Saturday 24 December 2016

న్యస్తాక్షరి

అంశము- 'శంకరాభరణం' బ్లాగుపై  అభిప్రాయం.
ఛందస్సు- ఆటవెలఁది.
నాలుగు పాదాల మొదటి అక్షరాలుగా వరుసగా
‘శం - క - ర - య్య’ ఉండాలి. 
పద్యంలో ఎక్కడా 'శంకరయ్య' పేరును ప్రస్తావించరాదు.
శంక యేల భావసంకోచ మది యేల
వితలల్లు పనిని ఘనత గూర్చు
మ్యమైన ఫణితి రయమున నేర్పు న
య్య నిజముగను శంకరాభరణము.1

శంకలన్ని దీర్చు సామర్ధ్యమును బెంచు
డు మనోహరంపు క్రమత జూపి
యము నేర్పు పద్య రచనంబున కనుడ
య్య సతతమ్ము శంకరాభరణము. 2


శంకరాభరణము సత్కావ్య రచనకై
డగువారి కెల్ల గతుల శుభక
మగు భావమొసగు రమణీయ శబ్దశ
య్య సమకూర్చుచుండు నసదృశమయి. 3.


అంశము- పెండ్లి వేడుక
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాల మొదటి అక్షరాలుగా వరుసగా
‘వి - వా - హ - ము’ ఉండాలి.




వినుడు కమనీయమై యొప్పి యనుపమముగ
వాసి గలిగించు వధువుకు వరున కతుల
ర్ష దీప్తులు చిందించు నందరకును
మునిజనామోద మైనట్టి మనువు భువిని. 

విజ్ఞవరులార! కళ్యాణ వేదికపయి
వాద్యఘోషలు మిన్నంట వరుడు గనుడు
ర్షమున మంగళపు సూత్ర మంది యదిగొ
ముదిత మెడలోన ముడివేసె మోహనముగ.

వివిధ రకముల భోజ్యంబు లవిరళమగు
వారిజాక్షుల ముచ్చట్లు వాద్యగతులు
రిత పత్రాలమాలలు పరిణయమున
ముదము గూర్చును సర్వథా మదిని దోచు.

అంశము- ఉత్తరుని ప్రగల్భములు
ఛందస్సు- ఉత్పలమాల
మొదటి పాదం 1వ అక్షరం 'ఉ'
రెండవ పాదం 7వ అక్షరం 'త్త'
మూడవ పాదం 14వ అక్షరం 'రుఁ'
నాల్గవ పాదం 19వ అక్షరం 'డు'




న్నత విక్రమాన్వితుడ, నుత్తర నామ సుశోభితుండ నే
గ్రన్నన జేరి యి
త్తరిని గౌరవ సేనల జీల్చి గోకులం
బెన్న మరల్చి దెత్తునిదె యీరలు, పౌ
రులు కుందనేల నా
కన్నిట దక్షుడొక్క డిట నబ్బినచో రథచోదకుం
డుగాన్.


No comments:

Post a Comment