Sunday 25 March 2018

ప్రజ - పద్యం శుభోదయం


ప్రజ  - పద్యం
శుభోదయం
ఈభానూదయవేళ సత్కవితతో నీపద్య సంఘంబునున్
శోభిల్లంగను జేయుచున్న కవులన్ సూరిప్రజానీకమున్
ధీభాగ్యంబున సద్విమర్శకులుగా దీపిల్లు నవ్వారినిన్
లాభం బన్నిట నందుచుందురని నేశ్లాఘింతు నత్యంతమున్

ఆదైవం బిలలోన నందరకు తా నత్యున్నతైశ్వర్యముల్
మోదంబుల్ సుఖసంతతుల్ సతతమామోదించగా యోగ్యమౌ
వేదప్రోక్త విధాన సద్యశమిలన్ విజ్ఞాన సంపత్తులున్
నేదంపూర్వముగా నొసంగుటకునై నిత్యంబు ప్రార్థించెదన్.

No comments:

Post a Comment