Friday 2 October 2020

హనుమ

 హనుమ

.

హనుమానుండు మహత్ప్రకాశయుతుడై యత్యున్నతాకారుడై

ఘనదివ్యాభరణాఢ్యుడై వెలుగుచున్ గల్యాణముల్ గూర్చి యీ

జనసందోహము గావ దా నిలపయిన్ సర్వత్ర పూజాదులన్

గొనుచుండున్ గద యంజలించెద నిటన్ గ్రూరాసురార్యంతకున్. 1.

కం.

జయజయ పవమానాత్మజ!

జయజయ కరుణాలవాల! సచ్ఛుభశీలా!

జయజయ సీతాసన్నుత!

జయజయ ధీమంత! నీకు జయము కపీశా! 2.

 

.వేం..నా.మూర్తి.

22.9.20

No comments:

Post a Comment