సీతనపహరించి చేటు నందె. 104.
డండడ డడ డండ డండ డండడ డండమ్
దండంబులు నమ్రతతో
జెండాకొనరించ వలయు చేరుడు ఛాత్రుల్
మెండుగ డోలది మ్రోగెడు
డండడ డడ డండ డండ డండడ డండమ్ 105.
నరులే కారణము లంక నాశనమునకున్
నిరతము నామస్మరణము
జరుపుచు తన్మతయనంది సమరమునందున్
స్థిరులై నిలిచిన యా వా
నరులే కారణము లంక నాశనమునకున్ 106.
స్థిరవిక్రములున్ భ్రాతలు
ధరణీపతి పంక్తిరథుని తనయులు వారల్
వరగుణులున్ రాఘవు లా
నరులే కారణము లంక నాశనమునకున్ 107.
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్
శ్రీలక్ష్మీధవుడాహరి/శ్రీలలితా జగదంబిక
వాలిన విశ్వాసముంచి భక్త్యర్ణవముం
దేలుచు తనపై మందా
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్ 108.
తనయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్
అనయము "మాతా" యంచును
మనమున సద్భక్తిఁ బూని మహిమాన్వితయున్
ఘనదురితాపహ నా గిరి
తనయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్ 109.
వార్థిలో మున్గె భానుడు పగటివేళ.
రామచంద్రుండు సద్ధర్మరక్షకుండు
దుష్టు రావణు వధియించి దురితమడచు
టంత వినువీధి వీక్షించి యపుడు మోద
వార్థిలో మున్గె భానుడు పగటివేళ. 110.
అమృతమందదు తమకని యచట రాహు
వమరపంక్తిని చేరగ హరియది విని
శిరము ఖండించుటను గాంచి కరము మోద
వార్థిలో మున్గె భానుడు పగటివేళ. 111.
వికలాంగుడు రథము నడిపె వినువీధి పయిన్.
ఒక"పర్యాయము" పంగువు"
నకు జెప్పుడు, కృష్ణుడేమి నడిపెను? తారా
దిక మెచ్చటనో? యనగా
వికలాంగుడు, రథము నడిపె, వినువీధి పయిన్. 112.
భోగరక్తుడగు ముముక్షు వెపుడు.
జ్ఞానశూన్యుడైన మానవు డెల్లెడ
భోగరక్తుడగు, ముముక్షువెపుడు
సంగయుక్తుడయ్యు సర్వకాలములందు
చిత్త మెల్ల జేర్చు శివునియందు. 113.
జపము తపములంచు జగతిలో నిత్యంబు
దీప్తు లందు చుండు దీక్షితుండు
మోక్షమందలేడు మునివరుండైనను
భోగరక్తుడగు ముముక్షు వెపుడు. 114.
గడ్డము గీచుకొమ్మనుచు కాంతుడు భార్యకుఁ జెప్పెఁ బ్రీతితోన్.
అడ్డము, నిల్వుగీతలవి యందముగా రచియించి యాటలన్
దొడ్డగు "దాడి" యాటనిదె తొయ్యలి! యాడెద మింక రమ్ము నే
నొడ్డిగ కొన్నిరేఖలనిటుంచితి, వాటిని యంది నీవు సా
గడ్డము గీచుకొమ్మనుచు కాంతుడు భార్యకుఁ జెప్పెఁ బ్రీతితోన్. 115.
(వాటిని యంది నీవు సాగు, అడ్డము గీచుకొమ్ము- అని అన్వయం)
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు క్షురకర్మను మాని గడ్డం
పెంచుకోవడం సంప్రదాయంగా చూస్తుంటాం. అలా గడ్డం పెంచుకున్న భర్త మరియు అతని
భార్య ల మధ్య ప్రసవానంతరం జరిగిన సంభాషణ ఇలా ఉంది.
