జనవరి 01, 2017 8:16 AM
చేతము లుల్లసిల్లునటు చేయగబూనుము సంఘసేవ నీ
వీతరుణంబునన్ గురుతరేచ్ఛను జూపుచు నందుకోసమై
యాతత శక్తిగోరుమిల నాభగవానుని దేవదేవునిన్
నూతన వత్సరమ్మని వినోద విహారములేల మిత్రమా! 1.
చేతంబున శుభకామన
లాతత సౌహార్దభావ మందించంగా
సీతాపతి నర్థించక
నూతన వత్సరమనుచు వినోదములేలా? 2.

స్వాయత్తంబగు సజ్జయంబు మనకున్ సత్యంబు సంహారమే
న్యాయం బంచు దలంచి క్రీడి యపుడా యస్త్రప్రయోగంబు తా
జేయం కర్ణుడు చచ్చుటన్ విజయలక్ష్మిన్ బొందె, రారాజనిన్
సాయంబించుకయేని లేక కుమిలెన్ సర్వప్రయత్నంబునన్ 3.

జయములు సర్వకార్యముల చక్కగ నందుచు,శత్రువర్గమున్
క్షయ మొనరించు శౌర్యమును, సర్వ జనావన శక్తి గల్గియున్
వయసున బెద్దయౌ నతడు పండితులం గని నమ్ర దేహుడై
భయపడినంత వీరుడని పల్కుచు మెచ్చిరి లోకు లెల్లరున్. 4

విజయ దీప్తియు, సర్వత్ర విస్తరించు
యశము, శౌర్యంబులును గల్గి, నిశలు బవలు
సాధు జనులకు,గురులకు సతుల కవని
భయపడఁగ వీరుఁడని జనుల్ ప్రస్తుతింత్రు. 5.
కాయలవి గాచు సర్వత్ర ఘనతరముగ
కుసుమమందున, కుసుమముల్ ప్రసవ మగును
పండి యాకాయ క్రమముగ నెండి రాల
బీజ మవనిని మొక్కయై పెరిగెనేని. 6.
కుసుమమందున, కుసుమముల్ ప్రసవ మగును
పండి యాకాయ క్రమముగ నెండి రాల
బీజ మవనిని మొక్కయై పెరిగెనేని. 6.
మందుడు పరుగిడ డని నీ
నందనునిం దలచుచుండి నానా గతులన్
సుందరి! ధేనువ! జూడుము
కుం దేటికి గొమ్ము మొలిచి కులుచు నడిచెన్. 7.
(కుందు+ఏటికి)

రమ్మీరోజున రచ్చబండకడ కోరమ్యాత్మ! సన్మిత్రమా!
నెమ్మిం గాంచగ మాంత్రికున్ ఘనుడురా, నిన్నన్ భళా! వాడటన్
సమ్మోదం బొదవంగ దండము పయిన్ సారించగా నప్పుడే
కొమ్ముల్ మొల్చియు గుల్కుచున్ నడచెరా కుందేలు నల్దిక్కులన్. 8.

శ్రీలాలిత్యము, సర్వసౌఖ్యములికన్ క్షేమంబు లీనేలపై
మేలైనట్టి సుదీర్ఘ జీవనగతుల్ మిన్నంటు ప్రాశస్త్యముల్
చాలం గావలె నాకటన్న ఫణితిన్ స్వార్ధంబుతోనిండు వాం
ఛాలిన్ వీడిన పూరుషుం డెపుడు బ్రహ్మానందముం బొందురా. 9.

ఆలుగడ్డ కూర, యాల్గడ్డ భక్ష్యంబు
లాలుగడ్డ పులుసు లాలు సేయ
కలికి! చూడు మంచు పలికె నాథుం డిట్టు
లాలు లేని మగడు హాయి నందు. 10.
లాలుగడ్డ పులుసు లాలు సేయ
కలికి! చూడు మంచు పలికె నాథుం డిట్టు
లాలు లేని మగడు హాయి నందు. 10.
పలుకులలో మకరందము
జిలుకుచు నొయ్యార మొలుక జేతను సవరా
ల్వెలుగగ బట్టగ నా కలు
కు లటం గని పిలిచి సీత కురు లల్ల మనెన్. 11.
(కలికి+లు=కలుకులు)

