కూరలమ్మ! రండి కూర్మితో
కొనరండి
స్వాస్థ్యవర్థనంబు
సంతతంబు
చేయుచుండునట్టి
శ్రీప్రదంబులు చూడు
డక్కలార! వచ్చి
యందుకొనుడు. ౧.
కాయగూరలమ్మ! కాలయాపనయేల
క్రయము చేయ రండు
రయము మీర
తోటనుండి యిపుడె
మేటివై యున్నట్టి
వాటి నంది యిదుగొ
వచ్చినాను. ౨.
రామములగపండు రమ్యాతి
రమ్యంపు
వర్ణమూనియుండె వైభవముగ
ఒక్కదాని దిన్న
మిక్కుటంబుగజేయు
రక్తవృద్ధి నిజము
రండు రండు. ౩.
కోసు పువ్వు రూపు
చూసినంతనె మీకు
సంతసంబు గలుగు సత్యమిద్ది
చేకొనుండు రండు
శాకంబు చేసినన్
చవులుపుట్టు నమ్మ!
వివిధగతుల. ౪.
ఆకుకూర చూడు డనుపమమైనట్టి
స్వచ్ఛమైనరూపసౌష్ఠవంబు
పొందియున్న దిట్టి
సుందరశాకంబు
వదల రాదు రండు వనితలార! ౫.
దోసకాయయనగ దుర్లభంబైనట్టి
హాయి నొసగు శాక
మవనిలోన
నందుకొనుడు రండు
సందియంబందక
చౌకబేర మమ్మ జాగదేల?
౬.
మీకు సేవ జేయ శాకంబులంగూర్చి
సతత మెంతయేని శ్రమకు
నోర్చి
ఉపవనంబు జేరి యువిదలారా!
రండు
తెచ్చియుంటి జనులు
మెచ్చునట్లు. ౭.
లలితహృదయలార! లాభంబులాశించు
దానగాదు, తోటలోన
దిరిగి
సేకరించి తెత్తు
నేకాలమాత్మలో
పరుల సేవ జేయు భావమూని.
౮.
మోసమింతలేదు ముదమారగామీరు
కొనుటకిపుడె రండు
కూర్మిమీర
దివ్యమైవెలుంగు
దేశీయ శాకముల్
జాగుచేయవద్దు సాగిరండు.
౯.
No comments:
Post a Comment