ది. 30.06.2012 వ తేదీ
"శంకరాభరణం" బ్లాగులో
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి
వ్రాసిన పద్యవ్యాఖ్య
బాల్యం
(బాల్యదశ యన్న బహుమూల్యఫలము గాదె)
పాలు గారెడి బుగ్గలు, పలుకు లెపుడు
దివ్యమాధుర్య భరములై తేజరిల్లు
బ్రహ్మవాక్యంబులో యన భవ్యములయి,
బాల్యదశ యన్న బహుమూల్యఫలము గాదె. 1.
చింత యొకయింత యేనియు సిరులగూర్చి
అంటగాబోదు నిత్యంబు హర్షమొదవు
కష్ట సుఖముల యూసెందు కలుగ బోదు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 2.
కులము, మతములు, గోత్రాలు కోట్లకొలది
సంప్రదాయంబు లాచారసంతతులును
తెలియవలసిన పనిలేదు భళిర! చూడ
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 3.
కలిమిలేములు సమములై కలుగు తృప్తి
యఘము పుణ్యంబు లవియెందు నంటబోవు
దైవరూపంబు పసిబిడ్డ ధరణిలోన
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 4.
చందమామను గాంచిన క్షణమునందు
చేతులనుఁ జూపి రమ్మని జీరుచుండు
తన్మయత్వంబు నందుచు ధరణి కెపుడు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 5.
కోపమే భూషణంబయి కోరికలను
దీర్చు చుండును వాత్సల్యదీప్తు లొసగు,
రోదనంబిక బలమౌను మేదినిపయి
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 6.
తల్లిదండ్రులు, బంధువు, లెల్లవార
లరుసమును జెంది రాజశేఖరులు గూడ
సేవలందింతు రెల్లప్పు డేవలేక
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 7.
ఆటపాటలఁ దేలుచు ననవరతము
ఘనత నందుచు కాలంబు గడుపుచుండు
భాగ్యమున కర్హు లిలలోన బాలు రవుర!
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 8.
ఏడ్పు విన్నంత జననితా నెందు నున్న
శీఘ్రముగఁ జేరి ముద్దాడి చెంత నిలిచి
పాటలను బాడి యలరించి పలుకరించు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 9.
కోరినంతనె జనకుండు కూర్మితోడ
వస్తుజాలంబు నందించ వలయు ననుచు
యత్న మొనరించు బిడ్డకై యహరహమ్ము
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 10.
పాలు గారెడి బుగ్గలు, పలుకు లెపుడు
దివ్యమాధుర్య భరములై తేజరిల్లు
బ్రహ్మవాక్యంబులో యన భవ్యములయి,
బాల్యదశ యన్న బహుమూల్యఫలము గాదె. 1.
చింత యొకయింత యేనియు సిరులగూర్చి
అంటగాబోదు నిత్యంబు హర్షమొదవు
కష్ట సుఖముల యూసెందు కలుగ బోదు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 2.
కులము, మతములు, గోత్రాలు కోట్లకొలది
సంప్రదాయంబు లాచారసంతతులును
తెలియవలసిన పనిలేదు భళిర! చూడ
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 3.
కలిమిలేములు సమములై కలుగు తృప్తి
యఘము పుణ్యంబు లవియెందు నంటబోవు
దైవరూపంబు పసిబిడ్డ ధరణిలోన
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 4.
చందమామను గాంచిన క్షణమునందు
చేతులనుఁ జూపి రమ్మని జీరుచుండు
తన్మయత్వంబు నందుచు ధరణి కెపుడు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 5.
కోపమే భూషణంబయి కోరికలను
దీర్చు చుండును వాత్సల్యదీప్తు లొసగు,
రోదనంబిక బలమౌను మేదినిపయి
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 6.
తల్లిదండ్రులు, బంధువు, లెల్లవార
లరుసమును జెంది రాజశేఖరులు గూడ
సేవలందింతు రెల్లప్పు డేవలేక
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 7.
ఆటపాటలఁ దేలుచు ననవరతము
ఘనత నందుచు కాలంబు గడుపుచుండు
భాగ్యమున కర్హు లిలలోన బాలు రవుర!
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 8.
ఏడ్పు విన్నంత జననితా నెందు నున్న
శీఘ్రముగఁ జేరి ముద్దాడి చెంత నిలిచి
పాటలను బాడి యలరించి పలుకరించు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 9.
కోరినంతనె జనకుండు కూర్మితోడ
వస్తుజాలంబు నందించ వలయు ననుచు
యత్న మొనరించు బిడ్డకై యహరహమ్ము
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె. 10.
good one, chakkaga raasaarandi.
ReplyDeleteధన్యవాదాలండీ.
ReplyDelete