కార్తీకమాసము
కం.
శ్రీమంత
మైన మాసము
క్షేమము
లందంగ గోరు క్షితివారలకున్
నీమంబులు
నేర్పించుచు
కామితములు
దీర్చునదియె కార్తిక మనినన్. 1.
మ.
హరి
యీకాలము నందు స్వామి యగుచున్ హర్షంబులం బంచు, నా
హరు
డీవేళల నెంతయేని సుముఖుండై యుండు, కొల్వంగ తా
నురువాత్సల్యము
జూపు భక్తులపయిన్ హుంకారముం జేసి యీ
నరులం
జేరెడు దుఃఖసంతతులకున్ నాశంబు గల్గించుచున్. 2.
చం.
హరిహర
భేదముల్ గొనుచు నంతట సంకుచితాత్ములై భువిన్
తిరుగుచునుండు
వారలకు తెల్పు నభేదము కార్తికంబు మీ
రరయుడు
మానవుల్ మదుల నచ్యుత శంకరు లొక్కరే యిటన్
సురుచిర
భక్తి భావమును చూపు డటంచును బోధచేయుచున్. ౩.
మ.
ఇది
దామోదర మాసమోయి జనుడా! యిద్దాన నా శంకరున్
సదయున్
నిత్యము నిర్మలాత్ములగుచున్ సద్భక్తులై యర్చనల్
ముదమారంగను
సల్పువారిని సుఖంబుల్ జీవనం బంతయున్
వదలం
జూడవు మోక్షమందు తుద కీ వైనంబు నీ వెంచుమా! 4.
శా.
ప్రాతఃకాలములోన
జాగృతుడవై బ్రాహ్మీ ముహూర్తంబునన్
చేతశ్శుద్ధిని
గాంచి స్నానవిధులన్ చెన్నొందగా జేసి యా
భూతేశున్
కరుణాలవాలు శివునిన్ పూజించు సద్భావనా
న్వీతస్ఫూర్తిని
దాల్చుమోయి శుభముల్ నీకందు తథ్యంబుగన్. 5.
ఆ.వె.
ఆశుతోషు
డాత డీశుడు సత్యంబు
ధ్యాస
నిలిపి యతని కోస మిలను
స్మరణ
చేయువారి కురుతరైశ్వర్యంబు
లిచ్చు
సర్వగతుల మెచ్చు కొనుచు. 6.
మ.
సతమా
శంకరు సన్నిధిన్ నిలిచి యస్మత్పాపసంఘంబులన్
శతసంఖ్య ల్గలవాని
ద్రుంచు మనుచున్ సమ్యగ్విధానంబునన్
నుతులం
గూర్చుచు బిల్వపత్రములతో నూత్నానురాగంబు
సం
తతముం
జూపుచు పూజ చేసి శుభముల్ తథ్యంబు పొందం దగున్. 7.
మ.
అభిషేకప్రియు డౌట నాతని
కెడన్ హర్షాతిరేకంబుతో
శుభముల్
గూర్చు మటంచు చేరి
మదిలో శోభిల్ల సద్భక్తి యా
యభవున్
పావన నిర్మలోదకముతో నర్చించ తా నెల్లెడన్
విభవంబుల్
ప్రవహింప జేయునుగదా! వేరేల యోచించగన్. 8.
మ
మరి యేడాదికిగాని రాదు భువి కీ మాసంబు
కార్తీక మో
నరుడా!
జాగొనరింపకుండ మన మానాగేంద్ర హారాంకితం
బురుహర్షంబున
జేయుమోయి భవ మీయుర్విన్ విచారించగా
స్థిర మొక్కింతయు
గాదు సత్యము గదా సేవించుమా శంభునిన్.
9.
27.11.౨౦౧౮.
No comments:
Post a Comment