Tuesday, 1 October 2024

గాంధీజీ

 గాంధీజీ,శాస్త్రీజీ

సీ.

స్వాతంత్ర్యసాధనా సమరయజ్ఞమ్మున  

తనసంపదను వీడు త్యాగి యతడు 

సత్యాగ్రహమ్ముతో సర్వప్రపంచాన

ధర్మదీక్షను దెల్పు ధన్యుడతడు 

శాంత్యహింసలె యుద్ధ శస్త్రాస్త్రములటంచు 

సడలకుండిన గొప్ప శక్తి యతడు

తనదేశమాతృకాదాస్యశృంఖలలను 

త్రుంచుదాకను విశ్రమించ డతడు 

ధరవారలందరు తనవారలనియెడి 

తన్మయత్వమ్ముతో తనిసె నతడు

ధరణిని గావంగ చెరసాలయైనను 

స్వీకరించిన మహచ్ఛ్రేష్ఠు డతడు

సత్యమార్గమె నిత్య జయసాధకంబని 

చూపించియుండిన శూరుడతడు

దేశసేవను మించు దివ్యకార్యము లేదు 

ప్రజలార! రండన్న సుజనుడతడు

తే.గీ.

జాతిపితయౌచు జనులకు సౌఖ్యవితతు

లొనరజేసినవాడు సర్వోన్నతుండు 

గాంధి మహనీయు డాతండు ఘనగుణుండు 

ఆమహాత్మున కీవేళ నంజలింతు.

Saturday, 20 July 2024

గురువందనము

 🙏🙏

శ్రీగురుభ్యో నమః


ఉ.

శ్రీయుతులై నిరంతరము శిష్యుల దక్షత నెంచి విద్య లా

ప్యాయతతోడ నేర్పుచు మహత్తరశక్తులు గూడునట్లుగా 

స్వీయసుధామయోక్తులకు జిన్మయభావము జేర్చునట్టి స

ద్ధ్యేయుల మద్గురూత్తముల దీవెన లందగ భక్తి మ్రొక్కెదన్.     1.

మ. 

పరమానందముతోడ శిష్యగణముల్ పాఠంబులన్ నేర్చుచున్ 

వరవైదుష్యమునందు మార్గ మెపుడున్ భవ్యానురాగమ్ముతో 

గరుణన్ జూపినయట్టి మద్గురువులన్ గల్యాణభావైక సు

స్థిరులన్ మ్రొక్కెద నమ్రతాయుతుడనై 'జే'యంచు నిత్యంబిటన్.    2.

శా.

రారా, రమ్మని వత్సలత్వగరిమాప్రాగల్భ్య  మేపారగా

జేరం బిల్చుచు సాహితీపరిమళశ్రీ లందు  సామర్ధ్యమున్ 

దీరౌరీతిని నేర్పియున్న గురులన్ ధీమంతులన్  పాండితీ

పారావారుల నంజలించెద మహద్భావాఢ్యులన్ ప్రాజ్ఞులన్.    3.

చం.

సముచితవర్తనం బెపుడు సవ్యవిధంబున జేయుచుంట సు 

క్షమతనుజూపి ఛాత్రులకు సన్నుతవిద్యను నేర్పుచుండుటల్ 

సమతను జిత్తవీధి గొని సాధువచస్సుల నాడుచుంట లా

యమలినభావులౌ గురుల యాయతసత్కృప   యంజలించెదన్.   4.

శా.

ఈనా డీగతి నాల్గుశబ్దములు స్వీయేచ్ఛానుసారమ్ముగా

నానందప్రదభావజాలవిలసద్యత్నమ్మునన్ బల్కుటల్

జ్ఞానస్థానగురూత్తమప్రకరముల్ నైజప్రకాశమ్ముతో

గానం జేసిన దీప్తి హేతువు కదా కైమోడ్తు నవ్వారికిన్.   5.

సీ.

