శ్రీరామ
శ్రీ
విఘ్నేశ్వరాయనమః
శ్రీశివాయగురవే
నమః
శ్రీ
సరస్వత్యై నమః
శ్రీ బాలా
త్రిపురసుందరీ త్ర్యంబకేశ్వర సహిత సంగమేశ్వర స్వామినే నమః
శ్రీ సంగమేశ్వరశతకము
(చంపకోత్పలములు)
శ్రీద! మహేశ్వరా! అభవ! చిన్మయ! శంకర! సౌఖ్యదాయకా!
హ్లాదమయా! అనామయమహత్తరసంతతహర్షకారకా!
ఖేదవిదూర! వేదనుత! కిల్బిషనాశక! పార్వతీపతీ!
నీదయ గోరుచుంటినయ! నిన్ నుతిసేయగ సంగమేశ్వరా! 1.
ఆదిని పార్వతీసుతు గణాధిపు మ్రొక్కి సరస్వతిన్ మదిన్
సాదరరీతి దల్చి సురసంఘశుభంకరుడైన శ్రీహరిన్
వేదసమూహసన్నుతుని, వేంకటనాథుని గొల్చి నీపయిన్
మోదముతోడ పద్యగణమున్ గనువాడను సంగమేశ్వరా! 2.
"పొందుగల"న్న గ్రామమున పూర్ణతరంబగు భక్తితోడ నీ
యందు మనంబు నిల్పు శుభదాశయయుక్తులు భక్తకోటులా
నందమునందు రీతి కరుణామయదృక్కుల జూచి బ్రోచు నీ
కందగ జేసి వందనము లందెద హర్షము సంగమేశ్వరా! 3.
వరదుడవైన నిన్నెపుడు భక్తిమయంబగు మానసంబుతో
హర! హర! కావుమా యనుచు నార్తిని గొల్చెద, సేవకుండ
నే
పరిమితి లేని నీదయను పావనరూప! యొకింత నాపయిన్
కురియగ జేయుమా యనుచు కోరుచు నుంటిని సంగమేశ్వరా! 4.
జలముల దెచ్చినాడను భృశంబగు దీక్షను "కృష్ణవేణి"లో
నలఘుతరాచ్ఛనిర్మలమహత్వము గల్గినవాని నీపయిన్
చిలుకగ స్నానరూపమున చిన్మయ! యందుము చంద్రశేఖరా!
తలపున నిల్పినాడ శుభదాయక! కావుము సంగమేశ్వరా! 5.
ఒక్కడు నోటితో జలము లొక్కెడ దెచ్చుచు పుక్కిలించుచున్
మక్కువ తోడ నిన్గొలువ మాన్యత వానికి జూపి మోక్షమున్
గ్రక్కున గూర్చినాడవని క్ష్మాతలిపైన వచింత్రు శంకరా!
అక్కజమౌను నీచరిత మారయ సత్యము సంగమేశ్వరా! 6.
లక్షల బిల్వపత్రములు లభ్యము కామిని నొక్క బిల్వమే
రక్షక! లోకనాథ! శివ! త్ర్యంబక! చేకొను మంచు సన్నుతుల్
దీక్షను బూని నీకొసగితిన్ గొను మయ్యరొ వత్సలుండవై
ఏక్షణమందునన్ ముదము నిచ్చెడి దేవర! సంగమేశ్వరా! 7.
వరమగు కాశికాపురిని వాసము చేయుచు భక్తకోటి నీ
ధరపయి గావబూనుచును తన్మయతన్ శివ! లింగరూపివై
నిరుపమ! నిల్చినాడవిట నిక్కము "పొందుగలా"ఖ్యసత్పురిన్
హరహర! శంకరా! ప్రణతు లందుము చేసెద సంగమేశ్వరా! 8.
నీవు జగత్త్రయిన్ గలవు నిన్ గొలువన్ ఘటియించు మోదముల్
చేవ లభించు నీస్మరణ చేతను, నీకొఱ
కీస్థలి జేరినాడ, నన్
గావవె రుద్ర! నీవలన గల్గు జయంబులు నీకు సన్నుతుల్
దేవరయందు సర్వవిధదీప్తులు
మ్రొక్కెద సంగమేశ్వరా! 9.
శరణము దేవదేవ! కలుషస్థితి నాహృదయాంతరస్థమై
నిరతము గాల్చుచున్నయది నీపయి ధ్యానము నిల్ప బూనినన్
పరమదయాళు! క్రోధము నవారితరీతిని జూపుచుండి సు
స్థిరతను పొందనీయదయ! శ్రీగళ! కావుము సంగమేశ్వరా! 10.
హరికులదైవమైన నిను నాశ్రితవత్సల యెల్లవేళలన్
సురుచిరభావదీప్తిగన జూచుచు భక్తిని సన్నుతించెదన్
పరమదయాకరా! పతితపావన! దీవెన లిచ్చి కావుమా
తరగని భక్తి నీపయి సదా ఘటియింపుచు సంగమేశ్వరా! 11.
ఘనతరభావులై యశము గాంచిన వారిని తల్లిదండ్రులన్
ఫణిమణిహార! కూర్చితివి పావనసంస్కృతి, ధార్మికత్వమున్
ధనముగ నాకొసంగితివి, దైవసమానుల
జూపినాడ వా
జననుతులన్ గురూత్తముల సన్నుతు లందుము సంగమేశ్వరా! 12.
అతులితభావనాబలము నందగజేసి సమాజమందునన్
వ్రతులయి నిన్ను గొల్వగల వారల మైత్రిని సంతతమ్ముగా
నతుకగ జేసి ప్రోవుమయ, ఆర్యజగన్నుత!
