"శంకరాభరణం" బ్లాగులో ఇవ్వబడే దత్తపదులకు మరియు నిషిద్ధాక్షరులకు పూరణలు.
"అక్క, అన్న, వదిన, మామ" పదాలతో
"మండోదరి రావణునకు చేసే హితబోధ"ను వర్ణించటం
నచ్చిన ఛందస్సులో
కం.
అక్కట! నాశనకారణమిక్కాంతను దెచ్చుటన్న నీయమ నీకున్
దక్కదు నీవది నమ్మిన
నక్కఱపడు మామకీనమౌ వాక్యంబుల్.
***
టవర్గ (ట,ఠ,డ,ఢ,ణ) అక్షరాలను ఉపయోగించకుండా
టంగుటూరి ప్రకాశం పంతులు గురించి
నచ్చిన ఛందంలో పద్యం చెప్పటం
28.06.2012
సీ.
స్వాతంత్ర్య సిద్ధికై సర్వసంపద లన్ని
సౌఖ్యముల్ త్యజియించి సంతసమున
నిస్స్వార్థబుద్ధితో నిత్యదీక్షను బూని
స్వారాజ్య సమరమ్ము జరుపువాని,
ప్రజలక్షేమము గోరి బహుబాధలకునోర్చి
పత్రికల్ ప్రచురించు భాగ్యశాలి
నాంధ్రకేసరి యౌచు నాంగ్లేయులకు భీతి
గల్గించి నిలిచిన ఘనుని మరియు
తే.గీ.
ధీరగంభీరవిగ్రహు, దివ్యతేజు
నమల చరితుఁ బ్రకాశము నాంధ్రజనులు
విశ్వసించిన వానిని, విజ్ఞవరుని
ధన్యజీవిని స్మరియింప దగును సతము.
కరము-తరము-వరము-హరము
అనే పదాలను ఉపయోగించి
రాయబారానికి పోతున్న కృష్ణుని ముందు ద్రౌపది ఆవేదనను వర్ణించటం
నచ్చిన ఛందంలో
12.07.2012
కరము త్వదీయవత్సలతఁ గాంచితి, పాండవపత్నినౌచు సుం
దరతరమైన ధర్మమును దాల్చిన నాకు ముకుంద! కండకా
వరమున దుస్ససేనుడు సభాసదులందరు చూడ కంససం
హర! మునివంద్య! చేసిన మహాపకృతిన్ స్మరియించు
దరతరమైన ధర్మమును దాల్చిన నాకు ముకుంద! కండకా
వరమున దుస్ససేనుడు సభాసదులందరు చూడ కంససం
హర! మునివంద్య! చేసిన మహాపకృతిన్ స్మరియించు
మాతఱిన్(మచ్చటన్)
No comments:
Post a Comment