Saturday, 24 March 2012

సన్మానపత్రాలు-ప్రశంసా పద్యాలు.


  
"బహుముఖ ప్రజ్ఞాశాలి, స్నేహశీలి"
శ్రీ ముళ్ళపూడి కోటేశ్వరరావు
(ప్రధానాచార్యులు, జ.న.వి., వెన్నెలవలస)గారి
పదవీ విరమణ సందర్భమున సాదరముగా సమర్పించిన
ప్రశంసా పద్యరత్నములు
శా.
శ్రీకోటేశ్వర నామధేయ! సువచశ్శ్రీమంత! విద్యానిధీ!
యా కారుణ్యపయోధి శంకరుడు మీకా విష్ణులోకేశులున్
శ్రీకల్యాణ గుణప్రదుండు గురుడౌ శ్రీ సాయినాథుండికన్
శ్రీకోటేశ్వరుడిత్తు రెప్డు శుభముల్ శ్రీకూర్మనాథదులున్. 
సీ.
ఆర్వేలశాఖలో నత్యుత్తమంబంచు
     యశమందు "ముళ్ళపూ"డ్యన్వయాన
జన్మించి విద్యల చతురత సాధించి
     జనకుల నలరించు వినయశీలి,
గురువృత్తి చేపట్టి కూర్మితో నలనాడు
     సాంఘికశాస్త్రాన సరళరీతి
పాఠ్యాంశరచనలు బహుసమర్థతతోడ
     నొనరించి యున్నట్టి యున్నతుండు,
తే.గీ.
సాధుచరితుండు, సద్వంశజాతుడతడు
గురులనధికుడు, సత్కార్యకరణధుర్యు
డఖిల జగముల"కోటేశ్వరా"ఖ్యతోడ
కీర్తి నందెడు గంభీర మూర్తి యతడు. 
సీ.
"రాణాప్రతాపుడై" రంగస్థలంబున 
     నింపుగా రసములొల్కించువేళ,
కార్యైకదీక్షతో సూర్యోదయాదిగా
     విధులనిర్వహణ గావించు వేళ,
సంఘసంస్కారంపు సద్భావయుతముగా
     సత్కావ్య రచనంబు జరుపు వేళ
తే.గీ.
నటుడు, కర్మఠు డటమీద నవ్య కవియు,
ఘనత నున్నత చరితుండు గానవచ్చు
వేయి మాటలు మరియేల విశ్వమందు
మేటి, "కోటేశ్వరార్య"! మీ సాటి లేరు. 
 సీ. 
రమణీయమై యొప్పు రాజఠీవిని గల్గు
     విస్ఫురితాంగంబు విగ్రహంబు,
మాధుర్యతాపూర్ణ మహిత గంభీరమై
     కమనీయమైనట్టి ఘన గళంబు,
సిరులకు చిహ్నమౌ శ్రీచందనంబుతో
     భాసిల్లు చుండెడి వదనదీప్తి,
కపటంబు లేకింత విపులంబునై యొప్పు 
     సద్భావదీప్తమౌ స్వాంతవీధి
తే.గీ.
యెందుజూచిన సర్వాంగ సుందరత్వ
మవుర! "కోటేశ్వరార్య"! మీ కహరహమ్ము
సకల శుభములు గల్గుచు జగతిలోన 
యశము లలమంగ వలయును దిశల నిండ.
సీ.
ముదముతో నెన్నొన్నొ పదవులు చేపట్టి
     నిష్ఠాగరిష్ఠత నిర్వహించి
ఘన నవోదయమందు క్రమత ప్రాచార్యులై
     సిద్ధసంకల్పులై సేవ జేసి,
శ్రీకాకుళంబున చిద్విలాసముతోడ
     విచ్చేసి విద్యాభివృద్ధి కొరకు
చర్యలు చేపట్టి శారదా నిలయమ్ము 
     గావించి సత్కీర్తి కట్టబెట్టి
తే.గీ.
నేడిట నవోదయంబును వీడుచున్న
యనఘ! కోటేశ్వరార్య! మీ రఖిల జగతి
భావి జీవన మందింక బహుళ యశము
లాయురారోగ్య భాగ్యంబు లంద వలయు.

