమును మాధురీవిభవభాగ్యయుతంబుగ మార్చగల్గు పా
వననభావజాలముల పాదు, సమస్త సురేంద్రసం సం
జనిత మహత్వదీప్తిగల స్థానము భారతభూమి చూడగన్.                                3.
ఉ.
సత్యము, ధర్మవర్తనము, సన్నుతి గాంచగలట్టి శబ్దముల్,
నిత్యసుఖంబుపొందగల నిర్మలభావపరంపరావళుల్
కృత్యములందు ఠీవియును, గేహములందు పవిత్రతాస్థితుల్,
ప్రత్యహ మీశ్వరార్చనలు భారత దీప్తికి మూలమంత్రముల్.                            4.
శా.
ఎన్నోభాషలు, నెన్నియో మతము, లింకెన్నెన్నొ వేషంబులున్,
మన్నించందగు భోజ్యభేదములు, సమ్మానార్హసంస్కారముల్,
మున్నీనేలను జూడనట్టి గతు లీభూమిన్ గనన్ వచ్చు నా
యన్నింటన్ నసంస్కృతీవిభవదీవ్యద్వ్యాప్తి  యొప్పారెడిన్                     5.
సీ.
పర్వంబు లీనేల సర్వోత్తమంబులై
గర్వకారణములై పర్వియుండె
ధర్మంబు లిచ్చోట కర్మంబు లన్నిటన్
నిర్మలత్వము చాట నిలిచియుండె,
సంస్కారమును జూపు సంస్కృతీగంధాలు
వ్యాప్తంబులై యుండె దీప్తులలర
ఉన్నతాదర్శాలు మన్నించు వచనాలు
నిత్యంబులై యుండె సత్యమిచట
తే.గీ.
విశ్వమందున్న దేశాలు విభవమందు
భరతభూమికి సరికావు, సురుచిరమగు
భారతీయత బహుగర్వకారణంబు
తలప పూర్వజన్మలతపః ఫలము భవము.                                                         6.
చం.
అనుపమ సంస్కృతీవిభవ మందిన భూమిగ నాంధ్రదేశ మీ
నమగు భారతావనిని గాంచె యశంబుల, నుత్తరాంధ్ర త
ద్ఘనతకు గారణంబులగు స్థానములన్ ప్రముఖంబు, దానిలో
కననగు ధార్మికత్వమున కాంతులనీను విశేషకృత్యముల్.                                    7.
తే.గీ.
విజయనగరాని కిలవేల్పు ప్రజలు కోరు
సౌఖ్యసంపద లత్యంత సత్త్వదీప్తి
గురియ జేయుచు వాత్సల్య భరిత యౌచు
వాసిగాంచిన జగదంబ పైడిమాంబ.                                                                    8.
ఉ.
ఆయమ కన్నతల్లియయి, యందర కండగ నన్నివేళలన్
శ్రీయుతమైన జీవనము, చిన్మయ సౌఖ్యములందజేసి, య
త్యాయతకీర్తు లీస్థలికి నద్భుతరీతిని గూర్చుచుండు, నా
ప్యాయత పంచుచుండు నతు లామెకు చేసెద పైడిమాంబకున్.                              9.
చం.
సిరిమానుత్సవభూమి నీ నగరిలో క్షేమార్థులై యందరున్
నిరతానందదయైన యంబ నెపుడున్ నిష్ఠాగరిష్ఠాత్ములై
"వరసంతోషము పైడితల్లి! యిడుమా, భాగ్యంబు లందించుమా
కరుణం జూపుమటంచు గొల్తురు గదా కల్యాణదన్ భక్తితోన్.                      10.
చం.
పరమ దయార్ద్రచిత్తయగు పైడిమ భక్తజనాల ప్రార్థనం
బురుతర వత్సలత్వమున నొప్పుగ నంది నిరంతరమ్ముగా
స్థిరమగు హర్షముం గలుగజేయుచు క్షేమము లందు రీతి స
ద్వరము లొసంగి గాచు బహుభంగుల తల్లులతల్లి గావునన్.                       11.
శా.
నీవీప్రాంతసమస్త పౌరగణమున్  నిత్యానురాగంబుతో
దేవీ! పైడిమ! రక్షసేతువుగదా! దేదీప్యమానోజ్జ్వలా!
భావంబందు వసించి బ్రోవదగు నో భాగ్యప్రదాత్రీ! భవత్
సేవన్ నిత్యనిమగ్నులై నిలిచి స్వస్తింగోరు త్వద్భక్తులన్.                    12.
సీ.
విజయనగరమందు విస్తృతం బగురీతి
హర్షసంతతు లెప్పు డలము నట్లు
ఉత్తరాంధ్రములోన నున్నతం బై వెల్గు
సద్యశో విభవంబు సాగునట్లు
యావదాంధ్రమునందు దేవి! నీకృప చేత
నిత్యసౌఖ్యంబులు నిండు నట్లు
భారతావనిలోన సారవంతములైన
విజయదీపిక లెల్ల  వెలుగు నట్లు
ఆ.వె.
సకల జనుల కిందు నకలంక భాగ్యంబు
లందుచుండునట్టు లనవరతము
పైడిమాంబ! కృపను ప్రసరింప చేయుమా
భయము గూల్చు నీకు జయము తల్లి!                                                    13.