బిడ్డనుఁ జూపి పల్కె సతి "విజ్ఞుడ! నీవిటు గర్భరక్షకై
గడ్డము పెంచినావు, సుతు గాంచుము, దీక్షను మానుమింక నీ
గడ్డము గీచుకొమ్మనుచు", కాంతుడు భార్యకుఁ జెప్పెఁ బ్రీతితో
"నడ్డము చెప్పబోను సఖి! యట్టులె చేతు" నటంచు వేగమున్. 116.
రక్షణమ్ము నొసగు రాక్షసుండు
ఎల్లవేళలందు నింద్రాది దిక్పాలు
రిలకు శుభము(సుఖము)గూర్తు రింపుగాను
నమ్మి గొల్తుమేని నైరృతి కధిపతి
రక్షణమ్ము నొసగు రాక్షసుండు. 117.
(రాక్షసుడు = నైరృతి దిక్పాలకుడు)
పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్.
ఆ లలనామణి యాలం
బేలా పసివాని కిప్పుడింపుగను గుణిం
తాలన్ దిద్దించగ బల
పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్. 118.
బాణు రాజ్య మొసగు పరమ సుఖము
శోణపురము నందు శోభిల్లె నెవ్వాని
రాజ్య? మింక దాని రక్షసేయు
శివుని భక్తితోడ సేవింప నేమిచ్చు?
బాణు రాజ్య, మొసగు పరమసుఖము. 119.
తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.
సకలలోకైక మాతయై సర్వజనుల
కమిత వాత్సల్యపూర్ణయై యనవరతము
వరములొసగెడి గౌరిని భక్తితో స
తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు. 120.
జాలమే యవరోధమ్ము సాధకులకు.
మౌనధారణ జేయుచు మానితముగ
ముక్తి గోరెడు జనులకు, మునులకైన
నవని నైహికసుఖముల యందు మోహ
జాలమే యవరోధమ్ము సాధకులకు. 121.
ఇంపుమీరగ సుఖముల నిచ్చునట్టి
భార్య, మురిపించు సంతతి, బంధుజనులు,
క్షణిక మోదము నందించు సకలవస్తు
జాలమే యవరోధమ్ము సాధకులకు. 122.
బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు.
దీప్తు లొలుకంగ స్వారాజ్యదీక్షఁ బూని
బాల్యదశయందె ఘనుడు శివాజి యవుర!
చీల్చి చెండాడె మ్లేచ్ఛుల సేన నపుడు
బిడ్డడా వాడు? రణరంగభీకరుండు. 123.
మిస్సనార్యులు గురువులు మేలనంగ(మెచ్చునట్లు)
"బిడ్డడా వాడు రణరంగ భీకరుండ"
నెడు సమస్యకు నిష్ఠతో నేడికెన్నొ
పూరణంబులు పల్కిరి పూజ్యులగుచు. 124.
మద్యనిషేధచట్టమును మానినులెల్లఁ, తిరస్కరించిరే
సద్యశమందజేయునిక సౌఖ్యములిచ్చును స్వాగతించరే
మద్యనిషేధచట్టమును మానినులెల్లఁ, తిరస్కరించిరే(తిరస్కరించిరి+ఏ)
మద్యము సర్వశక్తులను మంటలగాల్చు, ధనంబు, కీర్తులన్
విద్యను, బంధుభావముల, వేగము గూల్చునొ దాని నెల్లెడన్. 125.
దశరథుడే, వనులకేగెఁ దపసులు మెచ్చన్
వశుడై యుండెను కైకకు
దశరథుడే, వనులకేగెఁ దపసులు మెచ్చన్
భృశమానందము చెందుచు
దశకంఠుని గూల్చువాడు దాశరథియికన్. 126.
ఆలిని త్యజియించెడి పతి హాయిగ నుండున్.
చాలించక పతిదూషణ
మాలించక వృద్ధసేవ లతినిష్ఠురయై(చోరిణియై)
మేలని జగడములాడెడి
యాలిని త్యజియించెడి పతి హాయిగ నుండున్. 127.
కల్ల లాడు వారు కవులు సుమ్ము.
కవియొకండు "నాదు కాంతమోమున కెందు
సాటి గాదు పూర్ణచంద్రు" డనగ
నతివ పల్కె నాథ! యవసరార్థం బెన్నొ
కల్ల లాడు వారు కవులు సుమ్ము. 128.