చంద్రశేఖరా!
స్తుతి యొనరింతు నెన్నడును చూడను వీడగ సంగమేశ్వరా! 13.
గంగ యొనర్చె నేతపము కామితదాయక! నీజటాస్థలిన్
మంగళయౌచు నిల్చుటకు, మాన్యత నందుచు
నీ గళంబునన్
రంగదమేయభూషణపుప్రాభవ మేగతి నందె సర్పముల్
భృంగిరిటాశ్వ! తెల్పుమని వేడుచునుంటిని సంగమేశ్వరా! 14.
ఎంతదయామయుండవయ! యీశ్వర రాక్షసుడైనవానికిన్
చింతను బాపి తచ్ఛిరము శ్రీప్రదమై జగదర్చనీయమై
కాంతులు చిమ్మ జేసితివి కాంక్షలు దీర్చుటలోన నీవు నా
వంత వివక్ష చూపవయ! యాశ్రితవత్సల! సంగమేశ్వరా! 15.
త్రిదళము నీకొసంగెదను దివ్య మనోహరలింగరూపి! కా
మ్యద! సురగంగ నీరము సమర్పితభావతో నొసంగెదన్
వదలక నిత్యదీక్షగొని భవ్యమహత్తరమంత్రరాజసం
పదల నెరుంగకుండిన, నపారకృపామయ!
సంగమేశ్వరా! 16.
అంగజగర్వనాశక! సురాసురకోటిసమర్చితా! శివా!
మంగళదాయకా! విబుధమాన్య! హిమాగజ నిన్ను పొంద స
త్సంగవిధాయకా! తపము సన్నుతరీతిని చేసియుండి త్వ
త్సంగతి నర్థదేహమున తానయి నిల్చెను సంగమేశ్వరా! 17.
నీకెన యెవ్వ రీజగతి నిన్నె దలంచి జలాభిషేకముల్
నీకొనరింతు శంకర!
మునిప్రకరార్చితదివ్యనామ! నీ
ప్రాకటవైభవంబులకు వ్యాఖ్య లొనర్చగలట్టి వారలే
ఆకమలోద్భవాదు లెటు లౌనిది నాకిట సంగమేశ్వరా! 18.
శిరమున గంగ నుంచితివి చిత్సుఖకారణ! సర్పభూషణా!
ధరపయి త్రాగునీటికయి దాహముతోడ
ననేకు లక్కటా
అరయుచునుండ కష్టముల నాయతవత్సల! చూడకుంటివా
కరుణను జూపవే యిలను గావవె వేడెద సంగమేశ్వరా! 19.
శివశివయన్న శబ్దములు చిత్తమునందున నిర్మలత్వమున్
బవలును రాత్రి కూర్చుకొని భక్తియుతంబుగ పల్కుచుండెదన్
స్తవ మొనరించుపద్ధతులు చక్కగ నేర్వక యున్నవాడ నో
భవ! కరుణించుమయ్య పసివాడను మ్రొక్కెద సంగమేశ్వరా! 20.
ధరణిని తండ్రివైన మరి తన్మయతన్ దరిజేర్చు తల్లివై
పరగుచు నున్నవాడవును, భ్రాతవు, మిత్రుడవైన
దేవ! స
ద్గురుడవు, మార్గదర్శనము కూరిమి జేసెడివాడవైన నో
పరమదయాళు! నీవెయను భావన నుంటిని సంగమేశ్వరా! 21.
***
ఓం న మ శ్శి వా య
ఓమను
నొక్కయక్షరమె యొప్పుచు నుండును నీదు రూపమై
క్షేమము గూర్చు లోకమున కేవల మాధ్వని మానసంబునన్
నీమముతోడ నిల్పెదను నిత్యము పూని స్మరించుచుండెదన్
ప్రేమమయా! సురేశపదవీప్రద! శంకర! సంగమేశ్వరా! 22.
నమకము
సూక్తపంచకము నైష్ఠికతన్ సమకూర్చు వాక్యముల్
చమకము శాంతిమంత్రములసంఘము లేవియు నేర్వనైతి నో
యమితదయాకరా! యతులహర్షవిధాయక! చంద్రశేఖరా!
సుమతిని జేసి నిన్ గొలువ జూడుము శ్రీకర! సంగమేశ్వరా! 23.
మమతకు స్థానమైనది
యుమాజననీవర,
యామె భావనల్
సమతను జూపుచుండునవి సర్వహితంకర నామె నో హరా!
"నమజగదీశ్వరీ! " యని యనామయదాయిని గొల్చువాడ నో
విమలయశఃప్రదాయక! కవిప్రకరార్చిత! సంగమేశ్వరా! 24.
శిథిలములౌచు నంగములు
చేవను వీడకముందు, ఉగ్రమై
బధిరత యంటకుండ నిట బాగుగనుండిన వేళయందు నీ
విధము నెరుంగగల్గిన పవిత్రత గూర్చుమటంచు వేడెదన్
బుధజనసన్నుతా! యురగభూషణ! యీశ్వర! సంగమేశ్వరా! 25.
వాదనలేదు
లోకమున వైభవదీప్తులు చిమ్ముచుంటకున్
మోదము సుస్థిరం బగుచు భూజనులందున నిల్చియుంటకున్
వేదము ధర్మరక్షణకు విస్తృతరూపము దాల్చియుంటకున్
నీదయ కారణం బనుట నిక్కము నిక్కము సంగమేశ్వరా! 26.
