సంతతమ్ము
నిన్ను సంతోషదాయకున్
జింతలన్నివీడి
స్వాంతమందు
నంతకారిమిత్ర!
చింతింతు, దుష్టుల
చెంత
చేర బోను శేషశయన!
కల్లలాడబోను
కాంక్షించగాబోవ
నంతులేని
సిరుల నహరహమ్ము
నిన్ను
గొలుచుచుందు నిష్ఠతో, నవినీతి
చెంత
చేర బోను శేషశయన!
దీనజనులసేవ
మానకుండెదనయ్య
గురుజనాళి
నెపుడు కొలుచుచుండి
సంచరింతునయ్య
స్వార్థంబుతో నేరి
చెంత
చేర బోను శేషశయన!
మధురభావమెపుడు
మనమందు వెలుగొంద
జూడుమయ్య
యనుచు స్తుతులు సేతు
క్షణములోన
గూలు కాయమ్ము గావ నీ
చెంత చేర బోను శేషశయన!
నిఖిలలోకనాథ!
నీదయ నాపైన
నిలిచియుండెనేని
నిత్య మిచట
సత్యపథమునందు
సంచరింతును కల్ల
చెంత
చేర బోను శేషశయన!
నిన్ను
గొలుచుచుండి నీనామమంత్రమ్ము
నఘము
గూల్చు ననుచు ననవరతము
దలచువాడ
నౌట కలికాలకృత్యాల
చెంత
చేర బోను శేషశయన!
అతివలోని
మహిమ నార్యోక్త సూక్తుల
లోన
నెరిగియుంటి దీనబంధు!
ఆదరింతు
ననిశ మబలను, పాపుల
చెంత
చేర బోను శేషశయన!
జన్మభూమి
భువిని స్వర్గమ్ము కంటెను
మిన్నయౌట
దాని నన్నిగతుల
వృద్ధిచేయ
జూతు వినుమయ్య చెనటుల
చెంత
చేర బోను శేషశయన! 1413.
అసువు
కాయమందు నంటియుండినదాక
కష్టమైన
నోర్తు నిష్టపడుచు
ధర్మమందు
నిలుతు మర్మ మెంచెడివారి
చెంత
చేర బోను శేషశయన!
పరుల
హితము గోరి నిరతమ్ము శ్రమియింతు
వారి
కెట్టి హాని కోరబోను
దుర్మదాంధజనులతో
స్నేహ మర్థించి
చెంత
చేర బోను శేషశయన!
కలిగినంతలోన
నలఘుసంతోషమ్ము
గాంచి
కాల మిచట గడపుచుందు
జీవనమ్ముకొరకు
కేవలాఘమ్ముల
చెంత
చేర బోను శేషశయన!
పెండ్లిచేయ
బిలువ పెద్దలు ముదముతో
నాట్యమాడినాడ
నవ్యగతుల
దేహి
కిచట నిజము గైహికవిషయాల
చెంతజేర
"బోను"శేషశయన!
ఎలుకయొకటి
యచట నిలిపిన ఖాద్యంబు
తినగ
మనమునందు తీవ్రమైన
వాంఛ
గలుగ బారి వాయువేగంబున
చెంతజేర
"బోను"శేషశయన!.
No comments:
Post a Comment