ఔను, నాకు దేవుడు
కనబడ్డాడు.
ఉత్పలమాలిక
దేవుని గంటి నేనిచట దీనజనంబుల సేవ చేయుటే
పావనమైన కార్యమని ప్రత్యహమున్ మదిలోన నిష్ఠతో
భావన చేయుచున్ నిలుచు వారలలోన,
నిరంతరమ్ముగా
జీవన మీ ధరాస్థలిని చిన్మయరూపుడు దేవదేవు డిం
దేవిధినైన సంఘమున నింపెసలార పరోపకార మో
జీవుడ! చేయుమా యనుచు చెప్పి సృజించెను నన్ను నాదు నా
నావిధ సంపదల్ జనగణంబుల నార్తులలోన బంచెదన్
ధీవిభవంబు మీర నని దెల్పి చరించెడి వారియందునన్
దైవము నిందు జూచితిని, తన్మయులై ప్రజ కెల్లరీతులన్
శ్రీవిభవంబు జూపుచును, శీలము శోభిలునట్టి పద్ధతుల్
జీవితమందు దీప్తులను జేర్చుకొనందగు సత్పథంబు, స
ద్భావము లెప్డు నేర్పగల వారయి దీపిలు తల్లిదండ్రులం
దావర దాయకున్ బ్రభు ననంతసుఖప్రదు జూచినాడ నౌ
నోవిమలాత్ములార! నిజ
ముర్విని సందియ మించుకేనియున్
రావల దిందు నమ్మవలె రమ్యపదంబులతోడ యిచ్చటన్
చేవను జూపు విజ్ఞ కవిశేఖరులార! ముదంబు
నాకగున్.
No comments:
Post a Comment