యతికులశేఖరార్చనము
నందినవాడవు భక్తిభావులై
వ్రతధరులౌచు నిన్ గొలుచువారల యందున కొంగుబంగరై
సతతము గాచి కోర్కెలను సంతసమంద ఫలింపజేయగన్
క్షితిపయి లింగరూపమున చేరినవాడవు సంగమేశ్వరా! 27.
***
శ్రీ పొం దు గ ల సం గ మే శ్వ రా నీ కు న తు లు
శ్రీదుడవంచు నిన్
గొలువ చేరినవారల రక్షకుండవై
నాదమయా! నిరంతరము నవ్యసుఖంబులు గూర్చుచుందు వో
వేదనుతా! గ్రహించుమయ! బిల్వదళంబులు, నిర్మలోదకం
బాదర మొప్ప దెచ్చితిని యందుము మ్రొక్కెద సంగమేశ్వరా! 28.
పొంగిన
భక్తిభావమున పూర్ణదయాకర! నిన్ను గాంచ నీ
సంగమసీమ "పొందుగల" స్థానమునందున జేరువారి కే
భంగిని నిత్యసౌఖ్యములవారితరీతిని గూర్చుమంచు ని
న్నంగజనాశ! వేడెదనయా! గిరిజాపతి! సంగమేశ్వరా! 29.
దుర్జను
లీధరాతలికి దుఃఖము గూర్చుచు నున్నవారయా !
గర్జన చేసి వారల కుకర్మములన్ విదళించి వారిచే
నార్జన చేయగాబడిన యాయతకల్మష మెల్ల జూపుచున్
తర్జన చేయ నిల్వుమయ! ధాత్రిని గావగ సంగమేశ్వరా! 30.
గరళము
మ్రింగినావు గద,
కావగ లోకము నాడు శంకరా!
పురములు మూటినిన్ కినిసి బూడిద చేసితి వొక్కయమ్మునన్
గిరిశ! మహేశ! యెల్లెడల కింకరకోటికి నండవౌచు నీ
వరయగ నిత్తువయ్య సత మాయతహర్షము సంగమేశ్వరా! 31.
లలితశుభాశయా!
వరఫలంబుల నిమ్మని కోరి పూజలన్
ఖలహర! చేయబూననయ! గమ్యము జేర్చుము నన్నటంచు నా
తలపున నిన్ను నిల్పుకొని తన్మయతన్ భజియించ బోను నీ
నిలయమునందు సేవకయి నిల్పగ గోరెద సంగమేశ్వరా! 32.
సంతస మందజేసితివి
సవ్యవిధంబున బెండ్లి జేసి నా
సంతుకు, దీర్ఘకాలమిట
సాగెను వంశమునందు దీప్తికై
సంతతి గూర్చుమా యనుచు సన్నుతి చేయుచునుంటినయ్య నా
చింతను బాపుకార్యమును చేకొన వేడెద సంగమేశ్వరా! 33.
గతమున పాపకృత్యము
లకారణ మెన్నియొ చేసినాడ నా
కతమున సత్యహీనముగ కానిపదంబులు పల్కినాడ దు
ష్కృతమున దూరి భాగమయి కేలును దూర్చ గమించినాడ నా
మతమును సంస్కరించుమ యుమాపతి! శంకర! సంగమేశ్వరా! 34.
మేలొనరించువారలకు
మేదినిలోన పరాభవంబు లే
వేళను నేడు గల్గుటకు విశ్వవిధాయక! జ్ఞానదాయకా!
నీలగళా! కతం బొకటి నీవ వచింపగ గోరుచుంటి నీ
వేల యుపేక్షచేసి సుఖియింతువు? తండ్రివి
సంగమేశ్వరా! 35.
శ్వసనము, నీర, మగ్నియును, సర్వచరాచరవస్తుసంతతుల్,
దెసలు, నభంబు, వెల్గులును
దేవశివంకర! కల్మషాది దు
ర్వ్యసనపరంపరాస్థితుల నంటుచు నున్నవి నీదుసేవకై
యసదృశవత్సలా! యొకటి యందగ నర్హమె సంగమేశ్వరా! 36.
రాజు
శిరస్స్థలంబుపయి రాజిలుచుండె, జటాకలాపమే
నైజనివాసమై తనరె నాకధునీవర,
కాగళంబు న
వ్యాజగృహంబయెన్ చిలువ, కంబ
గ్రహించిన దర్ధదేహమున్
హే జగదీశ్వరా! పరుల కిచ్చుటె నీపని సంగమేశ్వరా! 37.
నీదయ గల్గినన్ జనుడు
నిస్తులసత్వము గాంచకుండునే?
మోదము నందకుండునె ప్రభూ! విభవంబులు గాంచకుండునే?
యాదర మొప్ప సంఘమున నందరికిన్ హితకారి కాడొకో?
శ్రీద! దయానిధీ! నతులు చేకొను మయ్యరొ సంగమేశ్వరా! 38.
కువలయమందు
జన్మమును గూర్చిన నిన్ను నిరంతరమ్ముగా
స్తవమొనరింతు నాకొరకు సర్వమహత్తరభాగ్యసంపదల్
ఛవిమయజీవనం బిడుట, సాకుట కాదయ లోక మంతటన్
భవదనురాగదీపికలు పారగ జేయుము సంగమేశ్వరా! 39.
నను
భవదీయదాసునిగ నమ్మిన చాలును, నీదుసేవకై
అనుదినవత్సలత్వమున నర్భక! రమ్మని యన్న చాలు నీ
ఘనతరనామమున్ బలుకగా తగు శక్తిని నిత్య మిచ్చుచున్
మనిచిన చాలు ధన్యతను క్ష్మాతలి నెంచెద సంగమేశ్వరా! 40.
