
బాల్యం
- అమూల్యం
మానవ
జీవనంబున సమానత నేర్పుస్థలంబు నిత్యస
న్మానము
గూర్చుచున్ సతము మైమరపించుచునుండు చోటు ది
వ్యానుభవంబు
లందగల భాగ్యము పంచెడి దిక్కికన్ బసం
దైన
విధంబుగా నడిపి హర్షము నింపును బాల్యమేవిధిన్.
చీకు
చింత లుండ వేకాకి యనియెడు
బాధ
కలుగబోదు వ్యాధు లన్న
భయము
చేరరాదు జయ మొక్కటేతప్ప
సంతసంబు
గూడు నెంతయేని.
నీనాభేదము
లెరుగరు
కానిమ్మని
పిలువ జేరి కడు హర్షముతో
నానా
రకముల క్రీడల
కేనిమిషంబైన
నిలుతు రీబాలు రిలన్.
ఎక్కి
దూకు క్రీడ యీచిత్రమందున
గానవచ్చుచుండె
గాంచనగును
మిత్రులంద
రెట్లు మేలంచు చేరిరా
చోట
మేటి దాటు నాటయౌట.
భగవానుడు
నా కెదురుగ
నగపడి
వరమడుగుడన్న నతి హర్షమునన్
నిగమనుతా!
బాల్యంబును
తగునిదె
నాకిచ్చుటందు దండంబులతోన్.
No comments:
Post a Comment