అందరికి “శ్రీ శుభకృత్” నామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు
సీ.
శ్రీకరంబై ఖ్యాతి కాకరం బౌచును
"శుభకృత్తు"
నామంపు శోభతోడ
నూతనాబ్దము వచ్చె జాతికి హర్షంబు
పంచగా నిత్యమ్ము బహుళ గతుల
విశ్వంబునం జేరి
విస్తృత కష్టంబు
కలిగించి ప్రాణముల్ నలుపుచున్న
ఆ "కరోనా"కిటన్ తాకంగ వలె నాశ
నంబిప్డు వేగాన నవ్య గతిని
సస్యాను కూలమౌ సద్వృష్టి లోకాన
నందంగవలె సౌఖ్య మిందు గలుగ
ధర్మంబు, న్యాయంబు దైవంబు కరుణించు
విధమున నిచ్చోట వెలుగ వలయు
ఈ "నవోదయమందు" నింపారు సద్విద్య
లందగా వలె ఛాత్రు లందరకును
విజయాల మయమౌచు విద్యార్థి జీవనం
బతుల హర్షముతోడ నలర వలయు
మిత్రులందరు నిందు మేలైన స్వాస్థ్యంబు
వాంఛిత ఫలములు బడయ వలయు
ఆ.వె.
సంతసంబు గూడి జనులకందరకును
హాయి గలుగవలయు ననవరతము
శుభకృ దబ్ద మందు సుందరం బగు భావ
దీప్తి గూడ వలయు స్థిరతరముగ.
No comments:
Post a Comment