Sunday 25 March 2018

" అమ్మకు పద్యాంజలి"


" అమ్మకు పద్యాంజలి"

శా.    శ్రీమంతంబగు జీవనంబు ప్రజకున్ శ్రేయస్కరంబౌవిధిన్
భూమిన్ బంచుచునుండి వారలకునై పూర్ణాయురారోగ్యముల్
క్షేమంబుల్ గలిగించగొల్చుచు సదా చిద్రూపినా యీశ్వరున్
నీమం బొప్పగనుండు మాతకిపుడున్  నేనిత్తు పద్యాంజలుల్.       .

కం.   నవమాసంబుల కాలము
భవమొసగగ గర్భమందు భరియించుచు నీ
యవనిన్ సంతతి జేర్చెడి
స్తవనీయకు నతులొనర్చి ధన్యుడ నగుదున్.                             .

సీ.     గర్భమందున్నట్టి యర్భకు రక్షకై
తనసౌఖ్యమును వీడ దడయకుండు,
తనయుండు కాళ్ళతో తన్నుచుండిన గాని
అనయంబు హర్షమే అనుభవించు
కదలలే డితడంచు ముదమార ననిశంబు
                నూడిగం బొనరించు నొప్పిదముగ
మాటలాడుట నేర్పు మమతాను రాగాల
నుగ్గుబాలన జేర్చు నున్నతముగ
.వె. నడకనేర్పుచుండి నానా విధంబులౌ
వాక్య వివరణంబు వరుస దెల్పు
మాతృమూర్తి కన్న మహిలోన వేరొండు
కలదె యెంచిచూడ నతరంబు.                                            .

తే.గీ.         సర్వ కాలంబు తనసంతు సకలగతుల
హర్ష మందంగ దలచు తా ననవరతము
స్వీయ సుఖమింత గోరని శ్రేష్ఠ జనని
మాట లేలేవు జనయిత్రి మహిమ దెలుప.                                   .

కం.   హృద్యంబనదగు రీతిని
పద్యాంజలు లేనొనర్తు భవదాయిని కా
విద్యా రూపిణియౌ నన
వద్యకు నమ్మాతకిచట భక్తిని నేడున్.                                        .

No comments:

Post a Comment