జగదంబకు వేడుకోలు
(ఉత్పలమాలిక)
అమ్మల గన్న యమ్మవని, యన్నివిధమ్ముల నండ వౌచు నిన్
నమ్మినవారి
గాతు వని, నవ్యసుఖమ్ము లొసంగుచుండి
ని
త్యమ్మును
హర్షసంతతు లనంతముగా సిరు లిచ్చుచుండి వి
శ్వమ్మున
నిర్మలమ్మయిన
శాశ్వత సద్యశ మిత్తు వంచు ని
న్నిమ్మహి
గొల్చుచుండెదరు హే జగదంబ! కృపావలంబ! స
ర్వమ్మున
నిండియున్న వృషవాహనమానసహారిణీ!యవి
ఘ్నమ్ముగ సర్వకార్యముల గాచుచు బ్రాపుగ
నుండువానికిన్,
దమ్మము
నిల్ప దేవతల దండున నాయకుడైన వాని కీ
వమ్మవు
దుష్టదానవుల నంతము చేయుచు దేవతా గణం
బెమ్మెయి
నైన దుఃఖముల నేసమయమ్మున
గాంచకుండ నం
దమ్మగు
జీవనమ్ములను
తా రెపు డంది సుఖించు నట్టి కృ
త్యమ్ములు
చేయుచుండెదవు హైమవతీ!
శివ! భద్రకాళి! దు
ర్గమ్మ!
మృడాని! చండి! గిరిరాజసుతా! కరుణామయీ! యుమా!
నెమ్మది
నిన్ను నమ్మితిని నిస్తుల శక్తియు, సత్యసూక్తు లం
దమ్ముగ
బల్కు దక్షతయు, ధైర్యము నిండిన మానసమ్ము, భా
వమ్మున
సర్వమానవ శుభప్రద కాంక్షయు, కర్మలందు స
త్వమ్మును
జూపగల్గెడి విధమ్మును,
సభ్యసమాజమందు హృ
ద్యమ్మగురీతి
వర్తనము, తన్మయతన్ గురువృద్ధదీన లో
కమ్మున
కెల్లవేళల నకల్మషభావము నూని సేవలన్
సమ్మతితోడ జేయగల సత్తువ, స్వీయదురాగతమ్ములన్
గ్రమ్మగజేసి
లోకమును గాసిని ద్రోయగ జూచువారి య
త్నమ్ముల
నడ్డు దక్షతయు, తద్గత క్రౌర్యము దుష్టబుద్ధులన్
వమ్మొనరించు
కౌశలము, భవ్యగుణాఢ్యుల చెంత స్నేహమున్,
నమ్మక
మాత్మశక్తిపయి, నైజమతమ్మున
నిర్భయమ్ముగా
గ్రుమ్మరునట్టి
నిశ్చయము, కూడని
వానికి
నేవిధమ్మునన్
నెమ్మిని జూపకుండుటయు, నిచ్చలు
నీపదపద్మయుగ్మమున్
సమ్ముద
మందుచున్ గొలువ జాలెడు శ్రద్ధయు, భారతమ్మునన్
గ్రమ్మిన
స్వార్థరుగ్మత, నకారణ జాతివిభేదభూతమున్,
నమ్మకమందు
ద్రోహము, ననాగరికత్వము, నెల్లమూలలం
జిమ్మిన
నీతిబాహ్యత, నశిష్ట చరిత్రల, నార్యదూషణా
ఖ్యమ్ముల
నున్నతిం జెరచు
యత్నము చేసెడి యుగ్రభూత సం
ఘమ్ముల బారద్రోలగల కాంక్షిత శక్తులు నాకొసంగి గ
ర్వమ్మున
నాట్యమాడెడి నరప్రకరమ్ముల దీప్తులార్పి సౌ
ఖ్యమ్ముల
నీజగమ్మునకు
గల్గగ జేయు మటంచు
వేడెదన్
తొమ్మిది రాత్రులన్ జనని! తోరపు భక్తిని నిష్ఠబూని నీ
కమ్మని సత్కథల్ వినుచు కౌతుక మొప్పగ నీదు కీర్తనం
బెమ్మెలు గాదు తత్పరత నెప్పుడు చేయుచు నుండువాడ నో
యమ్మ! హిమాద్రిరాజసుత! హర్షసుఖాదులు గూర్చుచుండి స
త్యమ్మున నుండువారిని, స్వధర్ముల, దీనుల, భాగ్యహీనులన్
బొమ్మనకుండ త్రాతవయి పోడిమి జూపుచు రక్ష చేసి పూ
జ్యమ్మగు సద్యశమ్ము నిడి చక్కగ సాకుచు నుండుమమ్మ! సం
ఘమ్మున నేడు నిండిన నఘాత్మక చర్యల
నాపుమమ్మ! డెం
దమ్ములలోన శుద్ధతను దాల్చెడి శక్తు లొసంగుమమ్మ! స్వాం
తమ్ములయందు సవ్య సుపథమ్ముల నేగెడి బుద్ధి నిచ్చి నీ
మమ్ముల నాదరించెడి సమాజము నిచ్చట చూపుమమ్మ! స
ర్వమ్మున నుండుదాన వను వాస్తవ మీయెడ తెల్పుమమ్మ! లే
దమ్మ యొకర్తె యన్య మము నండగ గాచెడి తల్లి యిచ్చటన్
కొమ్మిదె నమ్రతన్ నతుల కోటులు చేయుచు నున్నవాడ ని
న్నిమ్మని గోరబోవను మహేప్సిత సంపద లందమైన మా
ర్గమ్మును జూపి పుట్టుకకు రమ్యత గూర్చు మటంచు వేడెదన్.
హ.వేం.స.నా.మూర్తి.
06.09.2018.
No comments:
Post a Comment