నిరతం బద్భుతశబ్దజాల మహిమన్ నిష్ఠాగరిష్ఠాత్ములై
సరసంబై ప్రజ నెల్లసద్గతులకై సమ్యక్ప్రయత్నం బిలన్
కరముం జేయగ బల్కు కావ్యరచనం గావించు విద్వాంస శే
ఖర పాదమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతన్. 12

సురుచిర శబ్దంబులతో
నిరతానందంబు గూర్చు నిర్మలకృతులన్
విరచించెడి సత్కవి శే
ఖర పదముల సేవ యొసగు గళ్యాణమ్ముల్. 13
కలి యుగంబిది వింతలు కలిగె ననుట
సహజమే గద యిందేల సందియంబు
దోమ కుత్తుక దూరెను సామజంబు
బీర తీగకు గాచెను బెండకాయ. 14
నేర మించుక కాదు మిత్రమ! నీ వసత్యము బల్కినన్
కారణం బిది కాల ధర్మము గాన రమ్మిదె యిచ్చటన్
కూరగాయల తోటలోపల గున్న మామిడి చెట్టునన్
బీరతీగకు గాచె మెండుగ బెండకాయలు చూడుమా. 15.

భక్తి యుతులౌచు హిందువుల్ పరమశివున
కవని నభిషేకములు సేతు రహము నిశయు
తన్మయత్వాన నీనాడు చిన్మయునకు
క్రైస్తవుల పండుగయె శివరాత్రి యనగ? 16
వాస్తవ మైన దియ్యదియ భాగ్యము గోరుచు నెల్లహిందువుల్
మా స్తుతులంది నీవిపు డుమాపతి శంకర! మమ్ము గావవే
యస్తు శుభంబు మీకనవె యంచును బ్రార్థన జేతు, రెక్క డే
క్రైస్తవు లెల్ల భక్తి శివరాత్రికి జేతురు శంభుపూజలన్? 17.

ముక్తి యొసంగు వాడగుచు మోదము గూర్చగ నీ భవాబ్ధి కా
సక్తుల మిత్రుడై మనుచు సన్నుతి సేయగ పుత్రుడై మహ
ద్భక్తిని సేవ చేసెడి కృపామయు నిట్లు వచింపగా దగున్
భక్తుని దైవమే కొలుచువాడయి పొందె వరమ్ములెన్నియో. 18.

భక్త వశంకరు డగుటను
సూక్తులతో సన్నుతించు సుజనాగ్రణియౌ
ముక్తా మణి నిభుడగు స
ద్భక్తుని దైవమ్మె గొలిచి వరముల నందెన్. 19
పోలవరంబునం జదువ బోయెడి యాశ్రమవాసు లెల్లరన్
మూలన నక్కి కాళ్ళనట మోదుచు మ్రింగగ దూకబోవుచున్
వాలము నూపు బెబ్బులిని వాడదె శీఘ్రము రక్ష సేయగా
బాలుర సంహరించి శిశుపాలుడు కీర్తి గడించె బుణ్యుడై. 20.
(శిశుపాలుడు = శిశురక్షకుడు)

సతము భర్తను సేవించి సంఘమందు
మాన్య యయ్యె బతివ్రత, మగని రోసి
యన్య యొక్కతె జీవితమందు మిగుల
కష్టములు గాంచె సతత మేకాకి యగుచు. 21
మిగులం గాంచిన దొక్క సుందరి కటా! మీనాక్షి కష్టంబులన్
మగనిన్ రోసి, పతివ్రతామణి కడున్ మాన్యత్వముం బొందెరా
తగురీతిన్ దన ప్రాణనాథుని యెడన్ తల్లగ్నచేతంబుతో
నిగమోక్తంబుగ సేవజేసి భువిలో నిష్ఠన్ బ్రవర్తించుచున్. 22

