Monday 19 March 2012

సరదా పద్యాలు(ఆశువులు)

 కారప్పూస.
మైదా మైసూర్ బజ్జీ
మోదంబందించు నా సమోసా ల్పూరీల్
మీదట బూరెయు గారెయు
కాదేదీ నీకు సాటి కారప్పూసా!

వె.ధ.వ.(వెధవ)
వెయ్యి వత్సరంబు లయ్యరో నీవింక
ధనము కల్గియుండి ధరణిలోన
వైభవంబులంది వర్థిల్లు మనుటయే
వెధవ కర్థ మిలను విజ్ఞులార!

హౌసుకు వెళ్ళగా వలయు హాజరు కోసము మిత్రమాయికన్
వాసిగ మార్గదర్శనము వారికి కొంచెము చేయగా వలెన్
కాసిని మంచి మాటలను కమ్మగ చెప్పెద మందు చేతనే
భాసురవేగ యుక్తమగు వాహన మెక్కుము జాగదేలనో. 





No comments:

Post a Comment