కవుల కాటరాదు కనుడను వాక్యాలు
కల్ల లాడువారు కవులు సుమ్ము
శబ్దచిత్రణాది సాహిత్యక్రీడల
నద్భుతంబు గొల్ప ననవరతము. 129.
వినుమసత్యములను వేరేమి యనవచ్చు?
అతివలనుటకేమి యాంధ్రమందు?
కావ్యరచన చేయు ఘనుల నేమందురు?
కల్లలాడువారు (కల్లలు + ఆడువారు) కవులు సుమ్ము. 130.
కడు దరిద్రుడు రాజయోగమ్మునందె.
జగతిఁ బ్రత్యక్షదైవంబు లగుచు నొప్పు
జన్మదాతల కత్యంత శ్రద్ధతోడ
సేవఁ జేయుచు నంకితభావమునను
కడు దరిద్రుడు రాజయోగమ్మునందె.
131.
యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్
సమరమునందు తానచట శస్త్రముఁ బట్టనటంచుఁ దెల్పి న్యా
యమునిక ధర్మమున్ నిలుప నర్జునసారథియౌచు నెల్లెడన్
భ్రమలను ద్రుంచి కృష్ణుడు శుభంబులు గూర్చగ గోరి చేయు సా
యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్ 132.
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
గణుతిని బెంచు సంఘమున, కావ్యములన్ రచియించు శక్తి, స
ద్గుణముల రాశులిచ్చు, కవికోవిద నామము దెచ్చిపెట్టు స
న్మణినిభమైన పద్యకుసుమాలకు నిష్ఠను బూని చేయు పూరణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
133.
క్షణికములైన భోగములు కాంతలు, పుత్రులు గాన ముక్తికై
గణపతిఁ గన్నతల్లి పదకంజయుగంబున కెల్లవేళలన్
ప్రణతులు చేసి యంబికను భక్తిఁ స్మరించగ జేయునట్టి ప్రే
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
134.
కనులు లేనివాడు కన్ను గొట్టె. ( 29.06.2012)
తిరుమలేశుమహిమ లరయుడో జనులార!
మూక మాటలాడె ముదముతోడ
పంగు వద్భుతముగ పరుగులు దీసెను
కనులు లేనివాడు కన్ను గొట్టె. 135.
తులను పట్టునెడల గలుగు సుఖము. (30.06.2012)
నిర్మలాత్ములౌచు నిత్యము జగదంబ
నఖిలభక్తకోటి ననవరతము
కాచు తల్లి నిలను గాంచి మంగళహార
తులను పట్టునెడల గలుగు సుఖము. 136.
శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు. (01.07.2012)
సత్యధర్మాలు కాపాడి సత్వమొసగి
శాంతిసౌఖ్యాలు స్థాపించి జనులకెపుడు
హర్ష మందించలేకున్న నవనిలోన
శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు. 137.
దూతను వధించు, టెంతయు నీతియగును(02.07.2012)
చేయ దగినట్టి పని కాదు మాయతోడ
దూతను వధించు, టెంతయు నీతియగును
స్వామికార్యార్థియై వచ్చి సంప్రదించు
వానిఁ జూచుట గౌరవభావమునను. 138.
గురుపత్నిని గోరువాడె గుణవంతు డగున్.(03.07.2012)
గురుసేవయె విద్యార్థికి
పరమార్థముగాన గురుని భావనలేవో
కరుణం దెల్పుడటంచును
గురుపత్నిని గోరువాడె గుణవంతు డగున్. 139.
పితరుని వధించి తినునట్టి సుతుడె హితుడు. (04.07.2012)
కన్నవారిని పనివారిగా దలంచి
దూషణంబులు చేయుచు దుష్టుడగుచు
బాధపెట్టుచు నుండెడివాని కన్న
పితరుని వధించి తినునట్టి సుతుడె హితుడు. 140.
సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్. (05.07.2012)
శ్రీనందనందనా! దయ
తో నన్నున్ గావు మనుచు తోరపు భక్తిన్
బూనుచు తిరుమలగిరివా
సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్. 141.
