Friday, 8 March 2024

ఓం నమ శ్శివాయ హర హర మహాదేవ

 

ఓం నమ శ్శివాయ హర హర మహాదేవ

ఓం కారాకృతి వీవో

   శంకర! సురకోటివంద్య! సర్వారాధ్యా!

   సంకటహర! యభయంకర!

   వంకలు లేనట్టి భక్తి వరముగ నిమ్మా.

వవిధ భక్తుల నెరుగను

  స్తవముల సాహిత్యదీప్తిసరణి నెరుంగన్

  శివ నీ నామస్మరణం

  బవనిని జేసెదను సతత మందుము ప్రణతుల్.

రువకు నీదాసుడనని

  నిరతము జలములను దెచ్చి నిష్ఠాగరిమన్

  హర! నిన్నభిషేకించెద

  పరమాత్మా! నిన్ను జేరు వర మొసగుమయా!

శిరమున గంగను దాల్చిన

  సురవర!  నీరమును గొనుట చోద్యము గాదే

  నరు లొసగెడి జలములతో

  నరయగ నీకగునె తృప్తి యభవా! యిచటన్.

వాదేల నిన్ను బోలరు

  మోదము గలిగించు సురలు భూవలయమునన్

  సాదరముగ నిను దెల్పెడి

  వేదమె దీనికిని సాక్షి విశదచరిత్రా!

తులకు నారాధ్యుండవు

  స్తుతు లందుచు రక్ష సేయు సురవరుడవయా

  సతతము నిను నిల్పెద మది

  నతులిత శివభక్తి నాకు నందించుమయా!

రిహరులకు భేదంబును

  ధర నెవ్వరు దలచుచుంద్రు తప్పక వారిన్

  పరమాత్మ యొక్క డనియెడి

  స్థిరచిత్తము పొందజేయ జేరుము భువికిన్.

యమున నీసేవకులకు

  జయసంతతి గూర్చునట్టి సన్నుతకీర్తీ!

  భయహర! భవనాశంకర!

  ప్రియవచనా! భక్తసులభ! వేవేలనతుల్.

ర! శంకర! మహిమాకర!

  వరదాయక!  సకలలోకవందిత ప్రణతుల్

  కరుణామయ!  శుభసంచయ!

  గిరిపుత్రీహృదయనాథ! క్షిప్రశ్రీదా!

మ్యాంతరంగ! గంగా

  కామ్యద! సురలోకపూజ్య! కవికులవినుతా!

  సమ్యగ్రీతిని బుధజన

  గమ్యా! యిట జూపుమయ్య! కాంక్ష లణంగన్.

మతానిలయా! మదిలో

  సమతాభావంబు నిల్పు శక్తి నొసంగన్

  సుమధురభావస్థిరు నిను

  సమధికసద్భక్తి గొలుతు సంతోషముతోన్.

హానిని గూర్చెడి కృత్యము

  లేనాడును జేయకుండి యీశ్వర! నిన్నే

  యానందంబున గొలిచెడి

  ధ్యానము నామదికి నొసగు మగజానాథా!

దేవా! భావాతీతా!

  నీవే దిక్కంచు నిలిచి నిష్ఠాయుక్తిన్

  సేవించెడి సద్భక్తిని

  కైవల్యద! జనుల కొసగి కావుము తండ్రీ!

నజాక్షుడు స్థిరమతియయి

  నినుగొలువ ననుగ్రహించి నిస్తులశక్తిన్

  మనదగు చక్రాయుధమును

  గొనుమనుచు నొసంగినావు కూర్మిని రుద్రా!


08.03.2024

No comments:

Post a Comment