Thursday 30 March 2017

హేవళంబి-స్వాగతం



పళ్ళెరంబు నందు పావనం బైనట్టి

వస్తుచయము గాంచవచ్చునదిగొ


స్వాంతశుద్ధితోడ సర్వేశు బూజించు


వారి యత్న మనగ వచ్చు నిజము.



పూజ చేసి పిదప పూర్ణమానసులౌచు


హేవళంబి నిలకు నెంతయేని

సంతసంబుతోడ స్వాగతింపగగోరు


వారి యత్న మనగ వచ్చు నిజము.



ఘనత గూర్చుచుండి తనకాలమందంత


శుభము లొసగుచుండి విభవమీయ


వలయు హేవళంబి స్వాగతం బనగోరు


వారి యత్న మనగ వచ్చు నిజము.



సకలగతుల మమ్ము సత్యానురక్తితో


నుండు నట్లు చూచి మెండుగాను


సర్వహితము గోరు సద్భావమిమ్మను


వారి యత్న మనగ వచ్చు నిజము.



కనుక రయముమీర కవులార! ముదముతో


స్వాగతించ రండు సవ్యగతిని


భూమి కేగుదెంచు హేమలంబిని నేడు


స్వాస్థ్య మొసగుచుండి సాకుమనుచు.

 

స్వాగతంబు నీకు వత్సరరాజమా!


హేవళంబి! జగతి కిడుము లొసగు


చుండగోరు మతుల ఖండించి సౌఖ్యంబు


గూర్చవలయు నీవు కూర్మిమీర. 

No comments:

Post a Comment