శ్రీనిధి, జగదంబిక నా
దీనజనావన నతీవదివ్యచరిత్రన్
మానినిఁ బరమేశ్వరు దొర
సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్. 142.
పట్టు నాజానుబాహువే ప్రభువు మాకు. (06.07.2012)
రామచంద్రుండు దశరథరాజసుతుడు,
భువనములనెల్ల దయతోడ బ్రోచుకొరకు
సర్వసన్నద్ధుడైయుండి సతతము కను
పట్టు నాజానుబాహువే ప్రభువు మాకు. 143.
శిష్ట రక్షణ కోసము చేతిలోన
ధనువు బాణంబులను దాల్చి, ధరణి కెపుడు
క్షతిని తలపెట్టు దుష్టరాక్షసుల సిగను
బట్టు నాజానుబాహువే ప్రభువు మాకు. 144.
చిన్న సవరణ కలిగించె వన్నెలెన్నొ.(07.07.2012)
శ్రద్ధ బూనుచు విద్యార్థి సంరచించు
చిత్రమును జూచి కుంచెను చేతబూని
గురువు రంగును సరిచేసె నరయ నతని
చిన్న సవరణ కలిగించె వన్నెలెన్నొ. 145.
వంటఁ జేయలేనివాడు మగడ! (08.07.2012)
క్రొత్తవంటవాని గూర్చి యిట్లనె భార్య
పనికి రాడు వీడు పరమశుంఠ,
తరగలేడు కూర, తాలింపులా రావు,
వంటఁ జేయలేనివాడు మగడ! 146.
తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల. (09.07.2012)
విత్తమును గోరి ధర్మంబు విడిచిపెట్టి
సంబరంబున దేశాంతరంబు జేరి
తల్లిదండ్రులె గృహమున దలవనపుడు
తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల. 147.
తారతమ్యము లేదు సోదరులమనుచు
ప్రతిన బూనిరి పౌరులు బాల్యమందు
కులము పేరిట దేశాన గొడవలేల?
తల్లి! బాసను రోసిరి పిల్లలెల్ల. 148.
మాట తప్పువాడు మంచివాడు. (10.07.2012)
స్వార్థపరుడె భువిని పాలకాగ్రణి నేడు
కోట్లు మ్రింగువాడు గొప్పవాడు
బాస చేసినట్టి పనులను చేయక
మాట తప్పువాడు మంచివాడు. 149.
తండ్రి! నేర్పు విద్య తప్పుగాదె?(11.07.2012)
విశ్వమయుడు సర్వవిద్యాస్వరూపుండు
విష్ణువొకడె, యన్యవిద్యలేల?
దైత్యరాజ! దేవదేవునిఁ గాదని
తండ్రి! నేర్పు విద్య తప్పుగాదె? 150.
శ్రీరాముడు తల్లి యంచు సీతను బిలిచెన్.(13.07.2012)
వారించుచు హనుమంతుడు
కారణజన్ముండు, ప్రభువు ఘనతరశక్తిన్
నీరేజాక్షుడు వచ్చును
శ్రీరాముడు తల్లి! యంచు సీతను బిలిచెన్. 151.
వారించుచు హనుమంతుడు
భూరుహశాఖములనుండి భువనావనుడౌ
కారుణ్యాత్ముడు వచ్చును
శ్రీరాముడు, తల్లి! యంచు సీతను బిలిచెన్. 152.
పెండ్లి కాని పిల్ల బిడ్డను గనె(13.07.2012)
అతివ యొకతె భువిని అరువదేండ్లకుగూడ
పెండ్లి కాని పిల్ల, బిడ్డను గనె
నరయ చెల్లెలేమొ పరిణయంబాడుచు
యుక్తవయసులోన యోగ్యయనగ. 153.
చెడువానిం గొలువ సిరులు చేకురు మనకున్.(14.07.2012)
ఉడుపతిని శిరముపైనిడి
బడుగుల కడగండ్లు దీర్చ పరమాత్ముండై
పుడమికి సత్వర మేతెం
చెడువానిం గొలువ సిరులు చేకురు మనకున్. 154.
