శ్రీకృష్ణాయనమః
కం.
శ్రీమంత! నందనందన!
స్వామీ! సర్వార్థదాత!
సన్నుతచరితా!
క్షేమప్రాపక! వరగుణ
ధామా! వందనము లందదగునో
కృష్ణా! 1.
కం.
కరుణామయ! శుభకాయా!
నిరుపమమృదుభావదీప్త!నిఖిలవ్యాప్తా!
సురుచిరవాక్యాలంకృత!
వరదాయక ప్రణతులంద
వలయును కృష్ణా! 2.
కం.
యాదవవంశవిభూషణ!
శ్రీదా! యఖిలేశ!
సతము 'జే'యని నిన్నున్
మోదం బందగ దలచెద
నోదేవా భక్తిభావ
మొప్పగ గృష్ణా! 3.
కం.
మునిజనసంస్తుత!
శౌరీ!
యనఘానుగసౌఖ్యకారి!యసురారి!హరీ!
యనుదినధర్మవిహారీ!
కొనుమిట వందనము
చేరి గోపీకృష్ణా! 4.
కం.
మురళీధర! సద్గురువర!
సురుచిరదరహాసభరితసుందరవదనా!
స్థిరతరహర్షవిధాయక!
ధరణీధరధారి!కొనుము
దండము కృష్ణా! 5.
కం.
గోపీవల్లభ! యురుతర
పాపాపహ! భక్తకోటి
బాంధవ! శార్ఙ్గీ!
హే పద్మాక్షా! ప్రణతులు
శ్రీపతి! సద్భక్తి
నీకు జేతును కృష్ణా! 6.
కం.
గోవర్ధనగిరివరధర!
దేవా! నవనీతచోర!
దివ్యాకారా!
పావన భవ్యవిచారా!
తావక పదములకు జేతు
దండము కృష్ణా! 7.
కం.
వందనమయ! గోపాలా!
వందనములు గానలోల!
వరశుభశీలా!
వందనము దైత్యకాలా!
వందనములు స్వీకరించ
వలయును కృష్ణా! 8.
హ.వేం.స.నా.మూర్తి.
24.08.19.
No comments:
Post a Comment