Friday, 27 October 2023

దసరా

 సీ.

విల్లమ్ములే లేవు విద్యార్థికరములం

దరయంగ నీవేళ నాంధ్రమందు 

పావలా బేడైన పట్టబో మనియెడి 

కమ్మని పద్యాలు కానరావు

హర్షాతిరేకంబు నంది గులాలుతో

నాటలాడుట లిప్పు డసలె లేదు

పులివేషములు కాన మలఘు నాట్యము లేదు 

సరససల్లాపాల వరుస లేదు

తే.గీ.

కాలపరివర్తనంబైన లీల గనుడు 

నాటి సందడి లేకుండ నవ్యజగతి

పర్వదినములు గమియించు వరుసలోన 

వచ్చిపోయెను దశహరా వాస్తవమ్ము.

No comments:

Post a Comment