వచ్చినపని సఫలమయ్యె, వైరము హెచ్చెన్. (18.07.2012)
"తెచ్చెను ముద్రిక పవనజు
డిచ్చెను జనకాత్మజాత కిక నాలంకన్
హెచ్చరికగ దహియించెను"
వచ్చినపని సఫలమయ్యె, వైరము హెచ్చెన్. 155.
ఆంగ్లభాషయుండ, నాంధ్రమేల (21.07.2012)
తెలుగు దేశమందు దేదీప్యమానమై
యాంగ్లభాషయుండ, నాంధ్రమేల
దేశభాషలందు తిరముగా లెస్సయై
పూర్వవైభవంబు పొందగలుగు? 156.
కాకర! పూపూచి నిమ్మకాయలు కాచెన్. (26.07.2012)
మూకలుగా రోగంబులు
సోకిన జంబీరతరువు సుందరి! నీవున్
చేకొని సంరక్షించగ
కాకర! పూపూచి నిమ్మకాయలు కాచెన్.
157.
నారిని బెండ్లియాడి గహనంబులకేగెను, సీత ప్రేమతో(17.9.12)
వారిజనేత్రఁ గోమలిని వైభవమొప్పగ రామభూవిభుం
డా రమణీలలామ జనకాత్మజ నెంతయు సుందరాంగియౌ
నారిని బెండ్లియాడి గహనంబులకేగెను, సీత ప్రేమతో
నా రఘునాథువెంట సుఖమంచును కానలకేగె నక్కటా!
158
రమణీ! రమ్మనెను సీత రాముని గనుచున్.(05.10.12)
రమణీయగుణాభరణా!
కమలాయతనేత్ర! నాథ! ఘనతరకీర్తీ!
మమతాపూర్ణా! రఘువీ
రమణీ! రమ్మనెను సీత రాముని గనుచున్. 159
వక్త్రంబుల్ పది గలిగిన వానికి జేజే.(06.10.12)
దిక్త్రాసము గలిగింతువ?
ధిక్, త్రుంచెద నిన్నటంచు దితిసుతునిమెడన్
యోక్త్రంబు వేసి లాగెడు
వక్త్రంబుల్ పది గలిగిన వానికి జేజే.
160.
కుంతికి నైదుగురు సతలు గుణసంపన్నుల్.
(09.10.2012)
పంతులు గారడుగంగా
సుంతైనను జంకులేక సునిలకుమారుం
డెంతయు తడబడ కిట్లనె
కుంతికి నైదుగురు సతలు గుణసంపన్నుల్.
161
పితృదేవుల పూజసేయ పెనుపడు, నిడుముల్(15-10-2012)
క్షితిలో సుఖసంపత్తులు
పితృదేవుల పూజసేయ పెనుపడు, నిడుముల్గతిలేక పారిపోవును
సతతము సంతసము గలుగు సత్వము హెచ్చున్. 162.
పతిని బాధపెట్టు వనిత సాధ్వి (16-10-2012)
అతిథిసేవ చేయు డమితానురాగాన
దీనజనుల జేరదీయుచుండి
మంచి మనసుతోడ మాటలాడుడటంచు
పతిని బాధపెట్టు వనిత సాధ్వి 163.
అవధానము చేయువార లల్పులుగాదే(20.10.2012)
స్తవనీయులు దీక్షితులై
యవధానము చేయువార లల్పులుగాదేయవధానుల శ్రమ నెరుగక
కువిమర్శలు చేయువారు కుంభినిలోనన్
164.
దయ్యమె దైవమును, చంపి ధరపై వెలసెన్(21.10.2012)
అయ్యా! నిజముగ జూచిన
దయ్యమె దైవమును, చంపి ధరపై వెలసెన్
కయ్యాలమారి యసురుల,
నెయ్యంబును నింపి గూర్చ నిత్యసుఖంబుల్. 165.