తుద, మొద
లెవ్వియో కనగ దోచవు, ధాతకు ధాతృతాతకున్
సదమలభావసంపదను శక్తి నొసంగిన వాడ వయ్యరో!
యెదలను నిల్పి కొల్చిన నహీనమహత్వము నాయకత్వమున్
వదలనిరీతి గూర్చెదవు వందన మందుము సంగమేశ్వరా! 41.
లుకలుకలయ్యె
ధర్మగతి లోకమునందున దుష్టభావనా
నికరము వ్యాప్తిచెందినది నిత్యము లయ్యె నఘప్రభావముల్
సకలము కల్మషంబులకు స్థానముగా నగుచుండె శంకరా!
యికనయినన్ కనందగదె యీస్థితి నీయెడ సంగమేశ్వరా! 42.
***
(అకారాది వర్ణమాల)
అతులితమైన
నీమహిమ నాశ్రితవత్సల! నాల్గుమోములన్
చతురత వేదరాశులను సన్నుతరీతిని బల్కు నా ప్రజా
పతియు, సహస్రనేత్రుడును భావన చేయగ జాలరయ్య యీ
క్షితిని జనించు నల్పునకు చెల్లునె యెంచగ సంగమేశ్వరా! 43.
ఆశ లనంతమై
జనున కాయతదుఃఖము కల్గజేయుచున్
నాశనకారణంబులయి నష్టము గూర్చుచు నున్నవయ్య! స
ర్వేశ! యిదేమి చిత్రమొ మహీస్థలమందున వాస్తవంబు తా
నీశ! యెరుంగ బోడు నరు డెన్నటికైనను సంగమేశ్వరా! 44.
ఇష్టము నాది, దానికయి
యేమి యొనర్చిన మీకు నేమి సు
స్పష్టము నామహత్వమని స్వార్థముతోడ నహంకరించు దు
శ్చేష్టలు సంతతం బిచట చేయుచునుండును మానవుండు సి
ధ్యష్టకదాయకా! తగదటంచెపు డెంచడు సంగమేశ్వరా! 45.
ఈయిలయంత
నీసృజన యిందలి వస్తుసమూహ మంతయున్
శ్రీయుత! నీవు నిల్పినది చిన్మయ! దీనిని చేతబూని నిన్
శ్రేయద! కొల్వబూనుటది చెల్లునె? కావున
"ఈశ్వరా! నమో"
న్యాయమయా! యటందు నెపు డందుము పూజగ సంగమేశ్వరా! 46.
ఉన్నతమైన
స్థానమున నొప్పుచు నుండెడివారలైన నే
డెన్నగ నీతి వీడి చరియించుచునుండిరి లోకమందు వీ
డన్నిట యోగ్యు డంచు మహదాశయుడంచు నమస్కరించగా
నున్నటువంటివా డిచట నొక్కడు నుండెనె సంగమేశ్వరా! 47.
ఊతగ నుండి
ధర్మమున కొప్పగురీతిని వృద్ధి చూపుచున్
చేతము సంతసిల్లు విధి శ్రేష్ఠసుకర్మములందు త్రాతవై
ప్రీతిని గూర్చ వేడెదను విశ్వవిధాయక! లోకనాయకా!
నీతిని నేర్పి భక్తులకు నీమము దెల్పుచు సంగమేశ్వరా! 48.
ఋషులు, పురాణసంతతులు, నీశ్వరసంస్తుతి
సేయు మంత్రముల్,
కృషిని విధించు కార్యములు,
క్షిప్రఫలప్రదదివ్యకర్మముల్,
భిషజవరేణ్యసంఘముల విస్తృతి గాంచిన భారతావనిన్
ధిషణకు బూజుపట్టినది దెల్ప నహంబున సంగమేశ్వరా! 49.
ౠయను
వర్ణరాజమున కీయెడ నేడొక స్థానమైన లే
దో యసమాక్ష! విద్యలకు నొక్కెడ గాదయ అన్నిచోటులన్
న్యాయమె యీగతుల్ గిరిశ! ఆగ్రహ మింతయు చూపకున్నచో
శ్రేయము లేవిధిన్ గలుగు జీవనమందున సంగమేశ్వరా! 50.
ఎవ్వడు
భక్తసంఘముల నెల్లవిధంబుల బ్రోచుచుండునో
ఎవ్వడనాదిమధ్యలయు డేవిధి నెంచిన విశ్వమందు తా
నెవ్వడు స్వల్పసేవలకె యిచ్చుఫలంబు లనల్పరీతి గా
నెవ్వడు దేవదేవు డత డీశుడ వీవయ సంగమేశ్వరా! 51.
ఏస్థలమందు
నీయునికి ఏయది బ్రోచెడి నీదుసీమయో
స్వస్థత నెచ్చటన్ నిలుపువాడవొ యన్న మనంబదేల స
ర్వాస్థల నిన్ను నిల్పి జను డాయతభక్తి స్మరించ నందు ని
త్యస్థుడవౌచు కామనల నన్నియు దీర్తువు సంగమేశ్వరా! 52.
ఐహికసౌఖ్యసంపదల
కంతము తథ్యము వాని కోసమే
దేహి నిరంతర మ్మిచట దేవర! నీకృప జూపుమంచు ని
న్నోహర! గొల్చుచుండు గద, యొప్పగు
ముక్తిని చూపగోరెదన్
మోహ మంటంచు పల్కక ప్రమోదద! నాకును సంగమేశ్వరా! 53.
