Thursday, 9 October 2014

కుమారస్వామి-విఘ్నేశాధిపత్యము



 

శ్రీకంఠుని భక్తాదులు

ప్రాకటముగ నొక్కవాని భవ్యగుణాఢ్యున్

చేకొని విఘ్నేశ్వరుగా

మాకొసగు మనంగ భవుడు మానసమందున్. ౧.



నుడెవ్వండీపదమున

కనుగుణ సత్త్వాఢ్యు డౌచు నర్హుండగువా

డని యోచించుచు నుండగ

ననుమానములేదునేనె యధికుడననుచున్. ౨.



వరుసన్ షణ్ముఖు డాదట

కరివదనుడు స్పర్థనూని నతన్ దెలుపన్

సురుచిర శబ్దంబులతో

సరిసరి వినుడంచు బలికె శంకరు డపుడున్. ౩.



సుతులారా యిద్దరిలో

నతులిత తేజంబు గల్గి అఖిలాపగలన్

క్షితిపాతాలదివంబుల

నుతజలలగువానిలోన నుత్సాహముతోన్. ౪.



మునుముందుగ నెవ్వాడిక

నుడై స్నానంబు చేసి కననగ్రగుడై

వినయాన్వితుడై మరలునొ

యనుమానములేదు వాడె యధిపతి యనినన్. ౫.



శిఖివాహనుడై యాష

ణ్ముఖుడతి హర్షంబుతోడ ముందుగ గగనో

న్ముఖుడై యీకార్యం బతి

సుఖదం బగునంచు వెడలె సుందరఫణితిన్.  ౬.



అల్లదిగో చిత్రంబున

కల్లయొకింతయును గాదు కనుడా కొమరున్

ఫుల్లారవిందవదనుని

యుల్లంబున జయముగోరు నున్నతచరితున్. ౭.



అరుసం బబ్బెడు షణ్ముఖ!

నిరతము యశమందు గాత నీకు కుమారా!

హరుని శుభాశీర్వచనము

లురుతర సౌఖ్యంబు  కలుగు చుండెడు నెపుడున్.౮.



సేనానికి నీపనిలో

మానితముగ విజయసిద్ధి మరియందునొ, తా

స్వానుభవంబున నెరుగొనొ
ధీనిధియౌ యగ్రజాతు దీప్తిని భావిన్.  ౯.
౦౯.౧౦.౨౦౧౪

No comments:

Post a Comment