Tuesday 1 October 2024

గాంధీజీ

 గాంధీజీ,శాస్త్రీజీ

సీ.

స్వాతంత్ర్యసాధనా సమరయజ్ఞమ్మున  

తనసంపదను వీడు త్యాగి యతడు 

సత్యాగ్రహమ్ముతో సర్వప్రపంచాన

ధర్మదీక్షను దెల్పు ధన్యుడతడు 

శాంత్యహింసలె యుద్ధ శస్త్రాస్త్రములటంచు 

సడలకుండిన గొప్ప శక్తి యతడు

తనదేశమాతృకాదాస్యశృంఖలలను 

త్రుంచుదాకను విశ్రమించ డతడు 

ధరవారలందరు తనవారలనియెడి 

తన్మయత్వమ్ముతో తనిసె నతడు

ధరణిని గావంగ చెరసాలయైనను 

స్వీకరించిన మహచ్ఛ్రేష్ఠు డతడు

సత్యమార్గమె నిత్య జయసాధకంబని 

చూపించియుండిన శూరుడతడు

దేశసేవను మించు దివ్యకార్యము లేదు 

ప్రజలార! రండన్న సుజనుడతడు

తే.గీ.

జాతిపితయౌచు జనులకు సౌఖ్యవితతు

లొనరజేసినవాడు సర్వోన్నతుండు 

గాంధి మహనీయు డాతండు ఘనగుణుండు 

ఆమహాత్మున కీవేళ నంజలింతు.

No comments:

Post a Comment