ఆదిని గురువులై యవనీస్థలంబందు 

సంచరించుట నేర్పు జన్మదులకు,

అక్షరంబుల జ్ఞాన మారంభమున జూపి

యుత్సాహమును జేర్చు నొజ్జలకును,

సుజ్ఞానసజ్జ్యోతి శోభిల్లగా గాంచ

మార్గదర్శకులైన మాన్యులకును,

లలితశబ్దము లంది పలుకగల్గిన రీతు

లరయ జేసిన యట్టి గురువరులకు

తే.గీ.

హరిహరాజుల రూపులై యవనిపైన 

స్వప్రకాశమ్ము జిమ్మిన సద్గురువర

కోటి కీవేళ శబ్దముల్ గూర్చి యిచట

నందజేయుచు నున్నాడ వందనములు.     6.

ఉ.

నాలుగుదిక్కులన్ బరమనైష్ఠికతన్ గొని సంచరించి ధ

ర్మాలయుడై జగంబున  మహత్వము దెల్పెడి పీఠరాజముల్ 

మేలని నిల్పి బోధనల మేటి ముదంబును గూర్చినట్టి యా

కాలడి శంకరార్యఘను గారణజన్ముని సన్నుతించెదన్.   7.

శా.

వేదశ్రేణికి రూప మీగతి యగున్ విందౌ పురాణంబులన్

మోదం బందుచు నేర్వగానని పయిన్  బూర్ణాచ్ఛవిజ్ఞానదంబై

వేదాభంబగు భారతాఖ్యసుకృతిన్ విన్పించి విఖ్యాతికిన్

బాదై నిల్చిన వ్యాసమౌనికి మహద్భక్తిన్ బ్రణామించెదన్.     8.

🙏🙏

హ.వేం.స.నా.మూర్తి.

21.07.2024

Friday, 28 June 2024

సూర్యుడు

 

సూర్యుడు

సీ.

సప్తాశ్వరథముపై సన్నుతం బగురీతి

నాకాశమార్గాన నరుగువాడు

అగణితచైతన్య మవనీస్థలంబందు

ప్రత్యహంబును జేరి పంచువాడు

సకలకార్యములందు జగతిలో సర్వత్ర

సాక్షియై నిత్యమ్ము సాగువాడు

నిస్స్వార్థబుద్ధితో నిస్తులానందంబు

లిలలోన నంతట నిలుపువాడు

తే.గీ.

పరమపావను డౌచును నిరుపమగతి

తన కరస్పర్శతోడను ధరణిపైన

హాయి చేకూర్చుచుండెడి యనుపముండు

భవ్యచరితుండు సృష్టిలో భాస్కరుండు.

ఉ.

వందన మోప్రభాకర! శుభప్రద! సన్నుతసత్వసంయుతా!

సుందరభావశోభిత! విశుద్ధయశోమయ! లోకపాలకా!

డెందము లుబ్బు నిన్గన వడింజను భీతియు ధైర్యవాయువుల్

బృందములౌచు జేరును నవీనముగా బలమందు నెల్లెడన్.

శ్రీ సరస్వత్యై నమః.

 

శ్రీ సరస్వత్యై నమః.

 

కం.

శ్రీలిచ్చి కాచు దానవు

లాలితముగ విద్యలొసగి లక్ష్యంబునకున్

మేలైనరీతి జేర్చుచు

బాలించెడి నిన్ను సతము బ్రాహ్మీ! కొలుతున్.                  1.

కం.

భారతి! వీణాపాణీ!

శారద! పరమేష్ఠిరాణి! సన్నుతి, వాణీ!

వారిదమేచకవేణీ!

తీరుగ గావుము  ప్రణమిత దివిషచ్ఛ్రేణీ!                                       2.

కం.

రసనాగ్రమందు నిలుచుచు

నసదృశసుఖ మందజేసి యవనీస్థలిలో

దెసలన్ని నిండు యశముల

నొసగెడి శబ్దస్వరూప! యోయమ!ప్రణతుల్.                   3.

కం.

భాషాయోష! సరస్వతి!

భూషితసౌజన్యతత్వ! పుడమిని గల దుర్

వైషమ్యంబుల కంటని

భాషను నాకొసగుమమ్మ! ప్రణుతింతు నినున్.                4.

కం.

చదువులతల్లి! కృపామయి!