సుదతీ! విను తన్వంగీ!
హృదయేశ్వరి! చారుశీల! హే కల్యాణీ!
ముదమారగ నా తమ్ముని
వదినా! నీకంద జేతు స్వర్గసుఖమ్ముల్. 23
సుదతీ! రాగదె చారుశీల! వినవే! సూక్తిం బ్రసాదించవే
మదిలో నాగ్రహ మేలనే! తెలుపవే మచ్చిత్త సంచారిణీ!
యిదిగో తమ్ముని నూరికిం బనుతునే యీవేళ నివ్వానికిన్
వదినా! కౌగిట జేర్చుకొందు నిను నే స్వర్గంబు జూపించెదన్. 24

దశరథుండు నాడు ధరణీతలంబందు
ముగురు స్త్రీల మగఁడు, మొదటి యోగి
భక్తు డతని సుతుడు, పరికింప నవ్వాని
వినుతి చేయు యోగి వీర్యజుండు. 25
ముగురు స్త్రీల మగఁడు, మొదటి యోగి
భక్తు డతని సుతుడు, పరికింప నవ్వాని
వినుతి చేయు యోగి వీర్యజుండు. 25
నెగ్గినవాడు యుద్ధముల నిర్జరకోటికి సాయముండి యా
ముగ్గురు సుందరీమణుల ముద్దుల భర్తయె, యాదియోగియౌ
నగ్గిరిజాధవుం గొలుచునట్టి రఘూత్తము తండ్రి యాతడే
దిగ్గజ మట్టు లీధరను ధీరత దాల్చినవాడు చూడగన్. 26.

పాపారాయుడు మందుడు
భూపతి కర్థంబు వ్రాసె పుత్రుండనుచున్
శ్రీపతికి చెప్పె నిట్టుల
ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే. 27
శ్రీపతి చెప్పరా యనుచు జేరి గురుం డొకచేత బెత్తమున్
చూపగ కాతరుం డగుచు శూన్యుడు జ్ఞానవిహీను డౌటనా
పాపడి కేమితోచకను బల్కె జవాబుల నొక్కసారిగా
ద్రౌపది సీతయిద్ద రొక తండ్రికి బుట్టిన బిడ్డలే కదా. 28

పాపాయిల బడిలో గల
దీపకు జనకుండు తాను దీక్షితు లటులే
రూపకు గోపాలుం డిక
ద్రౌపదిసీతయునునొక్కతండ్రికిసుతలే. 29
బాపుల పాటి ఛాత్రలగు వారల సూచిక చెప్పిరీ గతిన్
దీపకు తండ్రి దీక్షితులు, దివ్యకు తిమ్మన, రుద్రనాము డా
రూపకు, రోహిణీరమకు రోశయ యాపయి నెంచి చూచినన్
ద్రౌపది సీత యిద్ద రొక తండ్రికి బుట్టిన బిడ్డలే కదా. 30

శ్రీవైభవ విలసితుడగు
భూవరుడౌ పంక్తిరథుని పుణ్యఫలానన్,
జీవముగొని సద్గతినిడ
రావణునకుఁ, బుత్రుఁ డయ్యె రాముఁ డయోధ్యన్ 31

దేవత లందరున్ విధము దెల్పుచు ప్రార్థన జేసి యుండగా
భూవరు డైన పంక్తిరథు పుణ్యము పండగ లోక రక్షకై
జీవనమున్ హరించి కడు శ్రేష్ఠ పదంబిడ నన్న దమ్ములౌ
రావణ కుంభకర్ణులకు, రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై. 32

శీలవతు లౌచు వ్రతముల
మేలౌ పతిసేవ యంచు మేదినిలో నే
కాలము చరియించెడి యా
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును శ్రేయముఁ గల్గున్. 33
మేలగు నోము లన్నిటను మేదిని లోపల భర్తృ సేవయే
కాలము మారనేమి యని గట్టిగ నమ్ముచు నాత్మ నాథునిన్
శీలమె భాగ్యమై వెలుగ జేరుచునుండు గుణాఢ్యలైన యా
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్. 34

కూలీలు నమ్రు లౌచును
వాలిన మర్యాదతోడ భాగ్య విధాతల్
మేలొన రించరె యని మే
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును శ్రేయముఁ గల్గున్. 35

