తే.గీ.
శ్రీయుతంబైన సౌఖ్యంబు, క్షేమములను
"మకరసంక్రాంతి" "భోగి"తో మమత బెంచు
"కనుము"తోడను సహితమై ఘనతరముగ
హర్షములు గూర్చు గావుత యవనిపైన.
ఉ.
భానుడు హర్షపూర్ణుడయి భాగ్యము బంచగ లోకమందునన్
మానితమైన స్థానమని మాసము నిల్వగ పుత్రగేహమున్
జానుతనంబుమీరగను సంక్రమణంబొనరించు నట్టి యా
వైనము దెల్పు పర్వమున బంధుహితాళికి భవ్యకామనల్.
No comments:
Post a Comment