సదమలహృదయారవింద! సంస్తుతబృందా!

వదలని భక్తిని మ్రొక్కెద

మది నమలత నింపుమమ్మ మన్నన లందన్.                   5.

శ్రీ పరమేశ

 శ్రీ పరమేశ

 (పరమేశ వృత్తము - స న జ భ గగ -10వక్షరము యతి) 

"పరమేశ" యనెడి భవ్య పద్యము నందున్

కరుణాత్ముడవయి మమ్ము గాచెడి నిన్నున్

వరదాత వగుట చేత ప్రార్థన చేయన్

స్థిర శక్తి నొసగుమయ్య శ్రీ పరమేశా!

 

 కరుణామయుడవు నీవు కావున దేవా!

ధరలోన నిడుము లంది త్రాహి యటంచున్

స్థిరదీప్తి యడుగు నన్ను జేరుము కావన్

సిరులీయ మనుట లేదు  శ్రీపరమేశా!                             

 

సతతంబు గొలుతు నిన్ను శంకర! శర్వా!

నుతులంది భువిని నన్ను నొవ్వనిరీతిన్

జతచేసి బలము నెందు సజ్జయ మందన్

క్షితిలోన నిలుపు మయ్య శ్రీపరమేశా!                              

 

శివరాత్రిసమయమందు జేసెదనయ్యా

భవదీయ మహిమదెల్పు పాఠము లిందున్

భవబంధములను ద్రుంచి భక్తుని నన్నున్

శివ! కావు మభవ! భర్గ! శ్రీపరమేశా!                                 

 

అనుమాన పడుట లేక యాయతభక్తిన్

నినుగొల్తు సతము మ్రొక్కు నీకు నొనర్తున్

ధనవృద్ధి యడుగ బోను తావకభక్తిన్

చినవాడ నగుట నిమ్ము శ్రీపరమేశా!                                

 

మదిలోన నిలిపి నిన్ను మానక కొల్తున్

నదిలోని జలము దెచ్చి స్నానము గూర్తున్

వదలంగ దలచకుండు పాపచయంబున్

చిదుమంగ నడుగుచుంటి శ్రీపరమేశా!                           

  

హరినామ జపము చేయ నందును సౌఖ్యం

బురుదీప్తి కలుగునెప్పు డున్నతలీలన్

ధరపైన మనుజు డందు ధన్యత తానున్

చిరకాల యశము వచ్చి చేరుచునుండున్

 

హరికంటె ప్రభు డొకండు నన్యుడు లేడీ

ధరలోన నిజము గాన తన్మయు లౌచున్

నరులెల్ల గతుల దీని నమ్ముచు నుండన్

మురహంత దయను జూపి మోదము గూర్చున్

 

హరి! నిన్ను దలచుచుందు నన్ని విధాలన్

స్థిరభక్తి గొలువ బూని చేరుచు నుందున్

గరుణించు మనిన జాలు గావగ జేరున్

వరమిచ్చి మను మటంచు భాగ్యము లిచ్చున్.

 

ఇలలోని గతుల జూడు మీశ్వర నీవున్

కలనైన నిజము బల్కు కాంక్షయె లేదీ

కలికాలమునను దేవ! కామ్యద నీవే

పలికించవలయు దీనపా! పరమేశా!

 

గురులందు జనకులందు  గూడక యుండెన్

నరజాతి కిచట భక్తి నాగసుభూషా!

పరికించ దలచ వేమి భాగ్యవిధాతా!

ఉరుభావ మొసగలేవె యోపరమేశా!

 

తనకంటె ఘనులు చూడ ధాత్రిని లేరం

చనుచుండి జనుడు తానె యన్నివిధాలన్

ఘనమత్సరమున గూలి కష్టము లందున్

తనదీప్తి యుడుగ గుందు దా బరమేశా

సభ్యత

సభ్యత

(విభిన్నవృత్తములు)

91.  శాకాయతనము  (నందభకార గకార) 9 భగణములు+ఒక గురువు  13,19,25 అక్షరములు

దైనిక జీవన సభ్యత యేమను దానికి టిప్పణి తానగు జూడగ థ్యముగాన్

దేనెల మాటలు బల్కుచు నుండుట దీప్తులు చిమ్మెడి దివ్యమనంబున దేలుటయున్

దానయి చేరుచు దీనజనాళికి దానము చేయగ న్మయతన్ గొని ల్చుటయున్

మానవులందరు సోదరులే యను మంచిస్వభావము మానక తాల్చుట న్నికతోన్.

