అద్దె యిల్లు
చం.
ధరపయి జీవనంబునకు దప్పనివై
కనిపించు మూడు సు
స్థిరతను జూపునట్టి వయి
దీప్తిని గూర్చెడి కూడు గూడులున్
వరమగు వస్త్రసంచయము వాస్తవ
మియ్యది వీని యందునన్
నిరుపమధైర్యసౌఖ్యములు నింపు
గృహం బిల మానవాళికిన్. 1.
చం.
గృహమది స్వర్గతుల్యమయి క్షేమదమై విలసిల్లు సీమయై
యిహమున సన్నుతుల్ గొనుచు
నెల్లవిధంబుల హర్షదాయియై
యహరహ మున్నతంబయిన హాయిని
గూర్చుచు నుండి స్వీయమౌ
మహిమను జూపి కాచుగద మానవకోటిని
సంతతమ్ముగన్. 2.
చం.
మనుజున కన్నిరీతులను మాన్యత
గూర్చును గేహ, మందుచే
ఘనమగు స్వీయసద్గృహసుఖంబును
గాంచగ లేనివారికై
యనుపమమైన వత్సలత నందగ జూపుచు
నాదరించు దా
ననుదిన మద్దెయిల్లనుట
లక్షరసత్యము లోకమందునన్. 3.
చం.
తరతమభేద మెంచకయె తన్మయతన్
గలిగించునట్లుగా
నరులు వసించ స్థానమును
నైజశుభాశయ మెల్లదెల్పుచున్
ధరపయి నద్దెయిల్లు సుఖదంబయి
చూపుచునుండు దీని కెం
దరయగ దుల్య మొక్కటియు నన్యము లేదిది సత్య మెప్పుడున్. 4.
ఉ.
దీనులకున్ భయంబు విడ దెల్పుచు
రక్షణ చేయునట్టి యా
మౌనిజనస్తుతుండయిన మాధవు
భంగిని నద్దెయిల్లు స
న్మానము మధ్యవర్గజుల మానసమందున
జూపి కాచుచున్
No comments:
Post a Comment