జులై 17, 2016
సౌజన్యుండైన నేమి సంకట మందున్
భూజనులకు ధైర్యంబున
తేజంబును విజయమొదవు దీప్తియు గల్గున్
నైజంబిది యది కొరవడ
సౌజన్యుండైన నేమి సంకట మందున్.౧.
జులై 18, 2016
బమ్మెర పోతన్న వ్రాసె, వ్యాకరణమ్మున్
కమ్మని భాగవతమ్మును
బమ్మెర పోతన్న వ్రాసె, వ్యాకరణమ్మున్
సమ్మతమని యలనాడిట
నమ్ముని తుల్యుండు నన్నయార్యుడు వ్రాసెన్. ౨.
శత్రువు లేనివాని కిల శాంతి సుఖంబులు కల్గ నేర్చునే
మిత్రుడు సర్వకాలముల మేలొనరించగ బూనువాడు, సత్
పాత్రత గూర్చువా, డికను భాగ్యము బంచుచు నుండి దౌష్ట్యమున్
వేత్రము చూపుచున్ సతము విస్తృతరీతి నశింపజేయుటన్
శత్రువు, లేనివాని కిల శాంతి సుఖంబులు కల్గ నేర్చునే. ౩.
శత్రు రహితున కబ్బునే? శాంతి సుఖము
శత్రువును గూల్చు దీక్షలో సతత మవని
జనుల కలవడు నేకాగ్ర శక్తి యద్ది
శత్రు రహితున కబ్బునే? శాంతి సుఖము
శత్రు నాశన మందు తా జనుడు గాంచు.
జులై 20, 2016
మాతను బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్
భూతేశుడైన శంకరు
డా తన్వంగిని హిమాలయాత్మజను శివన్
చేతం బలరగ త్రిజగ
న్మాతను బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్. ౪.
జులై 21, 2016
సన్యాసికి పిల్లనిచ్చి సంబరపడియెన్.
మాన్యుం డా హిమవంతుడు
ధన్యత్వము నందగోరి, తన్మయుడయి తా
నన్యుల కందక తిరిగెడు
సన్యాసికి పిల్లనిచ్చి సంబరపడియెన్. 5.
జులై 22, 2016
వానరు, లెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చు టెన్నడో
మాననివా రకృత్యముల, మాన్యతకై పరుగెత్త్తువార లె
వ్వానికి జంకకుండగను స్వార్థమె చూచుచు నన్యమేమియున్
గాననివారు మానవులు, కర్మము లెంచనివార లాదిలో
వానరు, లెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చు టెన్నడో? 6.
జులై 23, 2016
నాపతి యేగుదెంచ గని నాపతి భీతిని నక్కె నొక్కెడన్.
చూపుచు ఖడ్గరాజమును, చోరుడ! రమ్ముర! యెక్కడుంటివో
పాపము చేసినా విపుడ వార్యము దండన, నీదుజీవమన్
దీపము నార్పుకొందువని తిట్టుచు, నిప్పులు గక్కుచున్న సే
నాపతి యేగుదెంచ గని నాపతి భీతిని నక్కె నొక్కెడన్. 7.
జులై 24, 2016
పురుషుని బెండ్లియాడె, నొక పూరుషు డందరు మెచ్చి యౌననన్
వరగుణయైన యొక్కరిత వైభవమొప్పగ నింటివారలౌ
గురుజను లాదరంబునను గూర్చిన వానిని సుందరాంగుడౌ
పురుషుని బెండ్లియాడె, నొక పూరుషు డందరు మెచ్చి యౌననన్
వరుసకు మేనమామ యట వర్ధిలు మంచు నొసంగె దీవెనల్. 8.
జులై 25, 2016
పురుషునకుం, దాళిబొట్టు భూషణము సతీ
ధరపయి చూడగ శౌర్యము
పురుషునకుం, దాళిబొట్టు భూషణము సతీ!
సురుచిరముగ నర్థాంగికి
వరగుణులై వీని దాల్చ వైభవ మబ్బున్. 9.
జులై 26, 2016
ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు
స్వార్థపరులౌచు సర్వత్ర సంచరించు
చుండి నిధులన్నియును మ్రింగుచుండువార
లన్యు లేమైన నాకేమి టని తలంచు
ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు.10.
హత్య లవినీతి కృత్యంబు లనుదినంబు
మత విరోధంబు లతివల మానహాను
లధిక మౌచుండ కిమ్మన నట్టులుండు
ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు. 11.