జ.న.వి. శ్రీకాకుళం హిందీ టి.జి.టి. 
కుమారి. భాగ్యరేఖ  
ట్రాన్స్ ఫర్ సందర్భంగా 
వ్రాసిన శ్లోకములు
శ్రీపతి: సర్వదా పాయాత్
శీఘ్రం దత్వా వరం పతిమ్
సుమతీం భాగ్యరేఖాఖ్యాం
నిరంతర సుహాసినీమ్||
     స్వదేశే మహరాష్ట్రాఖ్యే
     ద్రక్ష్యసి త్వం సదా యశం
     విద్యాప్రదానకార్యేణ
     నాస్తి లేశోపి సంశయ:
విద్యావినయసంపన్నే!
మృదువాక్య సుశోభిని!
ఆర్యే! హే భాగ్యరేఖాఖ్యే!
సర్వత్ర శుభమస్తు తే|| 


జ.న.వి. హిస్సార్, హర్యానాలో 
ఉపాధ్యాయ మిత్రుడు 
శ్రీ ఆత్మారామ్ ఢిల్లాన్ 
పదవీ విరమణ సందర్భంగా
శ్రీమన్తమాత్మారామాఖ్య
ధీమన్తం సుస్మితాననమ్,
సర్వదో మాధవ: పాయాత్
దత్వా సత్కీర్తి సంపద:||
     విద్యావినయ సంపన్నం
     సాధుసచ్ఛీల సంయుతమ్,
     ఢిల్లాన్వంశమణిం ధీరం
     భవన్తం పాతు శ్రీపతి:||
సేవాకాలం త్వదీయం చ
విమలం కీర్తివైభవమ్,
పాబ్డా నవోదయే నిత్యం
స్మరన్తీహ తు సర్వదా||
     శుభం భవతు సర్వత్ర
     ధనం సౌఖ్యం చ సర్వదా
     శతాయుర్భాగ్యమారోగ్యం
     తవాధీనా: న సంశయ:||
విద్యాదానం పరం దానం
కృతం దక్షతయా త్వయా
ఇహలోకే పరే చైవ
యశం పశ్యసి నిర్మలమ్|| 
31.10.2010

శ్రీకాకుళం జిల్లాధీశులు 
"శ్రీ ఎ. కోటేశ్వరరావు గారు" 
జ.న.వి. వెన్నెలవలసను సందర్శించబోవు సందర్భముగా వ్రాసిన పద్యములు. 
(కొన్ని అనివార్య కారణముల వలన వారా విద్యాలయమునకు వచ్చుట సంభవించలేదు)

కం. 
శ్రీ కోటేశ్వరవర్యా!
గైకొని మా స్వాగతమ్ము ఘనవత్సలతన్
మీకరుణారసదృక్కుల
నేకాలము జూపవలయు నింపలరంగా.
తే.గీ.
సాహితీప్రియ! సర్వజ్ఞ! సాధుచరిత!
పాలనాదక్ష! సద్ధర్మపక్షధారి!
సకల సద్భావసంపన్న! సుకవి వినుత!
చారుగుణశీల! మీ కిదె స్వాగతమ్ము.
కం.
మీమాటలు మధురములవి
మీ మనమతి కోమలంబు, మీపాలనయున్
ధామము సమతా దృష్టికి
ధీమన్! కోటేశ్వరార్య! దివ్య చరిత్రా!
తే.గీ.
అనఘ! మీరాక చేత నేడధికముగను
మోదమందినదార్య! నవోదయంబు,
పద్మబంధుని దర్శనభాగ్యమునను
పరిఢవిల్లెడు వారిజాకరము భంగి.
తే.గీ.
ధరను వెలుగొందు మీ మార్గదర్శనమున
మానితంబుగ మకుటాయమానమగుచు
సకల విద్యాలయంబుల సర్వగతుల
ఉన్నతత్వంబునంది నవోదయంబు. 

శ్రీ డి.వి.ఎస్.ఆర్.మూర్తి గారు, 
ప్రధానాచార్యులు, జ.న.వి.వెన్నెలవలస,  నుండి 
జ.న.వి. కొరాపుట్, ఒరిస్సాకు బదలీపై వెళ్ళుచున్న సందర్భముగా 
వ్రాసిన పద్యములు.

