Monday 12 April 2021

ప్లవ ఉగాది

 

మత్తేభమాలిక

ప్లవనామాబ్దము భారతావని పయిన్ భాగ్యాను సంధాయియై

స్తవనీయామితసచ్ఛుభాస్పదలసత్సత్కార్యదక్షత్వమీ

వనీసంస్థితమానవప్రకరభవ్యస్వాంతపీఠమ్మునన్

వసత్వాదిసమస్తయోగ్యమహదైశ్వర్యప్రభావమ్ముతో

వళానంతవినిర్మలోత్తమయశోదార్ఢ్యత్వముం జూపి స

త్కవితాజన్యవిభూతినిర్మితబృహత్కల్యాణ భాగ్యమ్ములన్

వసంతోషసుఖానుభూతిసహితౌన్నత్యంబు చేకూర్చగన్

శ్రవణానందకరామృతోపమవిశిష్టధ్వానయుక్తంబులై

వివిధాహ్లాదనిరంతరోత్సవశివావిష్కారముల్ సేయుచున్

వులూరించెడి శబ్ద సంపదలతో న్మానముల్ గూర్చుచున్

వివిద్వజ్జనవృద్ధకోటుల కెడన్ ల్యాణముల్ గాంచుచున్

వసార్ధక్యత నందు పద్ధతులలో ప్రావీణ్యతన్ నిత్య మీ

భువిపై నుండెడి వారు శుద్ధమతులై పొందంగ యోగ్యంబులౌ

అవినాశామితసత్వదీప్తులను సర్వానందముల్ గాంచ వా

స్తవ రూపంబున నందజేసి మదులన్ దైన్యత్వముం గూల్చి యీ

వనిర్మగ్నులపాలి ధైర్యదయునై ర్తిల్ల గాంక్షించెదన్.

No comments:

Post a Comment