శ్రీరామ
ధనము
(విభిన్నవృత్తములు)
81.
త్రిపద లలితము (నౌనౌభనౌభనౌ సః)
నన నన భన భన స 13,19 అక్షరములు
మనుజునకు నిలపయిని గన మైమరపు గొను మాన్యతల నిడి మిగులన్
ఘనతరము లయిన వగు బహుకామ్యములను
సుఖంబులను గను బలమున్
వినుతులను ముదముల నతుల విస్తృతముగను
వేడకయె గొను కలిమిన్
ధన మనిశ మొసగునదిగద దైవము వలెను
తథ్య మిదియన సుమతుల్.
82.
త్రిభంగి నస భన తజ తస య 8,15 అక్షరములు
చదువులు కొనంగా క్షమత యది లేకే సరియైన
జ్ఞానంబు గలవాని బోలెన్
ముదమున మనంగా బుడమిపయి
దానున్ బురుషుండు గాంచున్ బలిమియున్ జవంబున్
సదయుడ యనంగా జనులకయి పొల్చున్ సకలంబునందున్
గరుణశూన్య మైనన్
పదపడి ధనంబీ వసుధపయి జూపున్ వరమైన
సత్వం బతుల మైన రీతిన్.
3.
వికసిత కుసుమము మభౌ నషట్కం సః మభ నన నన నన స 13,22 అక్షరములు
అందం బింతేనియును గనబడని యతనికి
స్మరుని సము డనెడి ఘనతన్
నిందింపన్ యోగ్యుడగు జనునకును నిరుపమగుణములకు
నిలయు డనుచున్
సందర్భంబున్ గలుగు విధ మిలను సకలగతుల
ధన మొసగు ననిశ మీ
చందంబున్ గాంచిన వెఱగగు నిట జగముల
నిదె నిలుపు జయము గొనుచున్.
84.
కుసుమస్తవకము నవభిస్సగణైః(9 సగణములు) 11,19 అక్షరములు
అనిలో నిలువన్ దలపైన నహో
గొనబూననివా డతివీరు డగున్ ధనమం
దిన చాలును దా మహిలోన స్థిరంబగు
పేరది యంది మహాముదముం గొను నిం
దనుమాన మొకింతయు లే దిహమం
దిదియే ప్రభువై యతులంబగు గౌరవమున్
గనుచుండె గదా తనసాటిగ నేదియు
నొక్కటియున్ గనరా దని యందరనన్.
85.
లాక్షణికవృత్తము (లాక్షణికము) భ నన నన భ నన స 16వ అక్షరము
ధాత్రిని ధనము గలిగిన నతనికడ దాము
నిలిచెదరు జను లెపుడున్
స్తోత్రములను సలిపెద రతడె తమకు జుట్ట
మగునని పలుకుచు మహ
చ్చిత్రమగువిధి కలిమి తొలగిన యెడ జేరుటకు
నయిన దలపరికన్
నేత్రముల నయిన నతని గన రవుర! నిక్క
మిది యనుట యుచితమగున్.
86. మత్తమాతంగ లీలాకరము 9
రగణములు 8,16 అక్షరములు
భూమిలోనన్ ధనంబే ముదం బందజేయించుచున్ భుక్తికిన్
యుక్తికిన్ సాధనంబై మహత్
క్షేమముల్ గల్గు నట్లున్ స్థితిన్ మార్చునం చందరున్
జెప్పగా విందు మాడబ్బుచే శూన్యులై
తామిటన్ గష్టరాశిన్
ధరాస్థానమం దందరే దానిచే మానవ త్వంబునుం గూలెడిన్
నీమముల్ దప్పుచుండున్ నిజం బిందు సందేహముల్ నిల్ప
నేలా శుభాకాంక్షులౌ వారికిన్.
87. అహోకపుష్పమంజరి రజ రజ రజ రజ ర 10,19 అక్షరములు
మానవుల్ మదంబు దాల్చుచున్ మహాత్యహంకృతిన్
ధరించి మానసంబునన్ ధరాతలిన్
జ్ఞానులయ్యు మత్సరించుచున్ సమస్తధర్మముల్
త్యజింత్రు సంపదల్ ఘటించగా నికన్
దానమన్న శబ్దమైన చిత్తమందు
నుంచకుందు రౌర! తాము కొంద రెమ్మెయిన్ గటా!
కానమే ధనప్రభావమున్ గ్రమంబులేక
జీవనంబు కందజేయునట్టి తత్వమున్.
88. ప్రచితకము 2 నగణములు+7 యగణములు
10,19 అక్షరములు
ధనమదమున స్వకీయున్ దదీయున్
సమస్తంబు నెంతో దయాహీనతన్ జూచుచుంటల్
మనుజకులమున నయ్యో! మహిన్
గాంచుచున్నార మెప్డున్ మహాకర్కశత్వంబుతోడన్
దనుజగుణములు తానీ ధరన్
మానవానీకమందున్ ద్వరన్ బూని కల్పించుచుండున్
ఘనగుణు లయినవారీ క్రమంబున్
గ్రహించంగ మేలౌ గదా
నిత్యకల్యాణకాంక్షన్.
89. చండవృష్టిప్రపాతము 2 నగణములు + 7 రగణములు (నగణ యుగళమత్రచేత్
సప్తరేఫా) 10,16
అక్షరములు
కనుల నిలను ధర్మమున్ గాంచగా
నెంచకే గర్వమున్ దాల్చుచున్ సద్ధితం బింతయున్
వినుట కయిన చిత్తమున్ బ్రీతితో
జూపరీ విశ్వమం దీ ధనం బక్కటా! యిట్టులీ
మనుజుల కిట క్రూరులై మానవత్వంబుతో
మంచిగా నుండ యోచించకే నిత్యమున్
మనుటకు కతమయ్యె హా! మాన్యు లిద్దాని సంబంధమున్
దెల్వగా సంతసం బందెడిన్.
90. మాలాచిత్రము మత తత నన యయ య 11వ అక్షరము
ఔరా! యీ విత్తంబు యోచించగా నన్నిట
నవసరమయి యున్నన్ మహత్వంబు గూర్చన్
తోరంబౌ సౌఖ్యంబు కల్పించి సంతోషముల
నొసగగల దైనన్ మరెన్నో యఘాలన్
గారుణ్యం బింతేని లేకుండగా కాంక్షితమతి
యగుచును జేయించుచుండున్ వివేకుల్
సారాత్ముల్ సాధింతు రత్యంత సత్ సౌఖ్య
మెపుడు ధనమునకున్ బానిసల్ గాక యుండన్.
No comments:
Post a Comment