రామాయణము - గంగ
(విభిన్నవృత్తములు)
1.
ఛందము : అంబురుహము
గణములు : భభభభరసవ
యతిస్థానము
: 13వ
అక్షరము
శ్రీయుత రాఘవ! శక్తి నొసంగుము, శ్రీలనీ
భువిపైన దా
నాయతవత్సలతన్ జను లందరి కందజేయుచు బాపముల్
స్వీయబలంబున గూల్చెడి గంగను క్షేమదన్ నరపాలు డ
ప్డీయవనిన్ బ్రవహింపగ జేయుట లింపుగా మది నెంచగన్.
2.
ఛందము : ఉత్పలమాల
గణములు : భరనభభరవ
యతిస్థానము
: 10వ అక్షరము
కీర్తన చేసి బ్రహ్మను భగీరథు డాయెడ గంగ భూమిపై
వర్తిలునట్లు సద్వరము భవ్యవిధంబున బొంది యాపగా
నర్తనవేగతీవ్రతను నైజ శిరస్థజటావళిన్ భవుం
డార్తిహరుండు నిల్పి జయ మందగ జేయువిధాన వేడినన్.
3.
ఛందము : అపరాజితము
గణములు : ననరసవ
యతిస్థానము
: 9వ అక్షరము
శివుడు జటలయందు జేర్చగ స్వర్ధునిన్
వివిధగతుల మ్రొక్కి విస్తృతభక్తితో
నవని కరుగజేయు మయ్యరొ నీవనన్
భవుడు ధరణినాథు ప్రార్థన చేకొనెన్.
4.
ఛందము : అశ్వగతి
గణములు : భభభభభగ
యతిస్థానము
: 10వ అక్షరము
అశ్వగతిన్ విను, భవ్యజలాన్వితబిందువునన్
విశ్వహితంకరివై చని వేగమె చేరు మనన్
శశ్వదఘాపహ యౌచును స్వర్నది యాసరమం
దీశ్వరసన్నుతి చేయుచు నింపుగ నిల్చెనుతాన్.
5.
ఛందము : అశ్వలలిత
గణములు : నజభజభజభవ
యతి
స్థానము : 13వ
అక్షరము
సరముననుండి యేడుగతులందు సాగుచు ననేకనామము లటన్
సురనది పొంది భవ్యమగునట్టి శోభను సతంబు గాంచుచు మహ
త్తరయన నందు భూపతికి వెన్క తానొకటి యేగుచుండ నపుడం
దరయగ మత్స్యసంపదలరాశి యందున జరించె కోర్కె లలరన్.
6.
ఛందము : అసంబాధ
గణములు : మతనసగగ
యతిస్థానము
: 12వ అక్షరము
రాజన్యా ధ్వమ్మందు నరుసము కరం బొప్పన్
దేజోవ్యాప్తిన్ గాంచి సురనది మదిన్, జేరన్
నైజంబౌ తృష్ణన్ బహుఖచరగణం బప్డ
వ్యాజానందంబున్ గొనగ గని రహాయంచున్.
7.
ఛందము : ఆటవెలది
ఆభగీరథునకు నట్టులా
యాపగ
వెనుక జేరియుండి విమల యగుచు
నేగుచుండ గాంచి రెంతేని ముదమున
దేవగణము తనివి దీరునట్లు.
8.
ఛందము : ఇంద్రవజ్ర
గణములు : తతజగగ
యతిస్థానము : 8వ అక్షరము
భాగీరథీనామను బాపహారిన్
యోగుల్ మునీంద్రుల్ ముదమొందు రీతిన్
వేగాన్వితన్ జూడగ బ్రీతితోడన్
జాగింతయున్ జేయక సాగి రప్డున్.
9.
ఛందము : ఇల
గణములు : సజననస
యతిస్థానము
: 8వ అక్షరము
ఒకతావునం గన నురుతరమగు
వడిన్
ఒకచోట వక్రత నొకటను
విపులతన్
బ్రకటించు స్వర్నది వరగతి నరుగుచున్
సకలము తానయి సరసతను
నిలిపెన్.
10.
