Tuesday 31 December 2013

నూతన సంవత్సర (2014) శుభాకాంక్షలు



నూతన సంవత్సర శుభాకాంక్షలు(2014)



కం.    శ్రీకరమై యీ వర్షం
       బాకరమై సచ్ఛుభాల కతిసుఖదంబై
       లోకంబుల కానందము
       చేకూర్చునుగాత యొసగి స్థిరమగు యశముల్.

కం.    శ్రీలక్ష్మీ వాసంబై
       మేలౌ సద్విభవ మొదవి మీదట నిలలో
       కాలోచిత సద్భావము
       పాలకులకు గలుగవలయు బంధురఫణితిన్.

కం.    గతకల్మష నాశంబయి
       వెతలన్నియు దీరిపోయి విస్తృత హర్షం
       బతులిత శాంతి సమీరము
       క్షితినంతట వీచవలయు సిరులంద వలెన్.

కం.    సోదరభావపు గంధము
       మేదిని నీవర్షమంత మించుగ నలమన్
       మోదము చేకూరగవలె
       నాదేవుని కృపను భారతావని కెందున్.

కం.    నిరతం బీవత్సరమున
       సురుచిరమై యొప్పుచుండి సుందర మగుచున్
       వరలు నవోదయమున నెపు
       డరయగ సద్విజయవార్త లందగ వలయున్.

No comments:

Post a Comment