Monday 12 April 2021

శ్రీప్లవనామసంవత్సరము - స్వాగతము

 

శ్రీప్లవనామసంవత్సరము

ఉ.

శ్రీకరమౌచు, నింపలర క్షేమములన్ సమకూర్చుచుండి,

స్తోకముగాగ సౌఖ్యము వసుప్రదయై ఘటియించుచుండి, భా

గ్యాకరయౌచు లోకమున నాయత హర్షము నింపుచుండి, చీ

కాకుల నీ"ప్లవాబ్ద"మిట ఖండన  చేయగ స్వాగతించెదన్.                        1.

ఉ.

భారతభూమిలో విమలపావనభావపరంపరావళుల్

చేరుచు, మానసంబులను జిన్మయదీప్తులుకల్గుచుండి, సం

స్కారవిభూతి వర్ధిలెడి భ్యత కూడుచు నుండునట్లుగా

పౌరులనీ "ప్లవాబ్ద"మిట బాలన చేయగ స్వాగతించెదన్.                          2.

చం.

తులము లైనసస్యముల నందగ జేసెడి వర్షధారలీ

క్షితిపయి జేరునట్లుగను జేయుచు, భాగ్యదధాన్యరాశిచే

తతసుఖాస్పదంబయిన త్వము నింపుచు మానవాళికిం

తుల ముదంబు గూర్చగ "ప్లవాబ్దము" నీయెడ స్వాగతించెదన్                        4. 

ఉ.

పాడు కరోన భూతమయి వాస్తవ మీజగమందు నెల్లెడన్

జీడగ నంటి మానవుల క్షేమము, ప్రాణము లాహరించుచున్,

గూడును గుడ్డలైన  సమకూర్చు కొనన్ జననీయకుండె దా

వీడక దీనినిన్ దునుమి వే"ప్లవాబ్దమ!" స్వాగతించెదన్                      5.

ఉ.

ప్రాక్తన సంస్కృతుల్, బహుళభంగుల జేరి మనోహరత్వముల్

వ్యక్తము చేయుచున్ జనుల భావములందున నిల్చి స్వీయమౌ

క్తిని జూపు నవ్యతకు జంకిన వక్కట!    యెట్టులైన స

ద్యుక్తి ఘటించి గావ నిను నో "ప్లవ" వర్షమ!  స్వాగతించెదన్.                   6.   

ఉ.

పాలకులందు యోగ్య శుభభావము లందగ జూచి యిందు నీ

కాలమునందు నన్నిట సుప్రద కర్మలు సాగుచుండగా

మేలగు పాలనంబున నమేయ ఫలంబులు మానవాళి కీ

నేల ఘటింప జేయుటకు నిన్ను  "ప్లవాబ్దమ" స్వాగతించెదన్                    7.

మ.

ప్లవనామాబ్దమ! భాగ్యదాయకవుగా భావించి నిన్నీ యెడన్

వివిధానంత శుభాతిరేకముల నేవేళన్ బ్రసారించుచున్

వచైతన్యము నంతరంగములలో మ్మించి సర్వత్ర యీ 

వనిన్ నింపగ స్వాగతించెదను భవ్యాత్మా! ప్లవాఖ్యాబ్దమా!                     8.

శా.

నాకే హర్షము గూర్చుమా యని యిటన్ నానాప్రకారమ్ముగా

నీకున్ జేయను విన్నపంబు జగతిన్ నిత్య ప్రసన్నంబుగా

నీకాలంబున నిల్పగల్గినను దానిన్ నాకు భాగ్యమ్ముగా

గైకొందున్ గొను స్వాగతమ్మిదె శుభాకారా!  ప్లవాఖ్యాబ్దమా!                      9.

No comments:

Post a Comment