92. శాలూరము   తన నన నన నన న లగ  17వ అక్షరము

బోధించు గురువులయెడ నెపుడు వలయును పుడమి గన వినయ మనునదియున్

శోధించు పనుల నతుల మయిన నిలకడ సురుచిరమయిన స్పృహ గలుగుటల్

బాధించు గుణచయమును వదిలి మనగల రబలము సత మరయుట యికన్

వేధించు కినుక యది బెరుగుటను త్వరగ విడువగలుగుట లదె యిట నగున్. 

93.కళ(కలా)     నన నన నన నన న లగ   9,17 అక్షరములు

క్షితిజములను నరికి వనముల క్షతికి చెనటి తనమును సలుపమి యికన్

తతము నదులను కల కలుషములు రి యనుచు గలుప కునికి జనుల్

వెతలను బడువిధి వివిధ దురితము లవిరళముగను గొనక నిలుచుటల్

తురత కనుపడ తమును బలుకుచు మత గనుటయు నిదియన దగున్.

94.      మణికిరణము   నన మన జన నన నలగ  8,16,25 అక్షరములు

రణిని గొన సత్సాంగత్య మగును సభ్యత యిక శుభవచనము య గొనుటల్

వరమగు తలపున్ వ్యంబయిన సుకర్మ రమసుఖదమయిన లయుతియున్

సురుచిరగతి సత్ సూక్తుల్ నలుగుర కంద జొనుపు మధురిమయును సుచరితయున్

నిరతము గురుసాన్నిధ్యంబును మనమందు నిలుపు కొన గలుగుట నిజ మిదియౌ.

95.      ప్రమోదమహోదయము                        మత యత నన నర స లగ  1323 అక్షరములు

దేశం బిద్ధాత్రిని జన్మం బందంగ నిపుడొక యవసరము తానిటన్ గలిగించెనో

మోదాత్ముండై నిత్యము తద్దేశంబందు మునినిభుడన శుభము లింపుగా ఘటియించగన్

వేదోక్తంబై వెల్గెడి సద్ధర్మం బందు విమలచరితమున స్పృహన్  విధుల్ త్యజియించకే

తాదాత్మ్యం బందున్ జనుడుంటౌగా సభ్యయన సకల గతులలో రాతలమందునన్.

96.                  పిలీలిక             మమ తన నన నజ భర             9,16 అక్షరములు

స్త్రీమూర్తిన్ శుభ్రాంగిన్ దివ్యాతివిమలగుణను స్థిరతరసరసభావదీప్తను హర్షదన్

క్షేమాకారన్ సంస్తుత్యర్హన్ సిరికి గురుతయి కృపకు నిలయగనుండు దానిని నిత్య మీ

భూమిన్ దోరంబౌ భక్తిన్ దాము నరు లరయగ బొడము గద శుభ మద్ది సభ్యత యంచు నా

ప్రేమస్వాంతుల్ విజ్ఞాళుల్ ధీవిభవమున నిట వెలుగు గురుజను లండ్రు పావను లింపుగన్.

97. లయహారిక        నన నన నన నన నన గ   9,16,25 అక్షరములు

నదు మతము నిట డియక మదికి నివి యగు విధమున లగక కొనుచున్

నమని పరులకు లుగు మతముల క్రమములను దలపగ డగి సమత తో

నుడు మనగలుగ యములు గనును దమలమతి యను యము నిట బడయున్

న నదియె యిది యలుషమతికిని ల గురుతగు  బహుసుద మదియె యగున్.  