ఒక్కడు
చేయుకార్యమున కొక్కడు సంతస మందబోడు తా
నొక్కడె విజ్ఞతన్ గలిగియుంటి నటంచును దల్చుచుండు నే
డక్కట! మానవుండు మరియాదను జూడడు లోకపాలకా!
నిక్కము దెల్పి కావుమయ! నిత్యశుభంకర! సంగమేశ్వరా! 54.
ఓకరుణానిధీ!
గిరిశ! ఉజ్జ్వలరూప! మనోహరాశయా!
నీకొనరింతు సన్నుతులు నిర్మలభవ్యజలాభిషేకముల్
చేకొని ధర్మకార్యములు చేయు బలంబిడి హర్ష మెల్లెడన్
లోకము నందు నిల్పుము త్రిలోచన! శంకర! సంగమేశ్వరా! 55.
ఔదలజేర్చి
గొల్చెద నహర్నిశమున్ భవదీయదివ్యస
త్పాదము, దానినిన్ గడిగి భక్తిని తజ్జలమందువాడ
స
మ్మోదముతోడ తీర్థముగ పూర్ణదయాకర! శైలజావరా!
నీదరినుండు భాగ్యమును నిత్య మొసంగుము సంగమేశ్వరా! 56.
అంగము లన్ని
కంపనము నందుచునున్నవి, మానసంబునన్
సంగము వీడకున్నయది సంపదలందున మోహబంధ మో
అంగజవైరి! లగ్నమయి యావలకున్ గమియించకున్న దే
భంగిని నన్ను గాచెదవొ భక్తవశంకర! సంగమేశ్వరా! 57.
కరివరదాప్తదైవమయి
కాంక్షితచక్ర మొసంగి విశ్వమం
దరయగ జేసినావు గద ఆశ్రితరక్షకకార్యదక్షతన్,
స్థిరతను గాంచ జేసితివి దేవపతిత్వమునందు శక్రునిన్
పరమదయాకరా! వరద! పాహి త్ర్యంబక! సంగమేశ్వరా! 58.
ఖగగణమౌ
సురాళియును,
కర్మఠులైన మునీంద్రసంఘముల్
నిగమనుతా! త్వదర్చనకు నిస్తుల భక్తి విశేషయుక్తులై
అగణితవత్సలత్వమునకై యిదె వచ్చిరి వారి కన్నిటన్
తగుగతి నీయనుగ్రహము తప్పక పంచుము సంగమేశ్వరా! 59.
గరళము
త్రాగినాడవు సుఖంబును లోకమునందు జూడగా
హర! భవదీయదర్శనము నర్చనతోడ జలాభిషేకముల్
ధరపయి చేయువారలకు ధర్మవిదూరులు బాధలెన్నియో
నిరతము గూర్చుచుండిరిది నీవు గనందగు సంగమేశ్వరా! 60.
ఘటికయు
నేదినంబయిన కాలవిధాయక! నీదుసేవలో
అటలముగా మనంబు గొని హర్షముతోడ చరించువారికిన్
పటుతరధైర్యసంపదలు భాగ్యము లబ్బును జీవనంబునన్
కటకట చేరబోదు కలకాలము సౌఖ్యమె సంగమేశ్వరా! 61.
చతురత జూపు
వాక్యమున, స్వార్థము నూని చరించు, దానికై
అతులితకల్మషంబులకు నాస్పదుడౌను నరుండు నిచ్చలున్
వ్రతముగ వంచకత్వము నవారితరీతి వహించు వీని కీ
క్షితిపయి జ్ఞాన మేగతిని చేకురు నయ్యరొ! సంగమేశ్వరా! 62.
ౘదువులలోని
సారమిది సన్మతితోడ పరోపకారమున్
ముదమున జేయుచుండినను పుణ్యము గణ్యముగా లభించు నే
యదనున తోటివారలకు నందగజేసిన కీడు పాపమే
వదలక జేరు, మానవుడు వైన మెరుంగడు సంగమేశ్వరా! 63.
ఛవిగలవాడ
నేనిచట జ్ఞానమయుండ మహోన్నతుండనై
యవిరళ కీర్తి గాంచితి నటంచు నహంకృతి చూపుచుండు నీ
భువిపయి మానవుం డకట! మూర్ఖుడు తానయి దీని కంత యా
భవుని దయావిశేషమని భావన చేయడు సంగమేశ్వరా! 64.
జయ
కరుణాంతరంగ! సుమసాయకనిస్తులగర్వభంగ! శ్రీ
మయమహిమాతరంగ! అసమానవృషేశతురంగ! గంగయే
స్వయముగ నా శిరస్స్థలిని చక్కగ జేరి మహాభిషేకమున్
నియమముగా నిరంతరము నీకొనరించును సంగమేశ్వరా! 65.
ౙం కొకయింతలేక
యనిశంబును భక్తి "నమశ్శివాయ" యం
చంకితభావ మొప్పగను హర్షమనస్కుడ నౌచు నీదరిన్
శంకర! యుండగల్గువిధి శక్తి నొసంగు మిహమ్మునందు నో
సంకటనాశ! నీవెగద, సర్వము నాకిట సంగమేశ్వరా! 66.
ఝషమయి
దుష్టశిక్షణము సల్పిన మాధవు డెల్లవేళలన్
విషగళ! నీపదార్చనము వీడక సల్పుచు స్వీయధర్మమున్
కృషకుని రీతి చేయు గద, కింకరుడన్
భవదీయసేవయన్
తృషగొని యుందు జీవనము తీరినదాకయు సంగమేశ్వరా! 67.