పరమత సహనము జూపుచు
సరసుండై జీవనంబు సాగించెడి యా
కరినగర వాసి నాతని
నరయగ రాముని కుమారు లల్లా క్రీస్తుల్. 36
సరసుండై జీవనంబు సాగించెడి యా
కరినగర వాసి నాతని
నరయగ రాముని కుమారు లల్లా క్రీస్తుల్. 36
కల్లల్ బల్కడు, స్వార్థ హీనుడు కనన్ కాపట్యమే లేని కో
కొల్లల్ సద్గుణ రాశులంది సమతన్ కూర్మిన్ సదా దాల్చి తా
నుల్లాసప్రియుడై వెలుంగు ఘను డా యూరన్ శుభాకాంక్షి వా
రల్లా క్రీస్తులు రామచంద్రు సుతులే యాశ్చర్య మే మిందులో. 37

ఎల్లైశ్వర్యము లిచ్చువాడు జగమం దీశుండు సర్వాత్ముడై
ముల్లోకంబుల కాత్మసంతతి కటుల్ మోదంబు చేకూర్చగా
నుల్లంబందు సమత్వదృష్టి కలవా డుద్ధారకుం డౌట నా
యల్లా క్రీస్తులు రామచంద్రు సుతులే యాశ్చర్య మే మిందులో. 38

న్యాయము నెంచబోడు కరుణాది గుణంబుల దాల్చబోవ డ
త్యాయత మైన స్వార్థమున హాయి దలంచుచునుండు బాంధవా
ప్యాయత లైన జూడడు సుఖార్థియు నాయకు డింక సద్యశ
శ్శ్రీయన కోప మాతనికి శ్రీని గడించెను కోట్లు కోట్లుగన్. 39.

హరిహరులు బ్రహ్మ లక్ష్మియు
గిరిజావాణులును గూడి క్షేమంకరులై
వరమీయగ దంపతులకు
నరయగ నబ్బాయి పుట్టె నార్గురి దయతోన్. 40.

చెవిటి వాడైన రామయ్య చెంత చేరి
సైగ జేయుచు నవ్వుచు మూగకు వలె
కుశలమేగద? యీరోజు కుడిచి నావె
గాడిదా ! యన నౌనని వాడు మురిసె. 41
సైగ జేయుచు నవ్వుచు మూగకు వలె
కుశలమేగద? యీరోజు కుడిచి నావె
గాడిదా ! యన నౌనని వాడు మురిసె. 41
రాము డనియెడి మిత్రుని రాజు చూచి
సోదరా! యీకలము బహు సుందరముర!
ఎవరి దియ్యది? నీయన్న ఈశ్వరయ్య
గాడిదా? యన నౌనని వాడు మురిసె. 42
సోదరా! యీకలము బహు సుందరముర!
ఎవరి దియ్యది? నీయన్న ఈశ్వరయ్య
గాడిదా? యన నౌనని వాడు మురిసె. 42
ధీమతులైన నెచ్చెలులు దీప్తియుతుల్ తమకానుకూల్యురౌ
శ్రీమతు లిద్దరున్ జెలిమి చేయుచు నుండగ, యుక్తియుక్తమౌ
మేమిక బంధులైన నని మిక్కిలి యోచన చేసి యంతటన్
రాముడు వియ్యమందె రఘురామునితో రవిచంద్ర సాక్షిగా. 43
మార్చి 07, 2017 5:18 AM
కట్టె - నిప్పు - బూది - మసి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
పచ్చని ప్రకృతిని వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
మార్చి 07, 2017 5:18 AM
కట్టె - నిప్పు - బూది - మసి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
పచ్చని ప్రకృతిని వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
వరుస కట్టెను భ్రమరాళి యరుస మొదవ
విరుల నిప్పుడు మధుపాన తరుణ మనుచు
వేణుకం బూది గొల్లండు పిలువ బసుల
సాగె పికగీతి తాపంబు సమసి పోయె. 44.
విరుల నిప్పుడు మధుపాన తరుణ మనుచు
వేణుకం బూది గొల్లండు పిలువ బసుల
సాగె పికగీతి తాపంబు సమసి పోయె. 44.
వర మొసంగిన దానవ వత్సలుడయి
తత్ప్రభావంబు మొదటగా తనకె చూప
వచ్చుచున్నట్టి దైత్యు నవ్వాని ధర్మ
హరునిఁ జూచి వేగమ్మున హరుఁడు పారె. 45.
తత్ప్రభావంబు మొదటగా తనకె చూప
వచ్చుచున్నట్టి దైత్యు నవ్వాని ధర్మ
హరునిఁ జూచి వేగమ్మున హరుఁడు పారె. 45.
వరమడుగంగ వల్లెయని వాని కొసంగెను హస్త మెచ్చటేన్
శిరమున నుంచ భస్మమగు సిద్ధ మటంచును, దాని నంది నే
డరయుదు దీని సత్త్వ మిపు డాగుము నీవను దైత్యు సంస్కృతీ
హరుని కనంగనే కడు భయార్తిని బారె హరుండు వేగమే. 46.
పేరెన్నిక గన్నట్టిది
భారత యశ మడచు సుమ్ము భావి తరములన్
మీరినచో మర్యాదను
మారినచో నీతిలేక మదమత్తులుగాన్. 47.
ధారుణి నన్నికోణముల ధర్మయుతిన్ వెలుగొంది యున్నవీ
భారత కీర్తిచంద్రికలు భావితరాలకు జేటు గూర్చురా
మీరుచు హద్దులన్ సుఖమె మెక్కుచు స్వార్థముతోడ మత్తులై
దూరిన తత్పథంబు బహు దుఃఖము లందరె కుందరే కనన్. 48.
14.03.2017
అండగ నిల్చి భక్తులకు హర్షము గూర్తువు, కోరినంతనే
మెండుగ సద్వరంబు లిడి మేదిని నందరి రక్షకుండవై
యుండుచు బల్కుచుందువని యుత్తము లందురు, లోకనాథ నా
ముండవు గావునన్ సుమసమూహము దెచ్చితి నీకు గాన్కగన్ 49.

