Monday 15 March 2021

నాలుక

 


నాలుక

సీ.

        దేహి దేహములోని దీప్తాంగ చయమందు

                "జిహ్వ"ముఖ్యంబంచు జెప్పదగును

        దాని యగ్రమునందె మానదంబగు లక్ష్మి

                వసియించుచుండు నీ వసుధలోన

        "నాలిక"సరియైన మేలుగూర్చెడి మిత్రు

                లనిశంబు లభియింతు రనుట  నిజము

        "రసన"దుష్టంబైన రాక్షసత్వము గూడు

                బంధింపబడు జీవి పతితు డగును

తే.గీ.

        నరకమును గాంచు నిచటనె మరణము గను

        గాన "నాలుక"ననయమ్ము మానవుండు

        తన యధీనము నందుంచ నతయబ్బు

        దానికిని లొంగ క్షీణించు తథ్యముగను.

No comments:

Post a Comment