Wednesday, 31 December 2025

2026

 2026

ఆ.వె.

నూత్నవత్సరమ్ము యత్నసిద్ధిని గూర్చి

స్వాస్థ్యదీప్తి జూపి సంతసమ్ము 

లమరజేయు గాత యవనీస్థలంబందు

శుభము లరయజేసి సుఖము లొసగి.

ఉ.

శ్రీయుతభావజాలమును చిత్తమునం దమరంగజేసి స

చ్ఛ్రేయము గూర్చు కార్యములు చేసెడి యోచనతోడ మానవుల్ 

ధీయుతు లౌచు ధాత్రిపయి దీప్తులు గాంచుచు సంచరించు స

ద్వ్యాపక మందజేయవలె నాంగ్లసువత్సర  మొప్పుమీరగన్.

ఉ.

అందరి నాత్మబంధులుగ నాయతమై వెలుగొందు ప్రేమతో

సుందరభావనాపటలి శోభిలుచుండెడిరీతి నిత్యమున్ 

వందన కర్హ సత్కృతు లవారితరీతిని జేయుశక్తి యా

నందము నూత్నవర్షము ఘనంబుగ గూర్చుచు నిల్వగావలెన్.

ఆంవె.

రెండువేల పయిని నిండైన యిరువది

యారుసంఖ్య గల్గు హాయనమ్ము 

కలత లరయబోని లలితమౌ జీవన

మమరజేయుగాత యవని పయిని.

మ.

గతకాలంబిట జూపియున్నది మహత్ కష్టంబు లెన్నింటినో

శతథాయత్నము చేసినట్లయిన సత్సౌఖ్యాది సంపత్తు లీ

క్షితిపై దుర్లభమయ్యె నీవయిన నో శ్రేష్ఠాంగ్లనూత్నాబ్దమా!

యతుకం జేయుము హర్షసంపదలు ‌నీకందింతు సన్మానముల్.

హ.వేం.స.నా.మూర్తి.

01.01.2026

No comments:

Post a Comment