రామాపురమున బలికెను
కామేశుడు బొంకులాడు క్రమమున స్పర్ధన్
ధీమతులారా వినుడని
భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్. 50.
నాములపాడులో నొకదినాన నసత్యము బల్కు వారికై
ధీమతు లొక్కస్పర్ధ నట దెల్పగ బొంకుల నాడువారిలో
కాముడు హర్షపూర్ణుడయి గమ్మున నిట్లనె సత్య మయ్యరో
భామయు, భామయున్ గలియ బాలుఁడు పుట్టెను సత్యభామకున్. 51.

తికమక యిందేమున్నది
సుకరంబిది ఇద్ద రిచట సోదరు లొక నా
టక మాడెడు వేళ న్నా
శుకయోగికి నల్లుడయ్యె జుమి భీష్ముండే. 52
సుకరంబిది ఇద్ద రిచట సోదరు లొక నా
టక మాడెడు వేళ న్నా
శుకయోగికి నల్లుడయ్యె జుమి భీష్ముండే. 52
ఒకనా డన్నవరంబు నందు గనగా నుత్సాహ పూర్ణాత్ములై
సకల ప్రేక్షకమోదకారు లగుచున్ సన్మిత్రు లవ్వారు నా
టకమున్ వేయుచు పాత్ర లందిరి వినుం డవ్వారిలో వృద్ధు డౌ
శుకయోగీంద్రున కల్లు డయ్యె గద భీష్ముం డంద ఱుప్పొంగగన్. 53

ప్రేమంబున విహరించగ
భామా సహితుండు రాజు వనమున కేగన్
సోముని రాహువు మ్రింగగ
కౌముది లేనట్టి రాత్రిఁ గనెఁ బున్నమికిన్. 54.
భామకు బ్రేమపూరితకు వాస్తవహర్షము బంచు కాంక్షతో
నామెను వెంట బెట్టుకొని యచ్చటి రమ్యవనంబు చేరగా
రాముడు చంద్రబింబమును రాహువు మ్రింగిన వేళ గావునన్
గౌముది లేని రాతిరినిఁ గాంచెను పున్నమినాడు వింతగా. 55.

