దైవలీల
చం.
జనన మొసంగు, బెంచు, నిల సౌఖ్యములన్
ఘటియింపజేయుచున్
ధనకనకాదిసంపదలు తన్మయతన్
గలిగించు రీతిగా
ననుపమవత్సలత్వమున నందగ
జూపుచు మోహమందునన్
జనుని మునుంగ జేయుచును సన్నుతులన్
సమకూర్చి వానితో
ననుదిన హర్షసంతతుల నందగజేయుచు
దైవ మన్నియున్
దనవను భావజాలమును దాల్చి
నరుండిట సంచరించుటల్
కని వలదంచు దెల్పుటకు గారణ
మెద్దియొ చూపి యిచ్చటన్
మనగల కాల మేగెనిక మందుడ
పొమ్మని తెల్పి ప్రాణముల్
గొనును, దయాసముద్రుడని, కూర్మిని నిత్యము బంచుచుండి
దీ
వెనల నొసంగు వాడనుచు వేదపురాణము
లన్ని శాస్త్రముల్
ఘనమగు రీతి బల్కు, శుభకారకుడై వెలుగొందు
వాడిటుల్
మనుజునితోడ నీగతిని మాయలు
చేయుట లేల? యర్థముల్,
వినుతిని గాంచు బంధములు విస్తృతరీతిని
జుట్టనేల? జీ
వనగతభాగ్యసంచయము బాయుచు
నొంటరివౌచు మానవా!
చను మననేల? చిత్రమిది, శాశ్వతు డాయత శక్తి మంతుడా
మునిసురవంద్యు డేయెడల మోక్షము
నిచ్చునొ, జన్మబంధముల్
కనుమని త్రోయుచుండునొ, యకారణ సౌఖ్యము లంటగట్టునో
గొనకొని యెవ్వ డేగతిని గోరి
యెరుంగ సమర్ధుడో యిటన్
మనుజులలోన? దేవగణమాన్యు నఘాపహు గొల్చుచుండి
పా
వనమగు జ్ఞానభిక్షనిడ బ్రార్థన
జేయుటకన్న నన్యమై
కనదగు మార్గ మొం డెపుడు కానగ
రాదు ధరిత్రి లోపలన్.
హ.వేం.స.నా.మూర్తి,
29.09.2021.
No comments:
Post a Comment