కం.
శ్రీరామమూర్తి వర్యుల
నారాముండఖిలదుండు నతివత్సలతన్
భూరి యశంబుల నొసగుచు
కారుణ్యముతోడ బ్రోచు ఘనముగ నింకన్.
ఆ.వె.
సద్గుణంబు లెన్నొ సత్వరంబుగ వచ్చి
మిథ్యగాదు, నిజము మిమ్ము జేరె,
సకల సుఖములబ్బి సత్కీర్తిమంతులై
మోదమందుదార్య! మూర్తి వర్య!
మ. 
భవదీయామృతతుల్యభాషణము, సద్భావప్రదీప్తంబునై
నవనీతోపమమైన మానసము, సన్మార్గానువృత్తంబు, దా
వివిధంబై వెలుగొందు పాండితియు, సద్విఖ్యాతమౌ శీలమున్
భువి సత్కీర్తి నొసంగజేయు నెపుడున్ భూరి ప్రమోదంబులన్.
ఆ.వె.
మంచి మనసు గలిగి మథురంపు ఫణితిని
మాటలాడు మిమ్ము మాధవుండు
సిరుల నొసగి బ్రోవ శ్రీమంతులై మీరు
ముదముతోడ మనుడు మూర్తి వర్య!
ఆ.వె.
భావిజీవనంబు బహుసౌఖ్యయుతమౌచు,
సాగుచుండవలయు సాధుచరిత!
సత్యమిదియ మీకు సర్వత్ర జయమౌను,
మోదమందుడార్య! మూర్తివర్య!. 
03.07.2002


నవోదయ విద్యాలయ సమితి, హైదరాబాద్ రీజియన్ 
అసిస్టెంట్ డైరెక్టర్ "శ్రీ శరచ్చంద్ర రథ్" గారు 
జ.న.వి. వెన్నెలవలస, శ్రీకాకుళంను సందర్శించిన సందర్భముగా 
వ్రాసి సమర్పించిన పద్యములు 
కం.
శ్రీయుతులయి వెలుగొందుడు
ధీయుత! శరదిందుతుల్య! తిరముగ సుఖముల్
శ్రేయంబులు, భోగంబులు
శ్రీయశములు గల్గు గాత, శ్రీ చంద్రరథా!
కం.
మీమాటలు మథురములవి
మీ మనమది నిర్మలంబు మీవర్తనమున్
నీమంబులు గలయట్టిది
సేమంబిక గల్గుగాత, శ్రీ చంద్ర రథా!
కం. 
ఆచార్యతనున్నప్పుడు
ప్రాచార్యత్వంబునందు, పాలనమందున్
మీచిద్విలాస వదనము
శ్రీచిహ్నితమౌచు వెలుగు శ్రీ చంద్ర రథా!
కం.
భోపాలున "ఏ.డీ."గా
నాపిమ్మట "డీ.డి" పదము(చార్జి) నందిన వేళన్
ఏ పదవి నందియుండిన
నాపదవికి వన్నె గల్గె ననఘ! రథార్యా!
కం.
ఈ భాగ్యనగరమందున
శోభిల్లుచు సమితియందు శుభవిగ్రహులై
మాభాగ్యవశము నుండిన
మీ భాగ్యము చెప్పతరమె, మిగుల రథార్యా!
30.04.2004 

జ.న.వి. వెన్నెల వలస ప్రథమ ప్రాచార్యులు
శ్రీ కె.కేశవరావు గారు 
న.వి.స. భోపాల్ లో అసిస్టెంట్ డైరెక్టరుగా పదవి నిర్వహిస్తూ 
విద్యాలయాన్ని సందర్శించిన సందర్భముగా 
వ్రాసి సమర్పించిన పద్యములు.
సీ.
శ్రీకళావాసమౌ శ్రీకాకుళంబున
          నుదయించినట్టి నవోదయాన
ప్రాచార్య పదవిలో బహు సమర్థతతోడ
          దీర్ఘకాలము నిల్చి దివ్యయశము
నందితి రటపైన నా బస్తరాఖ్యమౌ
          ఛత్తీసు రాష్ట్రాన చతురులగుచు
సాధువర్తనతోడ సద్యశోవైభవ 
          దీప్తులనార్జించి  దిల్లికేగి,
తే.గీ.
నాగపురమందు వెలుగొందు నవనవోద
యాన సాహాయ్య డైరెక్టరాఖ్యతోడ
ఖ్యాతి గడియించి యున్నట్టి ఘనులు మీరు
క్రమత కేశవరాయార్య! విమల చరిత!
తే.గీ.
నేడు భోపాలు ప్రాంతాన నియమితులయి
సమితి కార్యాలయంబున నమిత దీక్ష
సేవలందించు విధమది చెప్ప తరమె!
రమ్య గుణధుర్య! కేశవ రాయ వర్య!
కం. 
మీసేవా తత్పరతయు
భాసిల్లెడు పాలనంపు బహుదక్షతయున్
వాసిగ క్రమశిక్షణ గల
వేసంబది కేశవార్య! వినుతింప దగున్. 
కం.
ఈ విద్యాలయ మిచ్చట
భావింపగ తీర్చి దిద్ది బహువిద్యలతో
దేవాలయ తుల్యంబుగ 
గావించిన ఘనత గలదు కర్మఠ! మీకున్.
ఆ.వె.
శుభము గల్గుగాత! విభవంబు లటపైన
గల్గుగాత, మీకు క్రమత నింక
సాధుయశము లబ్బి సరియైన పదవుల
నందవలయు కేశవార్య! భావి. 
30.04.2004 