వమ్మొనరించుచు యాగము
లిమ్మహి దిరుగాడునట్టి యింద్రారి సమూ
హమ్ముల దామస సంజా
తమ్ములపై రాముడు పగ దాల్చె గుపితుడై. 56
ఎమ్మెయి యాగకర్మముల నెచ్చట జూచిన దుర్మదాంధులై
వమ్మొనరించి కర్తల కవాంఛిత త్రాసము గూర్చు దైత్య యూ
ధమ్ముల మీద శీఘ్రముగ ధర్మము గావగ తామసాత్త జా
తమ్ములమీఁద మత్సరముఁ దాల్చె సధర్ముఁడు రాముఁ డుద్ధతిన్. 57.

ఆర్యా!
నమస్కారములు,
చంపకమాలలో 4వ అక్షరం దీర్ఘము, 5వ అక్షరం హ్రస్వము ఉంచుట కుదరదు కనుక దీనిని
మొదటి పాదం 5వ అక్షరం 'రా'
రెండవ పాదం 4వ అక్షరం 'మ'
మూడవ పాదం 14వ అక్షరం 'చం'
నాల్గవ పాదం 18వ అక్షరం 'ద్ర'
అను విధముగా సవరించి పూరించుట జరిగినది. గమనించ ప్రార్థన.
నిలువుము రావణా! తులువ! నిన్నిపు డంపెద స్వర్గసీమకున్
నిలువు మటన్న రావణుడు నీకిది సాధ్యమె రాక్షసేంద్రునిన్
దెలియవె నేడు నాకు కసిదీరును చంపెదనన్న రాముడా
పలుకుల కుండు మంచు శరవర్షము బంపెను రౌద్రమూర్తియై.

నిలువుము రావణా! తులువ! నిన్నిపు డంపెద స్వర్గమన్న నా
పిలుపున రామ దూషణము బిట్టుగ జేయుచు రాక్షసేంద్రునిన్
దెలియవె నేడు నాకు కసిదీరును చంపెదనన్న రాముడా
పలుకుల కుండు మంచు శరవర్షము బంపెను రౌద్రమూర్తియై.
పిలుపున రామ దూషణము బిట్టుగ జేయుచు రాక్షసేంద్రునిన్
దెలియవె నేడు నాకు కసిదీరును చంపెదనన్న రాముడా
పలుకుల కుండు మంచు శరవర్షము బంపెను రౌద్రమూర్తియై.
గణుతికి నెక్కి దేశమున ఖ్యాతిని గూర్చెడి పాలనంబుతో
ప్రణతుల నందుకొం డనుచు వారల నెంపిక చేసి పంప నా
మణిమయ సత్సభాస్థలము మాత్రము తిట్టుల చోటు చూచినన్
రణము రణ మ్మహో రణము ప్రాంగణమెల్ల రణాంగణమ్మగున్.

అవురా కలియుగ మందున
నవిరళ మగు స్వార్థబుద్ధి యత్యాశలతో
భువిలో దిరుగుచు జనముల
చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్.
అవురా యేస్థితి గల్గెనో జగతిలో నత్యంతమౌ స్వార్థమున్
వివిధంబైన నవీన పద్ధతులలో విత్తార్జనం బేయెడన్
భవసార్థక్యద మన్న భావనముతో పల్మారు సంఘంబునం
జెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసౌశీల్యుండు ముమ్మాటికిన్.

అతివ కల్యాణి సద్భక్తి ననవరతము
చేయు పూజల నందువా రాయుగాది
పురుషు లిద్దఱు, గలియఁగఁ బుట్టె సుతుఁడు
వారి కృపచేత నాయమ చేరి మగని.
నిరతము మ్రొక్క సాధ్వి కడు నిష్ఠను, మెచ్చెను దేవదేవు డా
పురుషుడు, పూరుషుం గలియఁ బుత్రుఁడు పుట్టె, నదేమి చోద్యమో
సురుచిర రూపధారి యగు సుందరు డప్పుడె యౌవనంబుతో
నరయుచు నున్నవారి కతి హర్షము గూర్చెను నాడు వింటిరే.

