తెలుగు భాష
సీ.
ఏది యజంతమై మోదంబు చేకూర్చు
పలికిన, విన్నను బహుళగతుల,
ఏది మాధుర్యాన నెంచ తేనియకన్న
మిన్నయై యిలలోన సన్నుతి గను,
ఏది యన్నిటిలోన నెల్లరీతుల లెస్స
యని యాంధ్రభోజుని యాఖ్య నలరె,
ఏది సాహిత్యాన నెన్నియో ప్రక్రియ
లకు నయ్యె స్థానంబు లలితగతిని
తే.గీ.
అదియె నాతెల్గుభాష తా ననుపమముగ
శైలులను జూపి నుతినందె సర్వ జగతి
ననయ, మిద్దాని వైభవం బరసి యిచట
పలుక సాధ్యమె స్రష్టయౌ నలువకైన.
No comments:
Post a Comment