Friday 28 February 2020

పుష్పము.

కం.
మావలెను నిత్యమీగతి
భావంబున శుద్ధి గలిగి ప్రహ్లాదమునన్
జీవించు మానవా!
యని
పావనముగబలుకు విరుల ఫణితికి జేజే. 1.
కం.
కులమతభేదములరయక
నిలలో జీవించగలుగు టిట్లగు ననుచున్
దెలుపుచు మానవజాతికి
వెలిగెడి యీపుష్పజాతి విధికిని జేజే. 2.
జగతికి బ్రేమను బంచుట
యగణిత సద్యశము లనిశ మందెడి మార్గం
బగునని పరిమళముల నిల
దగురీతినిబంచు పుష్పతతులకు జేజే. 3.
కం.
విమలత్వము హృదయంబున
గ్రమమెరుగుచు నింపుకొనిన ఘనతరయశముల్
సమకూరును మము గనుడను
సుమధురమగు పుష్పజాతి చొప్పుకు జేజే. 4.
కం.
వసుధాస్థలిలో సంతత
మెసగగ నుపకారగరిమ యింపలరంగా
మసలుడు మావలె నను యీ
కుసుమంబుల యెదలలోని కూర్మికి జేజే.

హ.వేం.స.నా.మూర్తి.
29.02.2020.

1 comment:

  1. మనం ఎక్కడ నుండి వచ్చాం అంటే, ప్రాణత్యాగానికి సిద్దపడి అమ్మాయి, అమ్మ అయితే మనం కదా... మరి మన ప్రవర్తన అమ్మాయి పట్ల... for read more www.newsgita.com

    ReplyDelete