టక్కరివాని
కిందు ప్రకటంబగుచున్నది గౌరవంబు నే
డక్కట! సజ్జనాళికి నిరంతరకష్టము హేళనంబులున్
మిక్కిలిగా ఘటించుట కమేయదయామయ! కారణం బెదో
చిక్కకయున్న దెంచినను శ్రీగళ! తెల్పుము సంగమేశ్వరా! 69.
ఠంగున మ్రోగ
కంఠ, మొకటన్ గనకుండను సందియంబు, స
ర్వాంగములందు భక్తిగొని హర్షితమానసులౌచు లోకు లే
భంగిని దేవతార్చనలు, పావనహైందవధర్మకృత్యముల్
మంగళరూప! చేయగల మాన్యత గాంతురొ సంగమేశ్వరా! 70.
డమరుక మా
కరంబునను టంకృతి చేయుచు మ్రోగుచుండగా
క్రమమగు రీతి వర్ణముల కల్పన జూపుచు మౌనిచంద్రునిన్
సుమశరవైరి! తెల్పితివి సుందరవ్యాకరణప్రకాశమున్
సుమధురవత్సలత్వమును చూపుచు నాడట సంగమేశ్వరా! 71.
ఢమఢమ మ్రోగగావలయు
ఢక్కయు నీపదసేవచేయుచో
క్రమముగ హైందవం బిచట కావలె నన్నిటికన్న మిన్నయై
సమతకు స్థానమై జనుల స్వాంతము దీప్తులు నింపుకోవలెన్
భ్రమలు తొలంగగావలెను భారతమంతట సంగమేశ్వరా! 72.
తరుణము కాదు
దైవమును తల్చుట కియ్యది దేహమందునన్
నిరుపమమైన సత్వమది నిల్చి మనోహరమైన రీతిలో
నరుసము గూర్చుచున్నయది యంచును కాలము బుచ్చు దేహి తా
నరయడు జీవనత్వపరమార్థము నేగతి సంగమేశ్వరా! 73.
థధలకు మధ్య
భేదమును తామెరుగంగను జాలనట్టి యా
విధమును జూడకే కవులు, విజ్ఞులమంచు
మహత్ప్రభావులౌ
బుధుల మటంచు నెంచెదరు పొందెద రెన్నియొ గౌరవంబులో
విధినుత! నేటికాలమున వీరిని గాంచుము సంగమేశ్వరా! 74.
దయగలవాడ వీవు
గద, ధారుణిలోగల
మానవాళికిన్
దయ యొకయింత యీదగదె? తల్లికి
దండ్రికి దీనకోటికిన్
దయను దలంచి బంచుటకు, తారిట నిర్దయులౌచు నుండి రో
భయహర! కాంచ వేడెద నపారకృపాకర! సంగమేశ్వరా! 75.
ధనమె
ప్రధానమైన దయ! ధాత్రిని జూడగ మానవాళికిన్
తనమన యన్న భావములు దానిని పొందగ గోరువేళలో
కనబడకుండె నీహృదుల కశ్మలమున్ విదళించి వేగ మీ
జనులను బ్రోవగావలయుసాంబ! సదాశివ! సంగమేశ్వరా! 76.
నమ్మితి
నిన్ను తండ్రియని, నన్నిల బ్రోచుచునుండు కార్యమున్
సమ్మతి జేయు పార్వతిని సంతసమందుచు విశ్వసించి నా
కమ్మగ గొల్చువాడనయ! ఆశ్రితవత్సల! నామనమ్మునన్
క్రమ్మిన దుష్టభావముల ఖండన చేయుము సంగమేశ్వరా! 77.
పద్యము
వ్రాయరాదు బహుభంగుల విజ్ఞులు మెచ్చునట్లుగా
విద్యను నేర్వలేదు నిను విశ్వవిభున్ వినుతించు యత్నమో
ఆద్య! గ్రహించుటల్ శివ! దయామయ! నీదుకృపావిశేషమే
హృద్యచరిత్ర! మ్రొక్కెద మహేశ్వర! నిత్యము సంగమేశ్వరా! 78.
ఫణిగణముల్
నిరంతరము భవ్యములైన విభూషణంబులై
గణుతికి నెక్కియున్నయవి కామ్యద! నీగళసీమయందు వా
రణముఖభాగ్యదాయక! పరాత్పర! వాని యదృష్ట మేమియో
అణిమను గోర, నాకును దయాలవ మీయవె సంగమేశ్వరా! 79.
బంజరుభూమియైన
వృషవాహనమందిరసీమ యైనచో
మంజులమైన క్షేత్రమయి క్ష్మాతలిలోన బ్రసిద్ధి చెందు నీ
కుం జయ మందు నాహృదిని గూడిన కల్మషరాశి నంతనున్
భంజన చేసి యందునను వాసము చేయవె సంగమేశ్వరా! 80.
భరముగ
తోచుచున్నది శివా! జననంబు నొసంగి పెంచి యీ
ధరణిని గౌరవాదరముదంబులు గూర్చిన తల్లిదండ్రులన్
కరుణను సాకుచుంట, కలికాలము,
వారలు లేక మానవుం
డరయునె జన్మ మేగతి నిహంబున చూడుము సంగమేశ్వరా! 81.
మలినము
చిత్తసీమలకు మానవలోకమునందు నంటుచున్
పలుకులలోన కర్మముల భావములందున నేకతాస్థితిన్
నిలుపగనీక సంతతము నిస్తులపాపములోన ముంచుచున్
కలతలు పెట్టుచుండిన ప్రకారము మార్చుము సంగమేశ్వరా! 82.
