శ్రీమన్మహావిష్ణవే
నమః
చం.
సురగణ
నిత్యవందిత విశుద్ధ సుఖప్రద సర్వపాప సం
హరణ మహత్త్వదీప్త ఘనహర్షవివర్ధక భక్తకోటి స
ద్వరద యశఃప్రసారకర వైభవదాయక భార్గవీపతీ
వరచరణారవింద జలపానవిభూతిని గోరి మ్రొక్కెదన్. 1.
హరణ మహత్త్వదీప్త ఘనహర్షవివర్ధక భక్తకోటి స
ద్వరద యశఃప్రసారకర వైభవదాయక భార్గవీపతీ
వరచరణారవింద జలపానవిభూతిని గోరి మ్రొక్కెదన్. 1.
మ.
జగదీశా!
మధుసూదనా! సురవరా! సర్వార్థసంధాయకా!
ఖగవాహా!మునిసంస్తుతా!
నుతగుణా! కారుణ్యరత్నాకరా!
యగజాతార్తిహరా!
సమస్తసుఖదా! హర్షప్రదా! శాశ్వతా!
నిగమాభ్యర్చిత!
వాసుదేవ! నృహరీ! నీకై సదా మ్రొక్కెదన్. 2.
శా.
నీనామంబు
జపించు భాగ్యగరిమన్ నిత్యంబు నేనందగా
హే
నారాయణ! భక్తలోకవరదా! హేముక్తిదాతా! హరీ!
దీనోద్ధారక!
దైత్యనాశనమహద్దీక్షాన్వితా! శ్రీపతీ!
నానాభాగ్యవిధాయకా!
సురనుతా!నాకీయవే సత్త్వమున్. 3.
శా.
నీనాభేదము
చూపనట్టి గుణమున్, నిస్స్వార్థభావంబు, స
న్మానార్హంబగు
వర్తనంబు,
భువిపై నవ్యానురాగంబు, దీ
నానీకామయకష్టసంహతులలో
నైనంత సాయంబులన్
నేనందించెడి
శక్తినిమ్ము కృపతో నిత్యంబు నిన్గొల్చెదన్. 4.
శా.
చక్రం
బీయెడ బంపి నామనమునన్ సర్వత్ర వ్యాపించి భా
వక్రౌర్యంబున
కాలవాలమయి నన్ బాధించు దుర్నీతులన్
వక్రీభూతచరిత్ర
కాకరములన్ వైకుంఠ! దివ్యాయుధా!
శక్రాదిత్రిదశార్చితా!
తునుమవే! సంతోష మందించవే! 5.
మ.
బహురూపా!
సకలస్థితా! నరసఖా! భాగ్యప్రదా! యిందిరా
సహితా!
దానవకోటిసంహరణదీక్షాదక్ష! సత్యాశ్రయా!
అహిభూషానుగ!
వేదవేద్య! పరమా! యజ్ఞేశ! పీతాంబరా !
అహితప్రాభవనాశ!
వత్సలుడవై యందందగున్ సన్నుతుల్. 6.
23.07.2018
No comments:
Post a Comment