జ.న.వి. వెన్నెలవలస, శ్రీకాకుళం ప్రాచార్యులు
 "శ్రీ వి. నారయణారావు" గారు 
జ.న.వి. కృష్ణాపురం, నెల్లూరుకు బదిలీపై వెళ్ళుచున్న సందర్భముగా 
వ్రాసి సమర్పించిన పద్యములు.
కం. 
శ్రీ నారాయణవర్యుని
నానావిధ పదవులందు నవతేజముతో
రాణింపగ జేసెడు తా
నానారాయణు డఖిలదు డతివత్సలతన్.
తే.గీ.
అనఘ! నారాయణార్య! మీ యనుపమమగు
పర్యవేక్షణమందుచు బహుళఫలము
లంత బడయంగ వలెనెప్పుడమలయశము
మోదమందంగ ఘనత "నవోదయంబు."
కం. 
దశదిశలన్ మీ యశములు
నిశజీల్చెడు జ్యోత్స్నలట్లు నిఖిలజగానన్
విశదములై విజయము మీ
వశమౌ నారాయణార్య! వైభవమొప్పన్.
ఆ.వె.
మించు యశము గల్గి, మేళ్ళును శుభములు
సిరుల పంట పండి జీవనంబు
సకలసుఖములబ్బి సంతోషమయమౌచు
సాగుగాత మీకు చక్కగాను.
కం.
నాయాయణరాయార్యా
ధీరాత్మక! సద్విషయనిధీ! నెల్లూరున్
తోరంబగు సత్ఫలముల
మీరంగా చేయవలయు మీరెల్లెడలన్.

జ.న.వి.  వెన్నెలవలస, శ్రీకాకుళం ఉద్యోగి 
ఎల్. గురులు పదవీ విరమణ సందర్భంగా 
వ్రాసిన పద్యములు
తే.గీ. 
శ్రీశ గౌరీశ ముఖ్యులు సిరులు గూర్చి
ఆయురారోగ్య భాగ్యంబు లంద జేసి
గురుల కన్నింట నికపైని గురుత నొసగి
కరుణ జూతురు సర్వదా ఘనముగాను.
ఆ.వె.
శేషజీవితంబు శ్రీమంత మారోగ్య
ధామమగునుగాత, ధరణిలోన
శతవసంత మఖిల సంతోషయుతమౌచు
జరుగు చుండు గాత! గురులు నీకు.
కం.
గురుతరమౌ నీ సేవలు
గురులూ! యీ యాలయాన కూర్ములు నిండన్
నిరతము స్మరియింతురుగా
చిరయశములు గల్గు నీకు జీవన మందున్.
కం.
పదవీ విరమణ పిమ్మట
సదమల భావంబుతోడ సాంఘిక సేవన్
ముదమున చేయం గురులూ
మది వెల్గును, తొలగిపోవు మాలిన్యంబుల్.
ఆ.వె.
పెద్దవాడవౌచు ప్రియవాక్యములతోడ
పలుకరించు చుండి, పరుల కెపుడు
సహకరించు కొరకు సన్నద్ధమౌ నిన్ను
కరుణఁ జూపి భవుడు గాచు గాత! 
26.04.2007.
జ.న.వి. విజయనగరం హిందీ పి.జి.టి. శ్రీమతి పాగోలు సుగుణకుమారిగారి పదవీవిరమణ సందర్భంగా 