యతివర! శంకరా!
ఉరగహార! శుభాకర! శైలజావరా!
అతులితవత్సలత్వమహిమాస్పద! భక్తవిదా! వరప్రదా!
క్షితిధరరాజదేవగణగీష్పతిసన్నుత! భస్మభూషితా!
స్తుతి యొనరించువారిపయి చూపుము త్వత్కృప సంగమేశ్వరా! 83.
రక్షణ లేదు
లోకమున రమ్యగుణాన్వితులైన వారికిన్
కక్షను బూనినట్లుగ నకారణదౌష్ట్యముతోడ దుర్మతుల్
దీక్షితులైరి వారలకు తీవ్రమనోవ్యథ లందజేయ ప్ర
త్యక్షము నీవు కానవె సదాశివ! దీనిని సంగమేశ్వరా! 84.
లయమొనరించు
వాడవు విలంబము చేయక నీదు కార్యమున్
రయమున చేయువాడవని ప్రాజ్ఞుల వాక్కు, మహాతిదుష్టతా
మయమగు భావజాలమును మానవచిత్తములందు నేలనో
లయమొనరించ బూనవు, ఛలత్వము
గూల్చవు సంగమేశ్వరా! 85.
వనములు, పర్వతంబులును, పావన
నిమ్నగ లుండు ప్రాంతముల్
మునిజనసంస్తుతా! కనగ భూస్థలమందున నీవువాసమున్
గొని యిట లింగరూపివయి కూర్మిని బంచుచు పావనత్వమున్
ఘనముగ వానికీ యెడల కల్గగ జేయవె సంగమేశ్వరా! 86.
శతకము పేర
పద్యములు శంకర! నీపయి పల్కజేయ నా
కతులిత సత్కృపామహిమ నందగ జూచితి వంతెకాని నా
మతికిది సాధ్యమా! విపులమానద! మాటలలోని సత్వమున్
గతులును, సుందరత్వమును కానని వాడను
సంగమేశ్వరా! 87.
షండుడు వాడె
లోకమున సౌఖ్యములందగ లేనివాడు పా
షండుడు మూర్ఖుడౌచు నిను సన్నుతి సేయక భూస్థలంబు నం
దండగ నిన్ను నెంచక యహర్నిశలాయతదుష్టభావుడై
యుండును వాని కూర్ధ్వగతు లుండుట కల్లయె సంగమేశ్వరా! 88.
సత్యము
పల్కుచుంటినయ సర్వవిధంబుల లోకమందునన్
నిత్యము లయ్యె వంచనలు నిర్మలభావము ధార్మికంబులౌ
కృత్యము లెందు మృగ్యమయె క్షేమము సజ్జనకోటి కిందు నే
డత్యతి దుర్లభంబయిన దారయుమో హర! సంగమేశ్వరా! 89.
హరికులమందు
పుట్టిన మహాత్ములు మాపితరుల్ నినున్ సదా
స్థిరమతి గొల్చి సౌఖ్యములు క్షేమములున్ యశ మందినారు నా
వరమిది యిందు జన్మగొను భాగ్యము గల్గెను నాకు దానిచే
పరమదయామయా! తమకు భక్తుడ నైతిని సంగమేశ్వరా! 90.
క్షణికములైన
సంపదల కాంక్షను బూనుచు నిన్ను జేరి యో
ఫణిపతిహార! గొల్వ నిల,
భక్తిని గొల్చిన గొల్చువాడ నా
గుణగణ మీ సమాజమున కూర్మిని జూపుచు విజ్ఞగణ్య కా
రణముగ నుండ గోరుచు నిరంతర మో హర! సంగమేశ్వరా! 91.
ఱంపపుకోత
వంటిది పరాత్పర నిన్ను స్మరించకున్కి, పా
పంపుఫలంబులన్ గొనుట,
భావనకైనను వాని నంటి యా
కంపును గ్రోలునట్టి స్థితి కల్గగనీయక సాకుమయ్య! చే
తంపు టయోగ్యయోచనల ధాటిని ద్రుంచుచు సంగమేశ్వరా! 92.
***
శుభకరి "బాలయౌ త్రిపురసుందరి" నీకెడ చేరియుండగా
విభవద! నీవు " త్ర్యంబకుని పేరున" వేరొక లింగరూపివై
యభయము భక్తకోటులకు నందగజేయగ నిమ్నగాతటిన్
ప్రభుత వహించి నిల్చితివి వందన మందుము సంగమేశ్వరా! 93.
సూరిజనస్తుతా! యురగశోభిత! "పొందుగలేశ్వరా! " కృపా
పార! నిరంతరాయతశుభప్రద! భక్తజనావనా! సదా
చారవిధాయకా! యనుచు సంతతమున్ భవదీయసన్నుతుల్
కోరికదీర చేసినను కూడును భాగ్యము సంగమేశ్వరా! 94.
రక్కసుడైన నేమి మధురంబగు శంకరనామధేయమున్
నిక్కపుధ్యానముం గొనుచు నిత్యజపంబు తపంబు చేసినన్
మిక్కిలి తుష్టి గూర్చెదవు మేలని, దైత్యున
కీయవే వరం
బక్కట! భస్మమౌ నటుల హస్తము నుంచగ సంగమేశ్వరా! 95.
బిల్వదళంబు నీపయిని వేసి జలంబులు
చిల్కరించినన్
బిల్వగ బంచి స్వర్గగతవృక్షము
భక్తుని యింటిచెట్టుగా
నిల్వగ దెల్పువాడవట నీకెన యెవ్వరు
కామధేనువున్
దెల్వగ వాకిటన్ నిలుపు దేవుడ వీవట
సంగమేశ్వరా! 96.
