Sunday 10 May 2020

అమ్మకు నమస్కారం


అమ్మకు నమస్కారం
(ఉత్పలమాలిక)

మ్మను సన్నుతించెద ననంతయశో విభవాభిరామ తా
నిమ్మహి జన్మ మిచ్చి మహదిచ్ఛను జూపి సుతానురక్తితో
మ్మని భావజాలమును  కానగురీతిని మానసమ్ములన్
మ్మతి జూపునట్లుగ భృశంబగు ప్రేమను రంగరించి స
త్యమ్మును నమ్మునట్లుగను న్మయ మందుచు నింపుచుండి ని
త్యమ్మును సంతతిన్ బహుళ త్నము జేయుచు సాకుచుండి కృ
త్యమ్ములలోన సవ్యమగు ర్షము లందుట నేర్పుచుండి సం
మ్మును గావగా దగిన ర్మలు  జూపుచు జీవితమ్ము నం
మ్ముగ జేసికోగలుగు  దక్షత గూర్చుచు నుండి స్వార్థ మం
దెమ్మెయి గూరుకో దగని యింపగు సత్పథమందజేయుచున్
మ్మకమైన దారులను వ్య యశస్సులు గాంచు రీతులన్‌
మ్ముద మందుచున్ దెలుపు  ల్లని రూపము తల్లి, యామెకున్
మ్మత మైన మార్గమున క్కని వర్తన తోడ స్వీయ స్వాం
మ్మున సాధుభావము, సుధామయమై వెలుగొందు పల్కు,  హృ
ద్యమ్మగు సత్కృతుల్ నిలిపి ర్మము తప్పక లోకమందు పం
మ్మును బూని సజ్జనుల ధార్మిక దీప్తికి నడ్డుకట్టలై
చిమ్ముచు ద్వేషమన్ విషము క్షేమము గూల్చగ బూనువారి చి
త్తమ్ములలోని భూతమును ఛిన్నము జేయగ జేతనైన య
త్నమ్మును జేయుచున్ గనిన ల్లికి మోదము గూర్చువాడ మా
మ్మను నిర్మలాత్మ నిట న్నిట నున్నత మైనదానిగా
మ్ముచు గొల్చువాడ  జననంబున నుండి మనంబు నందునన్
కొమ్మని దేశభక్తి సమకూర్చుట చేతను జన్మభూమికిన్
మ్మయు శంకరాది సురర్యులు  మెచ్చిన భారతాఖ్యమౌ
యిమ్మహికిన్ నమస్కృతుల నిప్పుడు జేయుచు నాకు నిందు జ
న్మమ్మును జూపు నిర్మలకు మ్రత నమ్మకు నంజలించెదన్.

హ.వేం.స.నా.మూర్తి.
10.05.2020