Monday 15 March 2021

గోచీ

నిర్దేశితాంశము

గోచీ

శా.

“కౌపీనమ్ము” మహత్ప్రభావయుతమై కాయమ్మునన్ మాన్యతల్

దీపిల్లంగను నంటియుండు, మదికిన్ తేజోమయస్ఫూర్తులన్

జూపించున్, మనుజాళిభావములలో శూన్యత్వముం గూల్చి స

ర్వాపత్తారక శక్తి కూత మగుచున్  రాజిల్లు సర్వమ్మునన్                                      1.

శా.

“గోచీగుడ్డ” శరీరభాగగతికిన్ గోప్యత్వమున్ గూర్చు నే

పేచీ పెట్టక నంతరూరుకముగా, విజ్ఞత్వముం జూపు న

ర్వాచీనంబగు వస్త్రధారణమునన్ రమ్యాభిధానమ్ముతో,

నేచింతల్ కలుగంగనీదు మదిలో నెప్పట్టునన్ గాంచినన్.                                     2.

శా.

దీనిన్ దాల్చని పూరుషుండు కలడా  దీప్తిన్ సదా గాంచుచున్,

మానోద్యానవిహారియై తిరుగుచున్, మన్నించి మర్యాదలన్

జ్ఞానాధారితవైభవప్రకరమున్ సర్వత్ర గాంచంగ,

ర్వానందస్థితి నంద నెంచుచు భువిన్ హాయిన్ మదిన్ గోరినన్  .                            3.

శా.

”కౌపీనము” యోగిసంమున కిం దీనేలపై గౌరవం

బాకాంక్షించిన రీతి దానొసగుచున్ హర్షంబు నందించు లో

కైకప్రాభవభాగ్యముల్ గలుగగా నత్యున్నతఖ్యాతికై

యేకాలంబును కారణంబగు ఛలం బేమాత్రముం జూపకే                                  4.

మ.

అవినాభావవిధాన బంధ మమరెన్ హాస్యమ్ముగా దిచ్చటన్

స్తవనీయంబగు “గోచి” కీనరునితో ధన్యత్వముం గాంచె, మా

నవసంఘం బిది యాగ్రహించదలచన్ నానావిధార్తస్థితిన్

జవసత్వంబులు గోలుపోవు ననుటల్ సత్యమ్ము లోకమ్మునన్.                            5.


No comments:

Post a Comment