98.      లలితము 8 నగణములు + సననయ  11, 21, 30 అక్షరములు  

యము వదలని నడత వసుఖకర మగుచు జనుతమయిన భావము రుడు గొను శక్తుల్

యపడ జనక సుకృతి రమనుచు సలుపుటయులుకున రుచిరత్వము సుధను శుభంబుల్

యములు గనుటకు గల దుపకరణము లనియు దువరుల వచస్సులు రిగ నివియే యా

య నది యగు ననుచు ధణిపయిని బలికెదరు ప్రణుతికి దగువారలు గ్రమ మనుచు దెల్వన్.

 

99.

ఘననినదము  4 నగణములు+జన జసస స భస  11,2029 అక్షరములు

 

నకు వలెనె పరులు స్తుమతులందరు సుఖము తాము బడయన్ దగువారు రన్ దప్పక యనుచున్

నులకొరకు దలచుట ముచితం బనుట యది భ్యత యగున్ వెస దా నిటన్ దద్గతహృదితో

నుట సురుచిరముగను హిత వాక్యచయమున మానసములం దరుసం బరం జేయుట లనయం

నఘు డగుటకొరకయి తనమున్ సలుపుటయు నౌను గద సభ్యత యా యముం ద్రుంచుకొనుటయున్.

 

100.  

లయహారి  నన నన నన నన నన నస గ  11 11 11 ప్రాసయతి

 

జగము లిట నిలుచుటయు దగు విధమున  సకలమున నగణితసుఖశుభచయ మొసగుట యెప్డున్

వగలు దొలగుట కలుములు గలుగుట విజయములకు నగు బలములు నమరుటకును గన దా నా

నిగమపథము సరియని భగవ దురుకృపను ధర గొనగలుగుటయు నిదియ యగు ప గయు గల్గన్

స్వగణము గతి సురుచిరముగ బలుకుచు నరయుటయు నగు నదియ యని పలికెదరు గ పెద్దల్.

ధనము

 

శ్రీరామ

ధనము

(విభిన్నవృత్తములు)

81.

త్రిపద లలితము            (నౌనౌభనౌభనౌ సః)         నన నన భన భన స                            13,19  అక్షరములు

నుజునకు నిలపయిని గన  మైమరపు గొను  మాన్యతల నిడి  మిగులన్

నతరము లయిన వగు బహుకామ్యములను సుఖంబులను గను బలమున్

వినుతులను ముదముల నతుల విస్తృతముగను వేడకయె గొను కలిమిన్

న మనిశ మొసగునదిగద దైవము వలెను థ్య మిదియన సుమతుల్.

82.  

త్రిభంగి             నస భన తజ తస య                8,15  అక్షరములు

దువులు కొనంగా క్షమత యది లేకే రియైన జ్ఞానంబు గలవాని బోలెన్

ముదమున మనంగా బుడమిపయి దానున్ బురుషుండు గాంచున్ బలిమియున్ జవంబున్

దయుడ యనంగా నులకయి పొల్చున్ కలంబునందున్ గరుణశూన్య మైనన్

దపడి ధనంబీ సుధపయి జూపున్ రమైన సత్వం బతుల మైన రీతిన్.

3. 

వికసిత కుసుమము   మభౌ నషట్కం సః         మభ నన నన నన స         13,22 అక్షరములు

అందం బింతేనియును గనబడని తనికి స్మరుని సము నెడి ఘనతన్

నిందింపన్ యోగ్యుడగు జనునకును నిరుపమగుణములకు నిలయు డనుచున్

సందర్భంబున్ గలుగు విధ మిలను కలగతుల ధన మొగు ననిశ మీ

చందంబున్ గాంచిన వెఱగగు నిట గముల నిదె నిలుపు యము గొనుచున్.

84.

కుసుమస్తవకము          నవభిస్సగణైః(9 సగణములు)     11,19 అక్షరములు

నిలో నిలువన్ దలపైన హో గొనబూననివా తివీరు డగున్ ధనమం

దిన చాలును దా మహిలోన స్థిరంబగు పేరది యంది మహాముదముం గొను నిం

నుమాన మొకింతయు లే దిమం దిదియే ప్రభువై తులంబగు గౌరవమున్

నుచుండె గదా తనసాటి నేదియు నొక్కటియున్ నరా దని యందరనన్.

85.

