Sunday 7 March 2021

మహిళ

మహిళ

సీ.

అవనిపైనను జన్మ మతులసౌఖ్యము గాంచ

నందించు దేవత యామె "మహిళ"

సర్వోపచారాలు సలిపి మాటలు నేర్పి 

యడుగు వేయుట జూపు నామె "మహిళ" 

అన్నికార్యములందు నండయై నిల్చుచు

నాలోచనలు బంచు నామె "మహిళ"

ఘనతరానందాన గష్టంబులందైన 

ననుసరించుచు నుండు నామె "మహిళ"

తే.గీ.

ముదము బంచెడి యనురాగహృదయ "మహిళ"

శక్తిరూపిణి, సత్ప్రభాయుక్త "మహిళ"

అందముల ఠావు, సర్వత్ర వందనీయ,

చారుభావాఢ్య, జగతి కాధార మామె.


"అంర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు"

హ.వేం.స.నా.మూర్తి.

08.03.2021.


No comments:

Post a Comment