రంగడు తనసతి నడిగెను
కంగారుగ నామె చెప్పె కను డాప్రశ్నన్
సంగీత యుత్తరంబును
గాంగేయుం డన్న నెవడు? గంగా పతియే.
రంగారావు నెరుంగగోరి యడిగెన్ రాజీవ పత్రాక్షియౌ
సంగీతాసఖి వాడు పల్కెనపుడున్ సర్వజ్ఞు డేనుండ గా
కంగా రేలనె నీకటంచు వినుడ క్కల్యాణితో నివ్విధిన్
గాంగేయుం డెవడన్న నాకెరుక గంగావల్లభుండే సుమీ

వందనములు కొనలే డిల
కందము వ్రాయంగలేని కవి, పూజ్యు డగున్
సుందరముగ నలవోకగ
వందలు వేలైన సభను పలికిన యెడలన్.
వందన మందలే డిలను పండితమండలిలోన నెచ్చటన్
కందము వ్రాయలేని కవి, గణ్యత కెక్కును కీర్తినందుచున్
సుందర శబ్దభావముల శోభిలున ట్లలవోకగా సభన్
వందలు వేలు చెప్పగలవాడన సందియ మేల చూడగన్.

అన్యు లెట్లున్న నాకేమి యని దలంచి
స్వార్థ భావైక చిత్తులై సకల జనులు
సంచరించుచు నున్నట్టి సమయమందు
పరుల మేలు గోరు నతడు పతితుడు గద.
నిరతము స్వార్థ మేగతిని నిష్ఠగ బూనుచు విశ్వమంతటన్
తిరుగుచు నుండు వారలకు దేవుని నందరిలోన జూచుచున్
స్థిరమతియౌచు సంఘమున సేవలు చేయు మహచ్ఛుభేచ్ఛతో
పరుల హితంబు గోరెడి కృపామయుడే పతితుండు నా దగున్.

క్రౌర్యము జూపుచు నుండగ
నార్యుడవా నీవటంచు నా రోకలితో
మర్యాద మరచి వచ్చెడి
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్.
క్రౌర్యము జూపుచుండి బహు కాలము నుండియు మద్యపానుడై
కార్యవిహీనుడై దిరుగు కాంతుని జూచుచు దండధారియై
యార్యుడ వెట్టు లౌదువని యాగ్రహ మూనుచు వచ్చు నట్టి దౌ
భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై.

అరయన్ నాస్తికు లొక్కచోట సభలో నత్యున్నతోత్సాహులై
వరుసం జేరుచు బోధ జేసి రిటు లప్పౌరాళి కవ్వేళ నో
కరిచర్మాంబర కావుమన్న నఘముల్ కాయంబునన్ నిండు నా
నరకం బందును మానవుండు "వరదా! నారాయణా!" యన్నచో.
ఔరా నాస్తిక సభలో
వారట బోధింతు రిట్లు పరమేశ శివా
రారా యన నఘ మంటును
నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్.

ఆరాజు మూర్ఖు డిట్లను
పౌరులు! దైవంబ నేను పలుకగ వలయున్
కోరుచు నా నామంబును
నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్.
ఏరోజు నన్ను సుఖములు
చేరంగా వలయు దేవ చీకాకులతో
నూరందరున్న నేమగు
నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్.
ధరణీనాథు డొకండు మత్సరమునన్ దైవంబు తానే యనున్
వరుసం జాటును నన్ను గొల్వవలె మీ పాపంబులం గూల్తు ని
ర్జరు లింకెవ్వరు లేరు సత్య మిదియే సంకోచ మింకేలనో

తమజయంబును గోరెడి కమలనాభు
కరుణ నమరత్వమును గాంచి రరుస మొదవ
నమృత పానమ్ముచే సుర, లసురు లైరి
మంద భాగ్యులు తత్సుఖ మంద లేక.
కరుణ నమరత్వమును గాంచి రరుస మొదవ
నమృత పానమ్ముచే సుర, లసురు లైరి
మంద భాగ్యులు తత్సుఖ మంద లేక.
ధీమతు లైన నెచ్చెలులు దీప్తియుతుల్ తమకానుకూల్యురౌ
శ్రీమతు లిద్దరున్ జెలిమి చేయుచు నుండగ, యుక్తియుక్తమౌ మేమిక బంధులైన నని, మిక్కిలి యోచన చేసి, యంతటన్ రాముడు వియ్యమందె బలరామునితో రవిచంద్ర సాక్షిగా