Monday 18 April 2022

సుఖదేవ్

 సుఖదేవ్

సీ.

స్ఫూర్తి ప్రదాతయై సుందరాశయుడౌచు

స్వాతంత్ర్యసమరాన సాగువాడు,

విప్లవాత్మకభావవిస్తృతసత్వుడై

యాంగ్లేయ దొరల జెండాడువాడు,

"నవజవా"నాఖ్యతో నవ్య"భారతసభన్"

మించ శౌర్యము నడిపించువాడు,

చెరసాలలందున నిరతంబు చూపించు

తెల్లవారల నీతి దెగడువాడు

తే.గీ.

"భగతసింహుండు" , భారతీ భక్తుడైన

"రాజ గురుడు"ను మిత్రులై నైజశక్తి

కూత మొసగంగ

 "సుఖదేవు"డుత్సహించి

జన్మభూముక్తి సవనాన సమిధయయ్యె.

No comments:

Post a Comment