జులై 27, 2016
అన్నను భర్తగా గొనిన యన్నులమిన్న అదృష్టరాశియౌ
అన్నవరంబులో జనులు హర్షముతో తమ కండదండగా
నున్న పరోపకారగుణు నొక్కని నున్నతు గాంచి యాత్మలో
నెన్నుచు నుండి రిట్టులని యీతని సాధుచరిత్రు ధీరు రా
జన్నను భర్తగా గొనిన యన్నులమిన్న అదృష్టరాశియౌ.12.
మున్నొక సుందరాంగి గని మోదముతో నిటులెంచె నొక్క డీ
సన్నుతగాత్రి కేనెసరి, సచ్చరితుండను, శౌర్యయుక్తుడన్
మన్నన లందువాడ నిక మాన్యుడనై చరియించువాడ నౌ
యన్నను భర్తగా గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ.13.
మన్నన గాంచబోవు, బహుమానము లందవటంచు స్నేహితుల్
తన్నొక యజ్ఞగా దలచి తాళుమటంచును నాతడేల వ
ద్దన్నను భర్తగాగొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ
“పున్నమి” వానితో మహిని పొందెసుఖంబు లనారతంబుగన్. 14.
జులై 28, 2016
పోరువలన శాంతి బొందగలము
మోద ముడిగిపోవు,సోదరావళితోడి
పోరు వలన, శాంతి బొందగలము
కలిసి యొక్కటైన కలహంబులను మాని
సత్య మిందికేల సందియంబు. 15.
రాజుతోడ బలికె రమ్యంబుగా మంత్రి
దేవ! మనకువైరి తిరముగాను
పొరుగువాని కహితు డరయంగ వీరల
పోరువలన శాంతి బొందగలము.16
జులై 29, 2016
హారము కోసమై ప్రజ లహర్నిశమున్ కృషి చేయగా దగున్.
వారును వీరటంచు పలువాదము లాడక, సత్స్వభావులై
కోరిక మీర నందరికి కూరిమి బంచుచు ధర్మనిష్ఠ ని
ద్ధారుణి సంచరించవలె, తన్మయతన్ సమభావనాసమా
హారము కోసమై ప్రజ లహర్నిశమున్ కృషి చేయగా దగున్. 17.
జులై 30, 2016
వ్యర్థ మొనరింప దగును సంపదల బుధులు

కూరిమి కోసమై సత
మకుంఠిత దీక్షను బూనగా వలెన్
ధీరత బూని యన్నిటను
దివ్య యశంబుల నందుచుండి సం
స్కారముతోడ పేదలకు
సంపద పంచుచు స్వార్ధభావ సం
హారము కోసమై ప్రజలహర్నిశమున్
కృషిచేయగా దగున్.18.
జులై 30, 2016
వ్యర్థ మొనరింప దగును సంపదల బుధులు
నిరత సుఖముల కోసమై పరుగు లిడుట
వ్యర్థ, మొనరింప దగును సంపదల బుధులు
మెతుకు దొరకక నిత్యమీ క్షితిని దిరుగు
దీనజనముల సేవను మానకుండ. 19.
వ్యర్థ, మొనరింప దగును సంపదల బుధులు
మెతుకు దొరకక నిత్యమీ క్షితిని దిరుగు
దీనజనముల సేవను మానకుండ. 19.
సంఘవిద్రోహ
శక్తుల యత్నములను
వ్యర్థమొనరించ వలయు,
సంపదల బుధులు
మెచ్చుకొనునట్లు
ధరవారి మేలుగోరి
వ్యయము చేయంగ వలయు
నెవ్వారలైన.20.
అహముతో గర్వించి
సహవాసులను జేరి
పరుషమౌ వాక్యాలు పలుకుచుండి
సంఘవిద్రోహులై
సంచరించెడివారి
యత్నంబులను గాంచి యనుదినంబు
సన్మార్గగములైన
సజ్జనావళి యేమి
చేయుట యుక్తమీ నీక్షితిని జెపుడు?,
దారిద్ర్యబాధతో
తాళలే కున్నట్టి
వారల కేయవి పంచవలయు?
సద్వివేకంబు చూపుచు
సర్వ విషయ
సార మందించు చుండెడి
వారి నేమి
యనగ జెల్లును భువిలోన?
నందురేని
వ్యర్థమొనరింపదగును,
సంపదల, బుధులు.
No comments:
Post a Comment