మనభారతం
ఉ. ఎచ్చటి
కేగెనో తెలియ వీభరతావని శాంతి సౌఖ్యముల్,
ముచ్చట గొల్పు
ధర్మములు, మున్నిట నుండిన భ్రాతృభావముల్,
సచ్చరితల్,
విధేయతలు, సాంఘికసేవలు, సత్యవాక్యముల్
నిచ్చలు సద్ధితైషులకు
నిష్ఠను గూర్చెడి యాదరంబులున్. ౧.
సీ. ఎదుటి
వారికి కొంత ముదమార సహకార
మందజేసెడి
భావ మసలు లేదు,
స్వార్థంబు
విడనాడి సర్వత్ర జగతిలో
కల్యాణ మొనరించు
కాంక్ష లేదు,
మృదువుగా
మాట్లాడి సదమల హృదయాన
తన్మయత్వము
నిల్పు ధ్యాస లేదు,
వృద్ధులై
సద్ధర్మ బద్ధులై వెలుగొందు
శిష్టులన్
సేవించు దృష్టి లేదు,
ఆ.వె. సమత, మమత
మరియు సచ్ఛీలసంపద
మృగ్యమయ్యె
నేడు, యోగ్యమైన
గుణము కానరాదు
కోపతాపంబులే
పెరిగిపోయె
నౌర! నిరత మిచట. ౨.
సీ. అవినీతి
భూతంబు జవసత్త్వములతోడ
అలముకొన్నదిజూడు
డవనిలోన
ధరలు నింగికి
దాక నరుల కీసమయాన
బ్రతుకు భారం
బయ్యె భారతాన
మున్నెన్నడున్
లేని పన్నుల వ్రేటుతో
నిడుములు
వ్యాపించె నీయుగాన
మతముల పేరుతో
నతకరించుటచేత
భిన్నత్వ
మిట నిండె విస్తృతాన
తే.గీ. కర్మభూమియు,
వేదోక్త ధర్మభూమి,
పుణ్యముల చోటు, సర్వథా గణ్య మికను
పావనస్థలి
యైనట్టి భరతభువిని
చేవ గోల్పోయె
మానవ జీవనంబు. ౩.
కం. వరకట్నాదుల
తాకిడి
నిరతంబును
హెచ్చుచుండె నిఖిల జగానన్
భరతావని నెవ్వారలు
పరిరక్షణ
చేయగల్గు భవ్యాత్ము లికన్. ౪.
శా. సత్యం బెల్లెడ
జూచినన్ జనులలో సంస్కారభావంబు తా
నత్యంతంబును
సన్నగిల్లెను కటా! హానిం బ్రసాదించు దు
ష్కృత్యంబుల్
మితిమీరి పోయినవి, సంఘీభావ మీనేలపై
నిత్యం బయ్యెను
దుర్మతి న్నిలుపగా నేరంబు లేపారెగా. ౫.
మ. హరి యేరూపము
దాల్చి రావలయునో హర్షంబు చేకూర్చి యి
ద్ధరణిం గావగ,
వచ్చు నెన్నడొ గదా! ధర్మంబు నిల్పంగ, నా
కరుణాసింధుని,
భక్తరక్షకు, బ్రభున్, కైవల్యసంధాయకున్
స్థిరసద్బుద్ధి
యొసంగి సంతతము రక్షింపంగ బ్రార్థించెదన్. ౬.
No comments:
Post a Comment