Tuesday, 14 January 2020

గాంధీ-లాల్ బహదూర్


గాంధీ-లాల్ బహదూర్
సీ.
సత్యాగ్రహాలతో నిత్యసత్వము సర్వ
జనులలో కలిగించు ఘనుడొకండు,
సన్నుతాచారుడై సర్మార్గగామియై
ఆదర్శవంతుడౌ ఆర్యు డొకడు,
శాంత్యహింసలె మేటి శరములుగా దాల్చి
తెల్లదొరలు ద్రోలు ధీరుడొకడు,
నిస్స్వార్థసేవయే నిర్మలానందంబు
పంచగల్గెడునందు నెంచునొకడు,
తే.గీ.
వారు స్వాతంత్ర్యసమరాన వీరులగుచు
సత్తువను చాటు మహనీయ చరితు లిచట
గాంధి శాస్త్రులు నాయకాగ్రణులు నిజము
వారలకు పోలగలవారు లేరు భువిని. 

No comments:

Post a Comment