´ÉÏqÉixÉÑaÉÑhÉxÉÇmɳÉÉqÉç
xÉÑaÉÑhÉÉrÉÉïÇ rÉzÉÎxuÉlÉÏqÉç
pÉiÉ×ïrÉÑ£üÉÇ ÌuÉlÉqÉëÉ…¡ûÉqÉç
mÉÉiÉÑ ÌuɵÉåµÉU xxÉSÉ||  
mÉÉaÉÉåsÉÑuÉÇzÉÉZrÉ xÉÑkÉÉxÉqÉÑSìå
´ÉÏzÉåwÉÌaÉrÉÉïrÉï qÉWûÉåSrÉxrÉ
´ÉÏxÉirÉuÉirÉÉ¶É iÉlÉÔeÉÃmÉÏ
xÉɤÉÉSìqÉæwÉÉ xÉÑaÉÑhÉmÉëmÉÔhÉÉï||
xÉlrÉÉÍxÉUÉrÉÉZrÉ ÍqÉqÉÇ qÉWûÉliÉqÉç
sÉokuÉÉ mÉÌiÉÇ xɪÒhÉUÉÍzÉrÉÑ£üqÉç
mÉѧÉϲrÉÇ mÉëÉmrÉ xÉqÉxiÉxÉÉæZrÉqÉç
SØ¹Ç qÉWû‹ÏuÉlÉrÉÉlÉqÉkrÉå||
lÉuÉÉåSrÉåskrÉÉmÉlÉuÉ×Ì¨É qɧÉ
xuÉÏM×üirÉ WûwÉåïhÉ xÉÑSÏbÉïMüÉsÉqÉç,
ÌuɱÉmÉëSÉlÉÇ xÉiÉiÉÉSUåhÉ
M×üiuÉɱ ÌuÉ´ÉÉÎliÉ qÉÑmÉæÌiÉ xÉÉkuÉÏ||
xÉuÉï§É zÉÑpÉqÉxiuÉxrÉÉ:
xuÉÉxjrÉÍxÉή xxÉSÉ pÉÑÌuÉ
pÉÉÌuÉeÉÏuÉlÉrÉɧÉÉrÉÉqÉç
sÉprÉiÉå lÉÉ§É xÉÇzÉrÉ:||

                                                               29.04.2013
శ్రీవిభు డాజనార్దనుడు, చిన్మయరూపుడు శంకరుండు తా
నావిధి సర్వకాలము మహావిభవంబుల బ్రోచుచుండగా
భావిని శేషజీవితము స్వాస్థ్యసుఖాత్మకమౌచు వెల్గు, నా
నావిధ సంపదల్ సుగుణనామక కీయమ కబ్బుగావుతన్.

సుగుణకుమారినామమున శోభిలుచుండెడి సద్గుణాఢ్యయై
యగణితమైన నిష్ఠగొని యద్భుతరీతిని దేశభాషలో
జగములవారు మెచ్చువిధి చక్కని బోధన మాచరించుచున్
మిగుల యశంబు గాంచినది, మేలగు సౌఖ్యము లీమెకందెడున్.


హిందీభాషాబోధన
మందంబుగ జేయుచుండి యనవరతంబున్
వందలుగ బుద్ధిమంతుల
నందించిన భాగ్యశాలి యనదగు నీమెన్.

పదవీవిరమణ వరకును
ముదమందుచు భారమనక మునుపటి యట్లున్
సదమలభావము నింపిన
దుదయాదిగ విధులలోన నుత్సాహమునన్.


పరమపావనమైన పాగోలువంశాన
             శుభలక్షణాఢ్యయై ప్రభవమంది,
చింతాన్వయంబును జేరి సన్యాస్యార్య
             సాహచర్యమునందు సంతసాన
పుత్రికాద్వయమును పొందియుండుటె గాక
             పాఠ్యబోధన చేసి బహుళగతుల
సత్పుత్రి, యర్థాంగి, జనని, యొజ్జయు నౌచు
             ఖ్యాతి నందిన దీమె ఘనముగాను
భావిజీవనంబు బహుసౌఖ్యయుతమౌచు
సాగుచుండవలయు చక్కగాను
సాధుయశము లంది స్వస్థత చేకూచు
చుండవలయు నీమె కుర్విలోన. 


   No comments:

Post a Comment