Monday, 18 April 2022

మహిళ

 

మహిళ

శా.

శ్రీమంతంబుగ విశ్వమున్ నిలుపుచున్ శ్రేయంబు లందిందించుచున్

ప్రేమస్వాంతగ సర్వకాలములలో విస్తారసత్వంబు లీ

భూమిన్ జేర్చెడి విజ్ఞయౌ మహిళకున్ పుణ్యప్రభావస్ఫురత్

క్షేమాకారకు వందనంబులివె రాశీభూతసౌజన్యకున్.                           1.

కం.

మహదానందము బంచుచు

నహరహము సమస్తజగతి కాధారంబై

మహిమను జూపుచు నుండెడి

మహిళకు నిదె వందనమ్ము మమతాస్థలికిన్.(మమతలగనికిన్)             2.

కం.

తల్లి, సహోదరి, చెలియై

యుల్లంబుల లోన నిల్పి యుత్సాహంబిం

దెల్లరకు హితము గూర్చెడి

సల్లలితాత్మను నుతింతు సదమల నతివన్.                                        3.

No comments:

Post a Comment