చదువులలోన ఛాత్రులకు శ్రద్ధ కనందగు
నట్టు లొజ్జలున్
ముదమున నన్యయోచనల బోవక నిచ్చలు
భావిపౌరులన్
సదమలభావయుక్తులుగ జ్ఞానధనాఢ్యుల
జేయుకార్య మె
ప్డెదలధరించువారినిగ నీయిల జూడుము
సంగమేశ్వరా! 97.
జలములొసంగి నిమ్నగలు సాకుచునున్నవి
దేవ! లోకులన్
ఫలముల నిచ్చి వృక్షము లపారముదంబును
గూర్చుచున్న వా
లలితమనస్క లావులును లాలన చేయును
క్షీరధారచే
నిలపయి మానవుం డెపుడు నెంచును స్వార్థమె
సంగమేశ్వరా! 98.
తన యుదరమ్ము నిండుటకు ధాత్రి
జరించెడి జీవరాశులన్
మనుజుడు సంహరించుటలు మాన డదేమయ!
భోజనంబుగా
ననుపమపత్రశాకముల కాస్పద మీభువి
యంచు నెంచ డీ
జనుని స్వభావమున్ మలచ జాలవె యేగతి
సంగమేశ్వరా! 99.
నిను నిట రక్షకుండనుచు నిత్యము
నమ్ముచు నున్నవాడ నా
తనువిది ప్రాణవాయువును దాల్చి
చరించుచు నున్నదాక నీ
ఘనత నుతించువాడ నిది కాదన కయ్యరొ!
దాని కర్హతల్
గొనవని నింద సేయకుము కూనను నీకయ!
సంగమేశ్వరా! 100.
ఈశ్వరుడౌచు సంపదకు, నీగతి భస్మము దేహమంతయున్
శాశ్వత! నీగళస్థలిని సర్పములన్
గొనియుండు టెల్లయున్
నశ్వరమైన కాయమిది నమ్ముడు
మానవులంచు తెల్పుటే
విశ్వవిధాయకా! నతులు వేలొనరించెద
సంగమేశ్వరా! 101.
***
హ ర హ ర మ హా దే వ
హరిహరులన్న వ్యత్యయము నాత్మ వహించని స్వస్థచిత్తులౌ
నరులకు సర్వరీతుల ననామయదీప్తు లొసంగువాడవై
నిరుపమశక్తియుక్తులను నిచ్చ
లిహంబున గూర్చి యాపయిన్
పరము తిరంబు చేసెదవు పాహి, యఘాపహ! సంగమేశ్వరా!
102.
రవి శశి తారకాగణము, రమ్యమనోహరమౌ నభంబు, నా
దివిజులు, దానవుల్, నరులు, తేకువతోడ జరించు ప్రాణులున్,
పవలును, రాత్రి, కాలములు, భావములున్, సకలప్రవృత్తులున్
భవ! భవదాజ్ఞలేక వృషవాహన! సాగునె సంగమేశ్వరా! 103.
హరి భవదీయభక్తుడయి అర్చన చేసెడివేళ పద్మముల్
సరిపడకున్న నేత్రమునె సన్నుతరీతి
నొసంగి భక్తితో
హర! కరుణించుమా యనిన ఆశ్రితవత్సల!
చక్రరాజమున్
వరదుడవై యొసంగితి వపారదయాకర!
సంగమేశ్వరా! 104.
రయమున గూలు నీతను వరాతిభయంకర! దీని కోసమై
నియతిని దప్పి మోహమును నిత్యము
దాల్చెడి భావజాలమున్
క్షయ మొనరించి ప్రోవుమయ! శాశ్వతమైన
పదంబు సన్నుతా
శ్రయమును జూపుమయ్య! నిను బ్రార్థన
చేసెద సంగమేశ్వరా! 105.
మరియొక జన్మమే వలదు, మన్నిక చేయక దాని కోసమై
సరిపడు పుణ్యకార్యములు సల్పవురా
యని యందువేని యీ
ధరణిని భారతావనిని త్వద్గతభక్తి
నొసంగి కూర్చు మో
హర! మరి యొక్కటైన గొనుమం చన కయ్యరొ!
సంగమేశ్వరా! 106.
హారతి నీకొసంగిన మహాపద లన్ని తొలంగిపోవు, నా
నీరము నీశిరంబుపయి నిచ్చలు పోసిన
పాపమేగతిన్
చేరగ బోదు, బిల్వమును చేకొన నిచ్చిన సర్వసంపదల్
పారము లేక కల్గునను వాక్యము సత్యము
సంగమేశ్వరా! 107.
దేవతలందు దేవుడవు, దీప్తిమయుండవు నిన్ను జూచినన్
భావము శుద్ధియై సత మపారముదంబులు
గూడు లోకమం
దేవిధినైన తెట్టెలుగ నిడ్ములు ముట్టవు
సన్నుతింతు నో
పావనతావిధాయక! శుభంకర! శంకర!
సంగమేశ్వరా! 108.
వందన మో మహేశ్వర! భవస్థితనిష్ఠురకష్టదూర! యా
నందద! నందివాహన! వినాయకగౌరవభాగ్యదాయకా!
సుందరమానసా! సతము స్తోత్రము
నీకొనరించువాని నీ
మందిరమందు సేవకయి మాన్యత నిల్పుము
సంగమేశ్వరా! 109.
***
No comments:
Post a Comment