లాక్షణికవృత్తము (లాక్షణికము)  భ నన నన భ నన స      16వ అక్షరము

ధాత్రిని ధనము గలిగిన నతనికడ దాము నిలిచెదరు జను లెపుడున్

స్తోత్రములను సలిపెద రతడె తమకు జుట్ట మగునని పలుకుచు మహ

చ్చిత్రమగువిధి కలిమి తొలగిన యెడ జేరుటకు నయిన దలపరికన్

నేత్రముల నయిన నతని గన రవుర! నిక్క మిది యనుట యుచితమగున్.

 

 

86.      మత్తమాతంగ లీలాకరము         9 రగణములు              8,16 అక్షరములు

భూమిలోనన్ ధనంబే  ముదం బందజేయించుచున్   భుక్తికిన్ యుక్తికిన్   సాధనంబై మహత్

క్షేమముల్  గల్గు నట్లున్ స్థితిన్ మార్చునం చందరున్  జెప్పగా  విందు మాడబ్బుచే  శూన్యులై 

తామిటన్  గష్టరాశిన్ రాస్థానమం   దందరే దానిచే  మానవ త్వంబునుం గూలెడిన్

నీమముల్  దప్పుచుండున్ నిజం బిందు సందేహముల్ నిల్ప నేలా శుభాకాంక్షులౌ వారికిన్.  

87.      అహోకపుష్పమంజరి    రజ రజ రజ రజ ర    10,19 అక్షరములు

మానవుల్ మదంబు దాల్చుచున్ హాత్యహంకృతిన్ ధరించి మానసంబునన్ ధరాతలిన్

జ్ఞానులయ్యు మత్సరించుచున్ మస్తధర్మముల్ త్యజింత్రు సంపదల్ ఘటించగా నికన్

దానమన్న శబ్దమైన చిత్తమందు నుంచకుందు రౌర! తాము కొంద రెమ్మెయిన్ గటా!

కానమే ధనప్రభావమున్ గ్రమంబులేక జీవనంబు కందజేయునట్టి తత్వమున్.

88.      ప్రచితకము   2 నగణములు+7 యగణములు  10,19 అక్షరములు

నమదమున స్వకీయున్ దీయున్ సమస్తంబు నెంతో యాహీనతన్ జూచుచుంటల్

నుజకులమున నయ్యో! హిన్ గాంచుచున్నార మెప్డున్ హాకర్కశత్వంబుతోడన్

నుజగుణములు తానీ రన్ మానవానీకమందున్ ద్వరన్ బూని కల్పించుచుండున్

నగుణు లయినవారీ క్రమంబున్ గ్రహించంగ మేలౌ దా  నిత్యకల్యాణకాంక్షన్.

89.      చండవృష్టిప్రపాతము  2 నగణములు + 7 రగణములు (నగణ యుగళమత్రచేత్ సప్తరేఫా)  10,16 అక్షరములు

నుల నిలను ధర్మమున్ గాంచగా నెంచకే ర్వమున్ దాల్చుచున్ సద్ధితం బింతయున్

వినుట కయిన చిత్తమున్ బ్రీతితో జూపరీ విశ్వమం దీ ధనం బక్కటా! యిట్టులీ

నుజుల కిట క్రూరులై మానవత్వంబుతో మంచిగా నుండ యోచించకే నిత్యమున్

నుటకు కతమయ్యె హా!  మాన్యు లిద్దాని సంబంధమున్ దెల్వగా సంతసం బందెడిన్. 

90. మాలాచిత్రము     మత తత నన యయ య    11వ అక్షరము

రా! యీ విత్తంబు యోచించగా న్నిట నవసరమయి యున్నన్ మహత్వంబు గూర్చన్

తోరంబౌ సౌఖ్యంబు కల్పించి సంతోషముల నొసగగల దైనన్ మరెన్నో యఘాలన్

గారుణ్యం బింతేని లేకుండగా కాంక్షితమతి యగుచును జేయించుచుండున్ వివేకుల్

సారాత్ముల్ సాధింతు రత్యంత సత్ సౌఖ్య మెపుడు ధనమునకున్ బానిసల్ గాక యుండన్.