ఛందము : ఉత్సాహము
గణములు : 7సూ+1గురువు
యతిస్థానము
: 5వగణాద్యక్షరము
దూకుచుండి యెత్తునుండి తోరమౌ జవంబుతోన్
బ్రాకుచుండి పథములందు భాగ్యదాయి తాననన్
స్వీకరించి యఘవినాశ విమలదివ్యకార్యమున్
నాకతటిని యేగె మనుజనాథు వెన్క వేడ్కతోన్.
11.
ఛందము : ఉపస్థితము
గణములు : తజజగగ
యతిస్థానము
: 8వ అక్షరము
అచ్చోట తరంగము లారయంగా
హెచ్చైన నినాదము లింపు మీరన్
మెచ్చంగ సురావళి మింటిపైనన్
పెచ్చైన ముదంబట వెల్గ జేసెన్.
12.
ఛందము : ఉపేంద్రవజ్ర
గణములు : జతజగగ
యతిస్థానము
: 8వ అక్షరము
గిరీశ జూటంబున గీర్తి
నందెన్
వరంబు తానంచును బాపకర్ముల్
నిరంతరం బాధుని నీటియందున్
శిరంబులన్ ముంచిరి క్షేమమందన్.
13.
ఛందము : ఏకరూప
గణములు : మభజగగ
యతిస్థానము
: 8వ అక్షరము
గీర్వాణుల్ మౌనులును గిన్నరుల్ గం
ధర్వుల్ పక్షుల్ దితిసుతప్రకాండుల్
సర్వార్యుల్ యక్షులును సర్పకోటుల్
సర్వారాధ్యన్ గొలువ సాగి రందున్.
14.
ఛందము : కందము
ఆరీతి భగీరథునకు
జేరువగా వెంటనంటి శీఘ్రగయై తా
నారమణీయసురాపగ
చేరుచు జహ్నుని కుటీర సీమను ముంచెన్.
15.
ఛందము : కందుకము
గణములు : యయయయగ
యతిస్థానము
: 8వ అక్షరము
అసాధారణుండైన యాతండు
నవ్వేళన్
కసిన్ జూపి గంగన్ స్వకార్యావరోధిన్ దా
దెసల్ నిండు జీవుల్ మదిన్ జోద్య మందంగా
వెసన్ మ్రింగె నౌరా! ఛవిన్ గొప్పవాడౌటన్.
16.
ఛందము : కనకలత
గణములు : 6నగణములు+స
యతిస్థానము
: 13వ అక్షరము
మునులును దివిజులు నట కరము వినయమున నతులన్
ఘనుడగు ఋషివరున కిడి యకలుషమతి యగు నదిన్
జననుతను తనయగను గొన సరియనుచు ననగ నా
యనఘుడు సురనదిని విడిచె నచట నపుడె చెవులన్.
17.
ఛందము : కవిబృంహితము
గణములు : భనభనభనర
యతిస్థానము
: 13వ అక్షరము
ఆముని విడువ నాయమరనది హర్షము గలుగ జాహ్నవీ
నామమును గొని శీఘ్రముగ నరనాథుని వెనుక నేగి యా
భూమిని బలిగృహంబున నతని పూర్వుల బసుమమందు నా
జాముననె ప్రవహించియు ననిపె సద్గతులకయి వారలన్.
18.
ఛందము : కలరవము
గణములు : సనననలగ
యతిస్థానము
: 8వ అక్షరము
సుతవై నృపునకు శుభకరివయి
యీ
క్షితిపై యఘముల జిదుము
మనుచు నా
చతురానను డట జని
పలికిన దా
నతులంబుగ నది యరసిన
దరుసమున్.
19.
ఛందము : కలితాంతము
(గీతాలంబనము)
గణములు : తజజలగ
యతిస్థానము
: 8వ అక్షరము
భాగీరథియై సురవాహిని
తాన్
రాగాత్మకయై యఘరాశి
నిలన్
వేగంబుగ ద్రుంచుచు బ్రేమ మెయిన్
రోగాపహగా నెనరుల్
బడసెన్.
20.
ఛందము : కవికంఠభూషణము
గణములు : సజసససజగ
యతిస్థానము
: 9వ అక్షరము
సురవాహినీగతులు సుందరగాథలు శ్రద్ధతో వినన్
ధరవారి కల్మషము తత్క్షణ మారుట వాస్తవం బిలన్
నిరతంబు గంగ యన నిస్తుల పాపములైన దూరమై
హరిసన్నిధాన మది యందును మానవభక్తకోటికిన్.