కీచకుడు పెండ్లియాడె లంకిణిని మెచ్చి. (22-10-2012)
అజ్ఞాతవాసాన నలనాడు కృష్ణను
కాంక్షించె నెవ్వాడు కామమునను?
పరమభక్తుడు జాంబవంతుడర్పించిన
కన్యకామణినంది కమలనాభు
డేమి చేసెను? లంక కినుమడించిన శక్తి
నెవరిని తాటించి యేగె హనుమ?
దశకంఠు నెంతయో దయజూచి దీవెన
లిచ్చె నెందులకప్పు డీశ్వరుండు?
ఛాత్రగణములు మీరలాసక్తు లగుచు
చెప్పుడని యన్న క్రమముగా నొప్పుమీర
ఉత్తరంబులు కాగల వుత్తమముగ
కీచకుడు, పెండ్లియాడె, లంకిణిని, మెచ్చి. 166.
అష్టమి శ్రేష్ఠమ్ము, పనుల నారంభింపన్(23.10.2012)
దుష్టాంతక నుమ గొలుచుట
కష్టమి శ్రేష్ఠమ్ము, పనుల నారంభింపన్
శిష్టాదిసకలజనులకు
నిష్టం బా విజయదశమి యిలలో నెపుడున్.
167.
తల్లికిఁ దనయకును, ధవుఁ డొకండె(05.11.2012)
యాత్రయందు జూడ నలసట కలిగెను
తల్లికిఁ దనయకును, ధవుఁ డొకండె
ప్రతిదినంబు చేయు వ్యాయామశక్తిచే
విశ్రమింతు ననక వెళ్ళుచుండె
168.
సిగరెట్టుల గాల్చదగును సేమము కొరకున్(09.11.2012)
పొగ త్రాగుట దుష్కృత్యం
బగణిత రుగ్మతల గూర్చు హానిద మటపై
వగ గలిగించును, ప్రోవిడి
సిగరెట్టుల గాల్చదగును సేమము కొరకున్ 169.
తనయునకును దండ్రికొకతె దారగ నయ్యెన్.(10.11.2012)
ఘనముగ నాగార్జునునకు
సినిమాలో సుందరాంగి శ్రీదేవి యిటుల్
మునుపా నాగేశ్వరునకు
తనయునకును దండ్రికొకతె దారగ నయ్యెన్.
170.
కారాగారమ్ము లొసగు కైవల్యమ్మున్(11.11.2012)
శ్రీరమణుడు వేంకటపతి
ఘోరాఘము లణచివేసి కోరికలెల్లన్
తీరగ వరమిడు, ద్రుంచును
కారాగారమ్ము, లొసగు కైవల్యమ్మున్ 171.
మమ్మీ సంస్కృతి యోగసాధకులకున్ మార్గమ్ముజూపున్ గదా. (12.11.2012)
అమ్మా! కావు మటంచు శుద్ధమతులై యత్యంతనమ్రాంగులై
సమ్మోదంబున లోకపావని శివన్ సద్భక్తి బూజించుచున్
నమ్మంగా గరుణించు, గూర్చును మహానందంబు చూడంగ సే
మమ్మీ సంస్కృతి యోగసాధకులకున్ మార్గమ్ముజూపున్ గదా.
172.
తిమిరమును పాఱఁదోలదు దీపపంక్తి(13.11.2012)
తిమిరమును పాఱఁదోలదు దీపపంక్తి
యనుట తగునేమి? యరయంగ ననవరతము
బ్రహ్మరూపాన హృదులలో వాసముండి
తమము హరియించు చుండంగ ధరణిలోన 173.
ధనువే సాధ్వి కరంబునందలరె నత్యంతోగ్రసర్పాకృతిన్. (14.11.2012)
మునుపా మాంత్రికు డొక్కరుండు సభలో మోదంబునుం గూర్చుచున్
తనశక్తిన్ బ్రకటించుచున్ క్రమముగా దండంబు సారించుచున్
వనితారత్నము చేతిలోని ధనువున్ బల్మారు మంత్రించగా
ధనువే సాధ్వి కరంబునందలరె నత్యంతోగ్రసర్పాకృతిన్. 174.