శ్రీ జయనామసంవత్సర
(ఉగాది) శుభకామనలు
(సుందర కందపద్య
సుమమాల)
శ్రీకరమై జయవత్సర
మాకరమై శాంతి కతుల హర్షాత్మకమై
చేకూర్చు గాత, శుభములు
ప్రాకటముగ యశములొసగి
బహుసుఖదంబై 1.
జయములు కలుగంగా వలె
భయమంతయు తొలగిపోయి
ప్రజలందరకున్
జయవత్సరకాలంబున
క్షయమై కల్మషము, సుఖము
సమకూరవలెన్ 2.
యతనములు సాగగావలె
క్షితిపయి సత్యంబు
నిలుప, సిరులందవలెన్
క్షితిజముల పెంపకంబున
శతశాతము హాయికలిగి
జయవర్షమునన్ 3.
నానావిధసత్క్రతువులు
దానాదులు జరుగవలయు
ధర్మము గావన్
మానవులు సత్యసమరపు
సైనికులై నిలువవలయు
జయవర్షమునన్. 4.
మతభేదము నశియించుట
కతులిత యత్నంబు జరిగి
యత్యద్భుతమౌ
వ్రతదీక్ష బూనగావలె
క్షితిపయి జయహాయనాన క్షేమముగలుగన్. 5.
సంపదలకు నిలయంబై
సంపూర్ణవికాసమంది
జగమంతటిలో
నింపైన యశములాంధ్రము
సంపాదించంగ వలయు జయకాలమునన్. 6.
వత్సరమంతయు భువిపై
సత్సౌఖ్యము లందవలయు,
జయహాయనమం
దుత్సాహవర్ధనంబయి
సత్సంగతి కలుగవలయు
జనులందరకున్ 7.
రమణీయాద్భుతభావం
బమరగ జయకాలమందు హర్షాన్వితులై
సముచితవర్తనతో జను
లమలిన యశమందవలయు నాంధ్రావనిలోన్. 8.
శుభకరమై జయవర్షము
ప్రభవాదుల మేటియౌచు
బహువిధములుగా
ప్రభవింపజేయు జయములు,
విభవంబులు భారతాన
విస్తృతరీతిన్. 9.
భరతావని కీయబ్దము
వరమై సత్ప్రభుత నొసగి
వరుసజయాలన్
నిరతము గూర్చుచు ప్రజలకు
సిరిసంపద లొసగవలయు
శ్రీమంతంబై. 10.
కాలోచిత సద్వృష్టియు,
మేలౌ సస్యంబులంది
మేదినిలోనన్
పాలకులకు జయవత్సర
కాలంబున స్వాంతశుద్ధి
కలుగంగవలెన్. 11.
మనములలో సద్భావము
జనులందరిలోన కలిగి
సద్వైభవమీ
ఘనతరజయవర్షంబున
ననుపమగతి గలుగవలయు
నాంధ్రావనిలోన్. 12.
నవ్యంబౌ రాష్ట్రంబున
సవ్యాలోచనముచేత సత్సౌఖ్యంబుల్
దీవ్యజ్జయవత్సరమున
భవ్యంబుగ నందవలయు
ప్రజలందరకున్. 13.
లుప్తంబై యన్యాయము
వ్యాప్తిం జెందంగ
సత్య మాంధ్రావనిలో
ప్రాప్తములౌ సచ్ఛుభ
సం
దీప్తులు జయవత్సరాన స్థిరభావముతోన్. 14.
ఈ జయనామసంవత్సరం
అందరికీ సుఖసంతోషాల నందిచాలని ఆకాంక్షిస్తూ,
మీ
హ.వేం.స.నా.మూర్తి,
No comments:
Post a Comment